రాళ్లు పాతెయ్‌.. వెంచర్‌ వేసెయ్‌! | Real Business Fraud | Sakshi
Sakshi News home page

అడ్డగోలుగా ప్లాట్ల విక్రయాలు  

Published Tue, Aug 21 2018 11:29 AM | Last Updated on Tue, Aug 21 2018 11:29 AM

Real Business Fraud  - Sakshi

కావేరమ్మపేట పరిధిలో అనుమతి లేకుండా వెలసిన వెంచర్‌ 

జడ్చర్ల మహబూబ్‌నగర్‌ :  జడ్చర్లలో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. భూమి కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు చేస్తున్నారు. గుడ్డిగా కొలతలు వేసి రాళ్లుపాతి, ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పట్టణం నాలుగు వైపులా విస్తరిస్తుండడం ఈ దందాకు బాగా కలిసివస్తోంది. ఈ క్రమంలోనే జడ్చర్లలో అక్రమ రియల్‌ వ్యాపారం ఊపందుకుంది.  

అనుమతులు ఎందుకు తీసుకోరంటే..? 

వ్యవసాయ భూమిని వెంచర్, ప్లాట్లుగా మార్చాలంటే మొదట ఆ భూమిని వ్యవసాయేతర(నాన్‌ అగ్రికల్చర్‌ ల్యాండ్‌)గా రెవెన్యు రికార్డుల్లో మార్పు చేయాలి. ఇందుకు పూర్తి వివరాలతో సంబందిత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. భూమి విలువలో మూడు శాతం రుసుమును ప్ర భుత్వానికి చెల్లించాలి. తర్వాత సంబంధిత అధికారులు విచారించిన పిమ్మట నాలా సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. అనంతరం నాలాను పొందుపరుస్తూ వెంచర్‌కు సంబందించి రోడ్లు, గ్రామ పంచాయతీ కి సంబందించి 10శాతం కమ్యూనిటీ స్థలాన్ని కే టాయిస్తూ గుర్తింపు పొందిన డిజైనర్‌ నుంచి ఓ లేఅవుట్‌ను తయారు చేయించాలి.

అన్ని ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత గ్రామ పంచాయతీ అ ధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు విచారణ చేస్తారు. తమ పరిధిలో లేకుంటే డీటీసీపీ అధికారులకు ఆయా లేఅవుట్‌ ప్రతిపా దనలను సంబందిత పాలకవర్గం తీర్మానంతో ని వేదించాల్సి ఉంటుంది. అనంతరం డీటీసీపీ అధికారులు విచారించి నిబంధనల మేరకు రోడ్లు, క మ్యూనిటీకి సంబందించిన స్థలాలను కేటాయి స్తూ అనుమతి ఇస్తారు.

దీని ప్రకారం సదరు వెం చర్‌లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్‌ తదితర మౌళిక సదుపాయాలతో వెంచర్‌ను ఏర్పాటు చే స్తారు. తరువాత వినియోగదారులకు అక్కడ ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. అయితే వెం చర్ల నిర్వాహకులు ఇదంతా ఓ ప్రహసనంగా, వ్య యంతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంటూ తమ ఇష్టం వచ్చినట్లు లేఅవుట్‌లను తయారు చేసి సంబంధిత అధికారులు, పాలకులకు అంతో ఇంతో ఇచ్చుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు.

కావేరమ్మపేట పరిధిలో..  

కావేరమ్మపేట(జడ్చర్ల) : మేజర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ వ్యవహారం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, పాలకులు కుమ్మౖక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా కావేరమ్మపేట రైల్వే ట్రాక్‌ సమీపంలో దాదాపు 10ఎకరాలలో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. యథేచ్చగా రాళ్లు పాతి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్లపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement