Real business
-
ప్రాణం తీసిన రియల్ వ్యాపారం
సిరిసిల్లటౌన్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసగించారని బీజేపీ దళిత మోర్చా మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి గడ్డం నాగరాజుపై అభియోగాలు వెల్లువెత్తాయి. సిరిసిల్లకు చెందిన ఎనగందులు వెంకటేశం (56) అలియాస్ ‘భారతీయు డు’.. నాగరాజు ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నుంచి మానకొండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గడ్డం నాగరాజు స్వస్థలం సిరిసిల్ల. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశంకు భూమి అమ్మకానికి ఒప్పుకున్నాడు. నాగరాజు రూ.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనితో శనివారం ఉదయం వెంకటేశం.. నాగరాజు ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజును పోలీసులు అరెస్టు చేయాలంటూ.. శవంతో బంధువులు ధర్నా చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి బలవంతంగా ఆందోళన విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. -
రాళ్లు పాతెయ్.. వెంచర్ వేసెయ్!
జడ్చర్ల మహబూబ్‌నగర్ : జడ్చర్లలో వ్యవసాయ భూములు వెంచర్లుగా మారుతున్నాయి. భూమి కొనుగోలుదారులు ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే లేఅవుట్లు చేస్తున్నారు. గుడ్డిగా కొలతలు వేసి రాళ్లుపాతి, ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జడ్చర్ల పట్టణం నాలుగు వైపులా విస్తరిస్తుండడం ఈ దందాకు బాగా కలిసివస్తోంది. ఈ క్రమంలోనే జడ్చర్లలో అక్రమ రియల్ వ్యాపారం ఊపందుకుంది. అనుమతులు ఎందుకు తీసుకోరంటే..? వ్యవసాయ భూమిని వెంచర్, ప్లాట్లుగా మార్చాలంటే మొదట ఆ భూమిని వ్యవసాయేతర(నాన్ అగ్రికల్చర్ ల్యాండ్)గా రెవెన్యు రికార్డుల్లో మార్పు చేయాలి. ఇందుకు పూర్తి వివరాలతో సంబందిత రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. భూమి విలువలో మూడు శాతం రుసుమును ప్ర భుత్వానికి చెల్లించాలి. తర్వాత సంబంధిత అధికారులు విచారించిన పిమ్మట నాలా సర్టిఫికెట్ జారీ చేస్తారు. అనంతరం నాలాను పొందుపరుస్తూ వెంచర్‌కు సంబందించి రోడ్లు, గ్రామ పంచాయతీ కి సంబందించి 10శాతం కమ్యూనిటీ స్థలాన్ని కే టాయిస్తూ గుర్తింపు పొందిన డిజైనర్ నుంచి ఓ లేఅవుట్‌ను తయారు చేయించాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత గ్రామ పంచాయతీ అ ధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు విచారణ చేస్తారు. తమ పరిధిలో లేకుంటే డీటీసీపీ అధికారులకు ఆయా లేఅవుట్ ప్రతిపా దనలను సంబందిత పాలకవర్గం తీర్మానంతో ని వేదించాల్సి ఉంటుంది. అనంతరం డీటీసీపీ అధికారులు విచారించి నిబంధనల మేరకు రోడ్లు, క మ్యూనిటీకి సంబందించిన స్థలాలను కేటాయి స్తూ అనుమతి ఇస్తారు. దీని ప్రకారం సదరు వెం చర్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ తదితర మౌళిక సదుపాయాలతో వెంచర్‌ను ఏర్పాటు చే స్తారు. తరువాత వినియోగదారులకు అక్కడ ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. అయితే వెం చర్ల నిర్వాహకులు ఇదంతా ఓ ప్రహసనంగా, వ్య యంతో కూడుకున్న వ్యవహారమని పేర్కొంటూ తమ ఇష్టం వచ్చినట్లు లేఅవుట్లను తయారు చేసి సంబంధిత అధికారులు, పాలకులకు అంతో ఇంతో ఇచ్చుకుని ప్లాట్లను విక్రయిస్తున్నారు. కావేరమ్మపేట పరిధిలో.. కావేరమ్మపేట(జడ్చర్ల) : మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ వ్యవహారం జోరుగా కొనసాగుతోంది. అధికారులు, పాలకులు కుమ్మౖక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. తాజాగా కావేరమ్మపేట రైల్వే ట్రాక్ సమీపంలో దాదాపు 10ఎకరాలలో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవు. యథేచ్చగా రాళ్లు పాతి ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఇలాంటి అక్రమ వెంచర్లపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఫార్మాసిటీతో రియల్ వ్యాపారమా?
