పేలిన పెళ్లి కానుక.. వరుడి దుర్మరణం | Wedding Gift Kills Groom in Odisha | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 24 2018 11:29 AM | Last Updated on Wed, Apr 3 2019 3:52 PM

Wedding Gift Kills Groom in Odisha - Sakshi

భువనేశ్వర్‌ : అంగరంగ వైభవంగా పెళ్లి, రిసెప్షన్‌లు జరిగాయి. ఆ ఆనందంలో ఇంటికి చేరిన జంట తమకు వచ్చిన కానుకలను తెరిచి చూసింది. అందులో ఒక కవర్‌ పేలి పెళ్లి కొడుకు, ఓ వృద్ధురాలు మృతి చెందారు. దీంతో ఆ ఇంట పెనువిషాదం నెలకొంది.

బోలన్‌గిర్‌ జిల్లాలోని పట్నాఘడ్‌ గ్రామంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే సౌమ్య శేఖర్‌ సాహూకి రీమా అనే యువతితో ఈ నెల 18వ తేదీన వివాహం జరగ్గా.. 21వ తేదీ రిసెప్షన్‌ నిర్వహించారు. కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక శేఖర్‌ దంపతులు శుక్రవారం ఇంటికి చేరుకున్నారు. తమకు వచ్చిన కానుకల్లో ఒకదానిని తెరవగా అది పేలిపోయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో శేఖర్‌, అతని నానమ్మ జీమా అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన రీమాను బుర్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించటంతో ఆమెను రూర్కెలా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

ఆ గిఫ్ట్‌లో బాంబు మూలంగానే ఈ పేలుడు సంభవించిందని పోలీసులు నిర్ధారించారు. రిసెప్షన్‌లో రికార్డయిన వీడియో దృశ్యాల గిఫ్ట్‌ ఎవరు ఇచ్చారన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పట్నాఘడ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారి సెసదేవ భారియా వెల్లడించారు.   ఇది కూడా చదవండి.. ఆ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతులు!

                                           సౌమ్య శేఖర్‌ మృతదేహాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement