Man Married 14 Woman: పెళ్లంటే ఇద్ద్దరు కలిసి జీవితాంతం కలిసుండేందుకు వేసే తొలి అడుగు. అయితే ఇటీవల పెళ్లంటే మూణాళ్ల ముచ్చటగా సాగుతోంది..వివాహేతర సంబంధాలూ ఎక్కువైపోతున్నాయి.. కానీ ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి నిత్య పెళ్లి కొడుకు అనే పదాన్ని నిత్యం రుజువు చేస్తూనే ఉన్నాడు. ఒకరు, ఇద్దరు కాదు. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని ఇలా ఏకంగా 14 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఎంతకాలమని ఇతర భార్యలకు తెలియకుండా ఈ విషయాన్ని దాచగలడు.. చివరికి ఆరోజే రానే వచ్చింది. తనను పెళ్లి పేరుతో మోసం చేసి డబ్బులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అసలు ఆ నిత్య పెళ్లి కొడుకు ఎవరూ? ఇదంతా ఎక్కడ, ఎలా జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఒడిశాలోని కేంద్రపర జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్(54) అనే వ్యక్తి తనను తాను డాక్టర్‌గా చెప్పుకుంటూ వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలను పెళ్లి పేరుతో మోసం చేశాడు. ఇతను ఒడిశాలో కాకుండా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా నివసిస్తుంటాడు. పంజాబ్, ఢిల్లీ, అస్సాం, జార్ఖండ్, ఒడిశాలకు చెందిన మహిళను తన వలలోకి దింపి రహస్యంగా పెళ్లి చేసుకుంటాడు. మధ్య వయసున్న మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలే ఇతని టార్గెట్. కేంద్ర వైద్యారోగ్య శాఖలో ఉద్యోగినని చెబుతూ మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా మహిళలకు ఎర వేస్తుంటాడు. అంతేగాక బాగా చదువుకొని ఉన్నావారు, ప్రవేటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో ఉన్న వారిని మాత్రమే సంప్రదిస్తాడు. ఇలా వారిని వంచించి పెళ్లి చేసుకుంటాడు. ఇదంతా వారి డబ్బు మీద ఉన్న ఆశతో ఇంతటి పనికి ఒడిగడుతుంటాడు.
పెళ్లయిన తర్వాత కొద్దిరోజులు వారి వద్దే ఉండి తరువాత ఏదైనా పని నిమిత్తం భువనేశ్వర్‌కు వెళతాననే నెపంతో మహిళలను తల్లిదండ్రుల వద్ద వదిలి వెళ్లేవాడు. అయితే జులై 2021లో ఢిల్లీకి చెందిన ఓ టీచర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. న్యూఢిల్లీలోని ఆర్యసమాజ్ ఆలయంలో స్వైన్ తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు భువనేశ్వర్‌లోని ఖండగిరి ప్రాంతంలోని ఓ ఇంట్లో అతన్ని అరెస్టు చేశారు. పోలీసుల విచారణలోనూ నిందితుడు షాకింగ్ నిజాలు వెల్లడించాడు. తను వివిధ మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియాలో పరిచయమైన మరో 13 మంది మహిళలను మోసగించినట్లు తేలింది.
చదవండి: ఎనిమిది మంది భార్యలతో ఒకే ఇంట్లో.. వీడు మామూలోడు కాదండోయ్..
నిందితుని నుంచి 11 ఏటీఎం కార్డులు, 4 ఆధార్ కార్డులు, స్కూల్ సర్టిఫికెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామనీ, ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లు ఇప్పిస్తామనీ నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు స్వైన్ గతంలో హైదరాబాద్‌లోనూ అరెస్టయ్యాడు. అతను సెంట్రల్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా నటిస్తూ దేశమంత అనేక మంది వ్యక్తుల నుండి రూ.2 కోట్ల మేరకు వసూలు చేశాడు. కేరళలోని ఎర్నాకులంలో ఓకేసులోనూ అరెస్టయ్యాడు.
చదవండి: హోటల్‌లో ప్రేయసితో భర్త.. భార్య చేసిన పనికి పరార్
స్వైన్ బాధితుల్లో సుప్రీంకోర్టులో ఒక న్యాయవాది, సీనియర్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఉన్నారు.2018లో పంజాబ్‌కు చెందిన సీఏపీఎఫ్ అధికారిని పెళ్లి చేసుకుని దాదాపు రూ.10 లక్షల మేర మోసం చేశాడు. అనంతరం గురుద్వారాకు చెందిన మహిళను పెళ్లి చేసుకొని ఆసుపత్రి మంజూరు చేస్తానని చెప్పి రూ.11 లక్షలను మోసం చేశాడు. అయితే స్వైన్ ఐదుగురు పిల్లలకు తండ్రి కాగా అతను 1982లో మొదటి సారి వివాహం చేసుకున్నాడు. అప్పటితో మొదలైన ఆయన పెళ్లి బాగోతలు 20 ఏళ్ల వరకు కొనసాగాయి. ఈ ఇరవై ఏళ్ల కాలంలో ఎంతో మంది మహిళలతో స్నేహం చేసి వారిని దొంగ వివాహం చేసుకున్నాడు.
చదవండి: వివాహేతర సంబంధం: భార్య తల నరికిన భర్త.. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చి..
Comments
Please login to add a commentAdd a comment