యాచారం(ఇబ్రహీంపట్నం) : కేసీఆర్ ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రియల్ వ్యాపారం చేస్తుందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముదిరెడ్డి కోదండరెడ్డి ఆరోపించారు. మండల పరిధిలోని కుర్మిద్దలో మంగళవారం ఫార్మాసిటీ భూబాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఫార్మాసిటీని నెలకొల్పుతుందని మండిపడ్డారు. భూసేకరణ చట్టం మేరకు రైతులకు పరిహారం అందజేయలేదు, వర్షాలు కురిస్తే ఫార్మాకిచ్చిన భూముల్లో సాగుచేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. ఫార్మాసిటీని రద్దుచేసే వరకు పోరాటం.. ఫార్మా ఏర్పాటైతే ఈ ప్రాంతం నష్టపోతుందన్నారు. నింబంధనలకు విరుద్ధంగా, రైతులను భయపెట్టి, ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీని కోర్టును ఆశ్రయించి రద్దు చేయిస్తామన్నారు. ఫార్మాసిటీ పేరుతో గ్రామాలకు ఏ అధికారి వచ్చినా తిరగబడాలని రైతులకు సూచించారు. కేసీఆర్ రైతుబంధు పథకం తప్పుల తడక అన్నారు. పథకంలో పాసు పుస్తకాలు, చెక్కుల్లో తప్పులు దొర్లుతున్నాయన్నారు. జిల్లా కలెక్టరే స్వయంగా పర్యవేక్షణ చేసి అడ్డుకోవాలని కోరారు. రైతులు తిరగబడక ముందే రికార్డులు సరిచేయాలన్నారు. 20న ఫార్మా టూర్.... డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీలతో ఆ ప్రాంతాల్లో పర్యావరణం, వాతావరణ , నీటి కాలుష్యం ఏ మేరకు సర్వనాశనమవుతుందో , ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ ఫార్మా బాధితులకు తెలపడానికి ఫార్మాటూర్ ఏర్పాటు చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ తెలిపారు. ఫారా>్మ కంపెనీల వల్ల జరిగే నష్టాలను నక్కర్తమేడిపల్లి, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి గ్రామాల ప్రజలకు చూపిస్తే తీవ్రత తెలుస్తుందని అన్నారు. పర్యావరణవేత్త నర్సింహరెడ్డి మాట్లాడుతూ ఫార్మాసిటీ వద్దని ప్రతి రైతు అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటయితే 750కి పైగా కంపెనీలు ఒకే చోట ఏర్పాటు అవుతాయని , వాటితో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజకవర్గాలు నష్టపోతాయన్నారు. కాంగ్రెస్ యాచారం మండల అధ్యక్షుడు దెంది రాంరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యావరణవేత్తలు ఇంద్రసేనరెడ్డి, సరస్వతి, కుర్మిద్ద మాజీ ఎంపీటీసీ యాదయ్య చారి, యాచారం మండల కిసాన్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి లిక్కి పాండురంగారెడ్డి, నాయకులు సిద్దంకి కృష్ణరెడ్డి, శంకర్‌గౌడ్, మంకాల దాసు పాల్గొన్నారు. -
రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ
జిల్లా అంతటా నిలిచిన {Mయవిక్రయాలు వ్యాపారం కుదరక రద్దవుతున్న అగ్రిమెంట్లు స్తంభించిన రూ.200 కోట్ల వ్యాపారం కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లాలోని రియల్ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రెండు వారాలుగా జిల్లా అంతటా భూ క్రయవిక్రయాలు స్తంభించారుు. ఎక్కడా సెంటు భూమి కొన్న దాఖలాలు లేకుండా పోయారుు. దీంతో కోట్లు కుమ్మరించి రియల్ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల పరిస్థితి తారుమారైంది. భూముల కొనుగోళ్లు, డెవలప్మెంట్ ఛార్జీలకు పెట్టుబడిగా పెట్టిన వందల కోట్ల వ్యాపారాన్ని నోట్ల రద్దు ప్రకటన శరాఘాతంలా తాకింది. తిరుపతి: రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, సత్యవేడు, నగరి, చిత్తూరు, కాణిపాకం, రంగంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా వ్యాపారులు మొత్తం 3వేల ఎకరాల్లో కొత్త వెంచర్లు ప్రారంభించి అమ్మకాలు మొదలు పెట్టారు. తిరుపతి, తొండవాడ, ఏర్పేడు, వికృతమాల, పాడిపేట, చంద్రగిరి, రంగంపేట ప్రాంతాల్లో 60కి పైగా వెం చర్లు వెలిశారుు. జిల్లాలోని సగానికి పైగా లే అవుట్లకు అనుమతులుండగా, మిగతా వాటికి లేవు. అరుునప్పటికీ వ్యాపారులు క్రయవిక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నెల 8న కేంద్రం పెద్ద నోట్లరుున రూ,500, 1000 లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉన్నపళంగా రియల్ వ్యాపారం స్తంభించింది. మరుసటిరోజు నుంచే కొనుగోళ్లు ఆగిపోయారుు. గడచిన రెండు వారాలుగా జిల్లాలో ఎక్కడా సెంటుభూమి కొన్నవా రుగానీ, అమ్మినోళ్లుగానీ లేకుండాపోయారు. ప్రభావం ఇలా... సాధారణంగా భూములు గానీ, ఖాళీ ప్లాటుగానీ కొనుగోలు చేసిన వ్యక్తి మొదట్లో ధర కుదుర్చుకుని కొంత అడ్వాన్సు రూపేణా చెల్లింపులు జరుపుతారు. కొనుగోలు చేసే భూ విలువలో నాలుగో వంతు చెల్లించి అగ్రిమెంట్లు రారుుంచుకుంటా రు. ఈ విధంగా జిల్లాలో వందల కొద్దీ భూముల అగ్రిమెంట్లు జరిగారుు. అగ్రిమెంటు రారుుంచుకున్న వ్యక్తి లేదా కొనుగోలుదారుడు ఒప్పందం ప్రకారం 40 రోజులకో, 60 రోజులకో రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాలి. రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాల్సిన గడువు దగ్గరపడ్డా అటు కొనుగోలుదారు గానీ, ఇటు భూమి విక్రరుుంచిన వ్యాపారిగానీ ముందుకు రావడం లేదు. కారణమేమంటే ...భూమికి గల గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాత్రమే అధికారిక నగదు చెల్లింపులు ఉంటారుు. మిగతా చెల్లింపులన్నీ నల్లధనం కింద కనిపిస్తుంది. ఉదాహరణకు ..ప్రరుువేటు రూ.1 లక్ష విలువ గల భూమికి గవర్నమెంట్ విలువ రూ.25 వేలే ఉందనుకుంటే, కొనుగోలు చేసే వ్యక్తి రూ.25 వేలనే అధికారికంగా చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఈ మొత్తానికే చెల్లిస్తారు. మిగతా రూ.75 వేలూ నగదు రూపేణా చెల్లిస్తుంటారు. అప్పుడు ఈ నగదు నల్లధనంగా పరిగణించాల్సి వస్తుంది. పైగా నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అగ్రిమెంట్లు చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్లు జరిగితే పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఈ నోట్లను వ్యాపారులు తీసుకోవడ లేదు. ఒకవేళ తీసుకున్నా బ్యాంకుల్లో మార్చుకోవడం కష్టం. దీంతో భూ క్రయవిక్రయాలు చాలా వర కూ ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20కి పైగా అగ్రిమెంట్లు రద్దరుునట్లు ‘రియల్ వ్యాపారులు’ చెబుతున్నారు. జిల్లాలో సుమారు రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోరుునట్లు రియల్ వర్గాల అంచనా. తడిసి మోపెడవుతున్న వడ్డీలు జిల్లాలో చాలా మంది రియల్ వ్యాపారులు బిజినెస్ ప్రారంభ సమయంలో భూముల కొనుగోలుకు కోట్లాది రూపాయలు అప్పుగా తెచ్చారు. లే అవుట్లు, డిజైన్లు, అనుమతులతో పాటు రోడ్లు వేసి, మొక్కలు నాటడం వంటి అభివద్ధి పనులకు లక్షలు ఖర్చు పెట్టారు. సకాలంలో అమ్మకాలు జరిగి నగదు చేతిలో పడితేనే తీసుకున్న అప్పులు చెల్లించడం జరుగుతుంది. నోట్ల రద్దు కారణంగా రెండు వారాల నుంచి బిజినెస్ ఆగిపోరుుంది. చేతిలో నగదు చెలామణి నిలిచిపోరుు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. -
స్విస్ చాలెంజ్ లో అసలు రహస్యం !
-
ఇదీ దాపరికం
≈ ఎకరం బేసిక్ ధర రూ. 4 కోట్లకు అదనం ఎంత? ≈ సింగపూర్ కంపెనీలిచ్చిన సీల్డ్ కవర్లోని అంకె ఏమిటి? ≈ అది తెలియకుండా బిడ్డింగ్ ఏమిటి? ≈ ఎవరూ పోటీపడకుండా ఉండడం కోసమేనా ఈ గోప్యత.. ≈ సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.306 కోట్లు ≈ ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్లు ≈ అంటే వాటి ఖర్చు రూ.6 కోట్లేనన్నమాట ≈ రైతుల భూముల్లో, సర్కారు సొమ్ముతో ‘రియల్’ వ్యాపారం ≈ ప్లాట్లు పొందే థర్డ్‌పార్టీ కంపెనీలేవో ఎవరికీ తెలియదు.. సాక్షి, హైదరాబాద్: ‘స్విస్ చాలెంజ్’ అంటేనే రహస్యం.. అది ఓ బ్రహ్మపదార్ధం... అంతా గోప్యం... లొసుగుల మయం... తప్పు చేయాలనుకునేవారికి ఇది అయాచిత వరం లాంటిది. ఈ విధానంలో పారదర్శకత లేదని అత్యున్నత న్యాయస్థానం ఆక్షేపించింది అందుకే... అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘స్విస్ చాలెంజ్’ విధానానికి ‘పచ్చ’జెండా ఊపింది. సింగపూర్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరిచింది. రైతుల భూములతో, సర్కారు సొమ్ములతో సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టి ప్రభుత్వపెద్దలు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి డెరైక్టుగా వేల కోట్లు వెనకేసుకోవడాన్నే చూశాం. ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు. రూ.306 కోట్లు పెట్టుబడిపెట్టే సింగపూర్ కంపెనీలకు వేల కోట్లు దోచిపెట్టడమే కాకుండా... ప్రభుత్వ సొమ్ముతో అభివృద్ధి చేసిన వెంచర్‌ను మార్కెటింగ్ చేసేందుకు ఓ కంపెనీని ఏర్పాటు చేయడం.. ఆ కంపెనీలో సింగపూర్ సంస్థకు మాత్రమే పూర్తి స్థాయి అజమాయిషీని కట్టబెట్టడం... రాష్ర్టప్రభుత్వం పాత్రేమీ లేకుండా నామమాత్రంగా విదిలించే వాటాకు పరిమితం కావడం వంటివి చూస్తే మనకు దిమ్మతిరగడం ఖాయం. సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియంలో రాష్ర్ట ముఖ్యనేతదే కీలకపాత్ర కావడం వల్లనే ఇలాంటి విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. భూమి రైతులది... దాన్ని అభివృద్ధి చేయడానికి పెట్టే ఖర్చు ప్రజలది... లాభాలు మాత్రం సింగపూర్ కంపెనీలవి... రాష్ర్టప్రభుత్వానికి వచ్చే అరకొరవాటా కూడా మార్కెటింగ్ పేరుతో మరో కంపెనీకి కట్టబెట్టడం అన్నిటిలోకెల్లా విచిత్రం... ఈ మార్కెటింగ్ కంపెనీ కూడా కొత్తది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ముఖ్యనేతకు వాటాలున్న సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసేదే ఇది. ‘స్విస్ చాలెంజ్’ విధానం కింద సింగపూర్ ప్రయివేటు కంపెనీల కన్సార్టియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)గా ఏర్పడిన సంగతి తెల్సిందే. అయితే అభివృద్ధి చేసిన లేఅవుట్లకు పబ్లిసిటీ కల్పించడానికి, వాటిని మార్కెట్ చేయడానికి గాను ఓ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఏడీపీ ఏర్పాటు చేయబోతోంది. ఇందుకు గాను ఈ కంపెనీ బ్రోకరేజీ సహా అనేకరకాల ఫీజులు వసూలు చేస్తుంది. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్నే సింగపూర్ కంపెనీలు 58శాతం, రాష్ర్టప్రభుత్వం 42శాతం పంచుకుంటాయి. సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో ఇంకా ఇలాంటి అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. సీల్డ్ కవర్లోని మొత్తం ఎంత? అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు తొలిదశలో ఇస్తున్న 1,691 ఎకరాలలో ఎకరానికి రూ. 4 కోట్లను బేసిక్ ధరగా రాష్ర్టప్రభుత్వం నిర్ణయించింది. సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీపడేది? ఉదాహరణకు సింగపూర్ కంపెనీలు రూ. 4.1 కోట్లను కోట్ చేశాయనుకోండి. అపుడు మిగిలిన కంపెనీలకు ఒక స్పష్టత వస్తుంది. అవి రూ.4.2 కోట్లనో అంతకన్నా ఎక్కువో కోట్ చేయడానికి వీలుంటుంది. కానీ ఇలా రహస్యంగా సీల్డ్ కవర్లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను ఎందుకు అనుమతించారో రాష్ర్టప్రభుత్వ పెద్దలకే తెలియాలి. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్లాట్లు పొందేది ఎవరు? సింగపూర్ కంపెనీలు ఎకరానికి రూ. 4 కోట్లకన్నా ఎంత అదనంగా కోట్ చేశాయో ఆ మొత్తాన్ని ఇప్పటికిప్పుడు రాష్ర్టప్రభుత్వానికి చెల్లించబోవడం లేదు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత వచ్చే లాభాలలో ఆ మొత్తాన్ని కట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 1,691 ఎకరాలను అభివృద్ధి చేసి ప్లాట్ల రూపంలో లే అవుట్లు వేస్తుంది. ఈ లే అవుట్లకు మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి రూ. 5,500 కోట్లను కేటాయిస్తుంది. మౌలిక సదుపాయాలు కల్పించిన తరువాత ఆ ప్లాట్లకు మార్కెటింగ్ కంపెనీ దేశ విదేశాల్లో మార్కెటింగ్ నిర్వహిస్తాయి. ఒక విధంగా సింగపూర్ కంపెనీలు బ్రోకర్‌గా వ్యవహరిస్తాయి. ఆ ప్లాట్లను సింగపూర్ కంపెనీలు ఏర్పాటు చేసే మార్కెటింగ్ కంపెనీయే థర్డ్‌పార్టీకి విక్రయిస్తుంది. వాటిని ఎవరికైనా, ఎంతకైనా విక్రయించవచ్చు. ఉదాహరణకి ఎకరం విస్తీర్ణంలో పాట్లను మార్కెటింగ్ కంపెనీ పది కోట్ల రూపాయలకు విక్రయించిందనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి నాలుగు కోట్ల రూపాయల బేసిక్ ధరను చెల్లిస్తాయి. అలాగే తాము అదనంగా ఇస్తామన్న పది లక్షల రూపాయలను కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాయి. మిగతా 5.90 కోట్ల రూపాయల్లో మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుంటుంది. ఆ తర్వాత మిగిలిన సొమ్ములో ఒప్పందం ప్రకారం సీసీడీఎంసీకి 42 శాతం ఇచ్చి 58 శాతం తాము తీసుకుంటాయి. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే ఈ రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందబోతున్నాయన్నమాట. రైతుల భూముల్లో, ప్రభుత్వ సొమ్ముతో (ప్రజాధనంతో) మౌలిక వసతులు కల్పించిన ప్లాట్లను తాము నచ్చినవారికి, నచ్చిన మొత్తానికి విక్రయించే ‘రియల్’ వ్యాపారం ద్వారా కోట్ల రూపాయలను ఆర్జించబోతున్నాయి. ప్లాట్లను పొందేది ఎవరనేది కూడా స్విస్ చాలెంజ్ డాక్యుమెంట్లో పేర్కొనలేదు. ప్లాట్లను వేలం వేస్తామని గానీ, ఎక్కువ మొత్తం ఇచ్చే వారికే విక్రయిస్తామని గానీ డాక్యుమెంట్లో ఎక్కడా వివరించలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, మార్కెటింగ్ కంపెనీకి ఇష్టమైన వారికే (కంపెనీలకే) ఈ ప్లాట్లు దక్కబోతున్నాయనేది స్పష్టమౌతోంది. సింగపూర్ కంపెనీల పెట్టుబడి ఎంత? ఏడీపీలో సింగపూర్ సంస్థలు ఈక్విటీ కింద పెడుతున్న పెట్టుబడి కేవలం రూ.306 కోట్లు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ సంస్థలకు ఉచితంగా ఇస్తున్న 50 ఎకరాల విలువే రూ.300 కోట్ల రూపాయలుంటుంది. అంటే సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి కేవలం 6 కోట్ల రూపాయలన్నమాట. ఈ 50 ఎకరాల్లో సింగపూర్ సంస్థలే ఐకానిక్ నిర్మాణాలను చేసి విక్రయించుకుంటాయి. ఇందులో ప్రభుతానికి గానీ, ఏడీపీకిగానీ ఎలాంటి భాగస్వామ్యమూ ఉండదు. ఇది కాక మిగతా రెండు దశల్లో సింగపూర్ కంపెనీలకు 200 ఎకరాలను బేసిక్ ధరకు కేటాయిస్తారు. ఆ 200 ఎకరాలపైన కూడా సింగపూర్ సంస్థలకే హక్కు ఉంటుంది. సింగపూర్ సంస్థల ప్రాజెక్టు వ్యయం 3,137 కోట్ల రూపాయలుగా పేర్కొన్నా అందులో మార్కెటింగ్, ప్రచారం, కన్సల్టెంట్ల ఫీజులు, ఐకానిక్ టవర్ వ్యయం కలగలసి ఉన్నాయి. ఈ వ్యయాన్ని కూడా సింగపూర్ కంపెనీలు, సీఆర్డీఏలు ఈక్విటీల ద్వారా, అలాగే తొలి దశ లాభాలు, భూముల విక్ర యం ద్వారా రాబట్టనున్నారు. అంటే పైసా పెట్టుబడి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేత మౌలిక వసతుల కల్పనకు 5,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయించి కోట్ల రూపాయల లాభాలను సింగపూర్ సంస్థలు ఆర్జించనున్నాయన్నమాట. ఈ విధమైన మార్కెటింగ్, లే- అవుట్లు చేసి విక్రయించడానికి సింగపూర్ కంపెనీలు ఎందుకో సర్కారు పెద్దలకే తెలియాలి. సింగపూర్ సంస్థలు కేవలం లే అవుట్లను ప్లాట్లగా థర్డ్‌పార్టీలకు విక్రయించే బ్రోకరేజీ పని చేయనున్నాయి. భవనాలు నిర్మాణం, ప్లాట్ల అభివృద్ధి థర్డ్‌పార్టీ కంపెనీలే చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ భవనాలను గానీ, రహదారుల నిర్మాణాల నిర్మాణాలను గానీ సింగపూర్ సంస్థలు చేయవు. వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సి ఉంది. మార్కెటింగ్ కోసం మేనేజ్మెంట్ కంపెనీ సింగపూర్ కంపెనీల మరో మాయాజాలం అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ (ఏడీపీ)లో సింగపూర్ కన్సార్షియం, కేపిటల్‌సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేషన్ (సీసీడీఎంసీ) కలసి ఉన్నా అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతోంది. సింగపూర్ కన్సార్షియంకు 58శాతం వాటా, సీసీడీఎంసీకి 42శాతం వాటా.. చూస్తేనే ఈ విషయం అర్ధమౌతోంది. అయితే స్విస్ చాలెంజ్ విధానంలో దశలవారిగా జరిగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రక్రియలో కార్యకలాపాల నిర్వహణ బాధ్యత అంతా చూడడం కోసం ఓ మేనేజ్మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్మెంట్, డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణ వంటి వ్యవహరాలన్నీ ఈ కంపెనీయే చూస్తుంది. లేఅవుట్లు, ప్లాట్ల గురించిన ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఒక్కో దశలో ఐదేళ్లపాటు ఈ వ్యవహారాలన్నీ ఈ కంపెనీ నెరవేరుస్తుందని స్విస్‌చాలెంజ్ ప్రతిపాదనలలో పేర్కొన్నారు. అందుకయ్యే ఖర్చులన్నిటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏఏ ఖర్చులుంటాయో వాటికి ఎంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనలలో ప్రస్తావించారు. వాటి వివరాలివీ.. 1. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి.. - ప్రాజెక్టు వ్యయంలో 5.5శాతం 2. మార్కెటింగ్ సర్వీసులకు... - మొత్తం అమ్మకాలలో 2శాతం లేదా థర్డ్‌పార్టీకి చెల్లించే ఫీజు + 0.75శాతం మార్జిన్లలో ఏది ఎక్కువైతే అది 3. థర్డ్‌పార్టీ ఏజెంట్లను లేదా బ్రోకర్లను నియోగిస్తే... - బ్రోకరేజీకి అయ్యే వాస్తవ ఖర్చులు + 20శాతం 4. లీజ్మేనేజ్మెంట్ సర్వీసులు.. - మొత్తం ఆదాయంలో 1శాతం 5. ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసులు - మొత్తం ఆదాయంలో 2శాతం ఇవి కాక అద్దెకు తీసుకునే ఆస్తులకు సంబంధించిన మార్కెటింగ్ సర్వీసులకు కూడా ఫీజులు వసూలు చేయనున్నారు. ఏడీపీ పేరుతో అభివృద్ధి చేసే ప్లాట్లను థర్డ్‌పార్టీకి విక్రయించడం కోసం ప్రచారం, మార్కెటింగ్ నిర్వహించే ఈ మేనేజ్మెంట్ కంపెనీ అందుకోసం రకరకాల ఫీజుల పేరుతో భారీమొత్తంలో వసూలు చేస్తుంది. అవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58శాతం, సీసీడీఎంసీ 42శాతం తీసుకుంటాయి. -
‘చాలెంజ్’.. ఇది దోపిడే
-
‘చాలెంజ్’.. ఇది దోపిడే
‘స్విస్ చాలెంజ్’ ముసుగులో భారీ కుంభకోణం రైతుల భూములతో రియల్ వ్యాపారం... ♦ సింగపూర్ కంపెనీలతో కలసి రూ.వేల కోట్లు కొట్టేసే వ్యూహం ♦ అంతా రహస్యం... పారదర్శకత మృగ్యం ♦ ప్రభుత్వ వాటా తగ్గించడమే పెద్ద స్కామ్ ♦ సింగపూర్ కన్సార్టియంకు 58శాతం వాటా ♦ రూ. 306 కోట్ల పెట్టుబడికి.. రూ.27,461.84 కోట్ల లాభం ♦ సర్కారు వాటా 42 శాతానికి పరిమితం ♦ రూ.5,721.9 కోట్లు ఖర్చు చేస్తే వచ్చేది రూ.19,886.16 కోట్లే.. ♦ అసెంబ్లీ, సచివాలయం లాంటివీ కట్టరు రాజధాని ప్రకటనకు ముందే లక్ష కోట్లు కొట్టేశారు... అందుకు ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ను ప్రయోగించారు. ఇపుడు మరో లక్ష కోట్లు కొట్టేయబోతున్నారు. ఇందుకు‘స్విస్ ఛాలెంజ్’ను ప్రయోగిస్తున్నారు. సాక్షి, హైదరాబాద్: రాజధాని ఎక్కడ వస్తుందో ప్రకటించడానికి ముందు పేద రైతుల భూములు కొట్టేసి లక్ష కోట్ల మేర లబ్దిపొందిన సర్కారు పెద్దలు ఇపుడు ‘స్విస్ చాలెంజ్’ ముసుగులో మరో ఘరానా దోపిడీకి స్కెచ్ వేశారు. రైతుల నుంచి సమీకరించిన భూములను స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెర తీసి మరో లక్ష కోట్లు కొట్టేసే పక్కా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ప్రధాన రాజధాని కేంద్రం(సీడ్ కేపిటల్)లో అత్యంత విలువైన 1,691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనలోని మతలబులన్నీ ఇప్పటికే బట్టబయలయ్యాయి. స్విస్ చాలెంజ్ విధానంలో పారదర్శకత లేనే లేదని సుప్రీం కోర్టు ఎప్పుడో తెగేసిచెప్పింది.. ఎలాంటి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రోత్సహించవద్దని గతంలోనే కేల్కర్ కమిటీ ప్రతిపాదించింది. మేధావులు, సామాజిక శాస్త్రవేత్తలు.. ఆర్థిక నిపుణులు వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు స్విస్ చాలెంజ్ విధానంలోనే రాజధాని మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించారు. సింగపూర్ సంస్థలతో కలిసి దోచుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న ప్రయత్నాలన్నిటినీ ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంది. తాజాగా స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ వ్యవహారశైలిని ఉమ్మడి హైకోర్టూ తప్పుబట్టింది. అయినా ఈ విధానంపై రాష్ర్ట ప్రభుత్వం ముందుకు పోవడం వెనుక లక్ష కోట్ల దోపిడీ ప్రణాళిక దాగి ఉంది. ఇలా... పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే... పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ర్టప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ఎస్టేట్ వ్యాపారం ఇది. ప్రధాన రాజధాని కేంద్రంలో చేపట్టే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియంకు కట్టబెట్టి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేలాది కోట్లు కొట్టేయడానికి స్కెచ్ వేశారు. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైనా అక్కడ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టరు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవీ అక్కడ ఉండవు. కేవలం భూమిని అభివృద్ధి చేస్తారంతే. 1,691 ఎకరాల భూమిని చదును చేసి మౌలికసదుపాయాలన్నీ కల్పించి ప్లాట్లు వేసి అమ్మేస్తారు. వాటిని సింగపూర్ కంపెనీలు పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’ విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందసు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి. లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక ఇదీ... ≈ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది. ≈ కానీ సింగపూర్ కంపెనీల్లో బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని, ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ తగ్గించమనడం గమనార్హం. ≈ ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ≈ ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో. ≈ రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారు. ≈ ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే. ≈ అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు ప్లాన్ వేసినట్లు అర్ధమౌతోంది. అంతా గోప్యం.. సుప్రీం మార్గదర్శకాలు బేఖాతర్ రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికలో స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసే క్రమంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. మహారాష్ట్రలోని థానే మున్సిపల్ కార్పొరేషన్లో గృహాల నిర్మాణానికి డెవలపర్(కాంట్రాక్టర్) ఎంపిక కేసును విచారించిన సుప్రీం కోర్టు మే 11, 2009న తీర్పు ఇచ్చింది. ఆ క్రమంలో స్విస్ చాలెంజ్ విధానం అమలుకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని నిక్చచ్చిగా అమలు చేయాలంటూ అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి పీవీ రమేష్ జారీ చేసిన ఉత్తర్వులను సీఎం చంద్రబాబు బుట్టదాఖలు చేయడం గమనార్హం. మార్గదర్శకం 1: స్విస్ చాలెంజ్ విధానం కింద ఏ తరహా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టాలన్నది ప్రభుత్వం తొలుత గుర్తించి, వాటిపై బహిరంగ ప్రకటన చేయాలి. ఉల్లంఘన: రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ స్విస్ చాలెంజ్ విధానంలో చేపట్టే ప్రాజెక్టుల వివరాలను బహిర్గతం చేయలేదు. మార్గదర్శకం 2: ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మాస్టర్ డెవలపర్ ఎంపికకు ప్రభుత్వం ప్రతిపాదనలు ఆహ్వానించవచ్చు. లేదా ఎవరైనా స్వచ్ఛందంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించవచ్చు. మాస్టర్ డెవలపర్ ఎంపికలో సంస్థలతోగానీ.. కాంట్రాక్టర్లతోగానీ ఎలాంటి ముందస్తు సంప్రదింపులు చేయకూడదు. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియంతో ముందస్తు సంప్రదింపుల కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈలోగా జూలై 7న సీఎం చంద్రబాబు నేరుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చలు జరిపారు. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ నేతృత్వంలోని మౌలిక వసతుల కల్పన అథారిటీ నిరసించింది. మార్గదర్శకం 3: ఒరిజినల్ ప్రాజెక్టు ప్రపోజర్(ఓపీపీ) చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేయాలి. ఈ వ్యవహారంలో ఎలాంటి గోప్యత ఉండకూడదు. ఉల్లంఘన: స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు ద్వారా వచ్చే ఆదాయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తామన్నది సింగపూర్ సంస్థలు బహిర్గతం చేయలేదు. వాటిని సీల్డ్ కవర్లో ఉంచినట్లు టెండర్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కౌంటర్ ప్రతిపాదనలు చేసే సంస్థలకు ప్రతికూలం. మార్గదర్శకం 4: ఓపీపీ కన్నా మెరుగైన ప్రతిపాదనలతో తక్కువ ధరకు ప్రాజెక్టు పూర్తి చేసే అవకాశాలను అన్వేషించాలి. కౌంటర్ ప్రతిపాదనల దాఖలుకు కనీసం 60 రోజుల సమయం ఇవ్వాలి. ఉల్లంఘన..: కేవలం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. మార్గదర్శకం 5: ఓపీపీతోపాటు కౌంటర్ దాఖలు చేసే సంస్థలకూ సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి. ఉల్లంఘన: కేవలం విదేశాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టిన సంస్థలకే కౌంటర్ ప్రతిపాదనలు దాఖలు చేసే అర్హత కల్పించారు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు కోసం ఏడాదికి కనిష్టంగా రూ.150 కోట్ల నుంచి గరిష్టంగా రూ.300 కోట్లు ఖర్చు చేస్తారు. టెండర్లో షెడ్యూలు దాఖలుకు ఏడాదికి కనీసం రూ.రెండు వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలకే అవకాశం కల్పించేలా నిబంధన పెట్టారు. వీటిని పరిశీలిస్తే సింగపూర్ కన్సార్టియంకు లబ్ధి చేకూర్చడానికే సుప్రీం మార్గదర్శకాలను అడ్డగోలుగా ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ వాటా తగ్గించారు... ఏపీఐడీఈ-2001 చట్టం తుంగలో తొక్కారు ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబ్లింగ్ (ఏపీఐడీఈ)-2001 చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ చట్టాన్ని సింగపూర్ సంస్థల కోసం తానే సవరించారు. రాష్ట్రంలో ఏ సంస్థకైనా గరిష్టంగా 33 ఏళ్లకు భూములు లీజుకివ్వాలని ఏపీఐడీఈ చట్టంలోని నిబంధనను.. 99 ఏళ్లకు లీజు లేదా భూమిపై పూర్తి హక్కులు కల్పించేలా మార్పులు చేశారు. ఇక ఆ చట్టాన్ని అడ్డగోలుగా ఉల్లంఘించారు. నిబంధన 1: ఏ ప్రాజెక్టులోనైనా ప్రభుత్వానికి కనిష్టంగా 51 శాతం వాటా ఉండాలి. ఉల్లంఘన: సింగపూర్ సంస్థల కన్సార్టియం స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి 50 శాతం.. తనకు 50 శాతం వాటా ఉండేలా అక్టోబరు 30, 2015న ప్రతిపాదించింది. కానీ.. గత జూలై 7న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో సీఎం నేరుగా చర్చలు జరిపాక ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా 48 శాతానికి పరిమితమైంది. సింగపూర్ సంస్థల కన్సార్టియం వాటా 52 శాతానికి పెరిగింది.ఈ మర్మమేమిటన్నది సీఎం చంద్రబాబుకే ఎరుక. నిబంధన 2: ప్రాజెక్టులపై అజమాయిషీ ప్రభుత్వానికే ఉండాలి. ఉల్లంఘన..: ఆరుగురు డెరైక్టర్లతో ఏడీపీ పాలక మండలిని ఏర్పాటు చేయాలని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయి. ఇందులో నలుగురు సింగపూర్ సంస్థల ప్రతినిధులు.. ఇద్దరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. ఏడీపీ చైర్మన్‌గా తమ సంస్థలకు చెందిన డెరైక్టర్నే నియమించాలని కోరాయి. ఒక్కో డెరైక్టర్‌కు కనిష్ఠంగా 15 శాతం వాటా ఉంటుంది. ఏడాదికి నాలుగు సార్లు బోర్డు సమావేశమవుతుంది. 12 నెలలపాటూ ఒక డెరైక్టర్ బోర్డు సమావేశాలకు గైర్హాజరైతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది. ఆ స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తారు. ఒప్పందంలో అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఐదేళ్లపాటు ఎవరూ వాటాలను విక్రయించకూడదు. ఆ తర్వాత కూడా ప్రైవేటు సంస్థ వాటా 26 శాతానికి తగ్గకూడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాటాలను విక్రయించాలని భావిస్తే తొలుత సింగపూర్ సంస్థలకే అవకాశం ఇవ్వాలి. సింగపూర్ సంస్థలు కొనేందుకు నిరాకరిస్తేనే ఇతరులకు విక్రయించాలి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని బట్టి చూస్తే సింగపూర్‌కు ఏ స్థాయిలో రాష్టర ప్రభుత్వం సాగిలబడిందో అర్థం చేసుకోవచ్చు. నిబంధన 3: ప్రాజెక్టుల్లో ఏవైనా వివాదాలు తలెత్తితే హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఇద్దరు నిపుణులు సభ్యులుగా నియమించిన కమిటీ వాటిని పరిష్కరిస్తుంది. ఉల్లంఘన..: సింగపూర్ కన్సార్టియం ఒత్తిళ్లకు తలొగ్గిన సర్కార్.. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో వివాదాల పరిష్కారానికి లండన్ కోర్టును వేదికగా ఎంచుకున్నారు. కేల్కర్ కమిటీ ప్రతిపాదనలూ బుట్టదాఖలే.. దేశంలో మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులు చేపట్టే విధానాలపై అధ్యయనం చేయడానికి విజయ్ కేల్కర్ అధ్యక్షతన 2011లో యూపీఏ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. బీవోటీ(బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్పర్) నుంచి స్విస్ చాలెంజ్ వరకూ అన్ని విధానాలపై సమగ్ర అధ్యయనం చేసిన కేల్కర్ కమిటీ.. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేయవద్దంటూ నవంబర్, 2015న కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. కానీ.. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన సీఎం చంద్రబాబు మాత్రం కేల్కర్ కమిటీ ప్రతిపాదనలను తుంగలోతొక్కి స్విస్ చాలెంజ్ విధానాన్ని అమలు చేస్తోండటం గమనార్హం. -
రియల్ దొరలెందరో?!
జి.ఉమాకాంత్, సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నవ్యాంధ్రప్రదేశ్‌కు ఆర్ధిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ నగరంలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చేశాయి. రియల్ బూమ్ ఆకాశాన్నంటిన నేపథ్యంలో సందుకొకరు, వీధికొకరుగా బ్రోకర్లు, రియల్టర్లు పుట్టుకొచ్చారు. వీరికి అండగా రౌడీషీటర్లు రంగంలోకొచ్చారు. ప్రతి ఏరియాలోనూ భూదందాలు మొదలుపెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు.. పాగా వేయడం, నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఒక్క స్థలాన్నే పదిమందికి అమ్మేయడం, ఐదారుగురికి రిజిస్ట్రేషన్ చేయించడం.. చివరికి సెటిల్మెంట్ చేసి బలవంతులకు అప్పగించడం.. ఈ తరహా సెటిల్మెంట్లు నగరంతోపాటు, శివారు ప్రాంతాల్లో కొన్నేళ్లుగా నిత్యకృత్యమయ్యాయి. అసలు బ్రోకర్లు, రియల్టర్లు, రౌడీషీటర్లు.. వీళ్లంతా ఎందుకు?.. మనమే రియల్ వ్యవహారాలన్నీ సెటిల్ చేస్తే కోట్లకు కోట్లు కొట్టేయొచ్చని కొందరు పోలీసులు భావించారు. అంతే.. విశాఖ నగరం, జిల్లాలోని చాలామంది పోలీసులు రియల్ బాట పట్టారు. ఎస్సైలు, సీఐలు మొదలు ఎక్కడి నుంచో నగరానికి బదలీపై వచ్చిన ఉన్నతాధికారుల వరకు బినామీల పేరిట రియల్ వ్యాపారం మొదలెట్టేస్తున్నారు. భీమిలిలో ఓ పోలీసాయన అసలు ఉద్యోగాన్ని తూతూ మంత్రంగా చేస్తూ నిత్యం రియల్ ఎస్టేట్ లావాదేవీల్లోనే మునిగితేలుతుంటాడు. సంగివలస, నమ్మివానిపేట, ఆదర్శనగర్, కాపులుప్పాడ ప్రాంతాల్లో ఇటీవల కబ్జాల వివాదాలు పెరిగాయి. దీన్నే ఆసరా చేసుకున్న సదరు ఖాకీ స్వయంగా పంచాయితీలు చేసి ‘నాకింత... మీకింత’ పద్ధతిలో సుమారు రూ.40 కోట్లు వెనకేసుకున్నారని అంటున్నారు. మధురవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయనకు రూ.15 కోట్ల స్థిరచరాస్తులు ఉన్నాయని చెబుతున్నారు. ఆయన గారు చేసే పంచాయితీలకు భీమిలి స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జి వేదికవుతోంది. ఆ లాడ్జి కూడా ఆయనదేనని, బావమరిది పేరిట తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఆనందపురంలో మరో పోలీసాయన ల్యాండ్ సెటిల్మెంట్ల ద్వారా రూ.కోట్లకు పడగలెత్తాడు. ఇసుక లారీలపై తప్పుడు కేసులు బనాయించి డ్రైవర్లు, ఓనర్ల నుంచి పెద్దమొత్తంలో వసూలు చేస్తారన్న ఆరోపణలపై ఈయన్ను పై అధికారులు తలంటినా మార్పు రాలేదని అంటున్నారు. 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ డీఎస్పీ కూడా రియల్ సెటిల్మెంట్ల ద్వారానే కోట్లకు పడగలెత్తాడని అంటున్నారు. ఒక్క విశాఖ నగరంలోనే యాభై కోట్ల విలువైన స్థిరచరాస్తులు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే వేస్తున్న లెక్క. ఆ మధ్య మధురవాడలో ఏకండిగా 18ఎకరాల భూమిని బినామీల పేరిట కొనుగోలు చేశారు. భూములు కొనుగోలు చేయడం, మంచి ధర వస్తే అమ్మేయడం.. ఇలా భూక్రయవిక్రయాల్లోనే సదరు పోలీసు అధికారి మునిగి తేలుతుంటాడని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఈ మధ్యనే నగరం నుంచి బదలీ అయిన ఓ ఉన్నతాధికారి రియల్ పంచాయితీల ద్వారా రూ.20 కోట్లు వెనకేసుకున్నారన్న వాదనలు ఉన్నాయి. ఉత్తరాదికి చెందిన అధికారే అయినప్పటికీ విశాఖలో బినామీల పేరిట భూములు కొనుగోలు చేశారనేది పోలీసువర్గాలే చెబుతున్న మాట. ఓ డివిజన్ స్థాయి అధికారి నగరంలో తన సోదరుడి పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం అడ్డూ అదుపూ లేకుండా చేసేస్తున్నారు. నగరంలో లెక్కలేనన్ని భూదందాలతో కబ్జాదారుడిగా లోకాయుక్త విచారణ కూడా ఎదుర్కొన్నసోదరుడికి ఆ అధికారి వెన్నుదన్నుగా నిలుస్తుంటారు. సోదరుడు వేసిన సుమారు 20 రియల్ వెంచర్లకు పెట్టుబడితో పాటు అండదండలన్నీ సదరు అధికారే అందిస్తుంటారు. గాజువాకలో ఖల్నాయక్ కూర్మన్నపాలెంలో ఆ మధ్య ఓ భూమి విషయంలో కొనుగోలుదారులు, కబ్జారాయుళ్ల మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. లే అవుట్లు చెల్లవంటూ కబ్జారాయుళ్లు ఆ భూమిలోకి దౌర్జన్యంగా ప్రవేశించడానికి రంగం సిద్ధం చేశారు. దీంతో కొనుగోలుదారులు దువ్వాడ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి తమ వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపించారు. విచారణ చేపట్టిన పోలీసులు కొనుగోలుదారులకు మద్దతుగా నిలిచారు. దీంతో కబ్జారాయుళ్లు ఓ పోలీసు అధికారిని ఆశ్రయించి డీల్ కుదుర్చుకున్నారు. సుమారు రూ.3 కోట్లకు బేరం కుదరడంతో ఆ అధికారి అక్రమార్కుల వైపు నిలబడ్డారు. కొనుగోలుదారులపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. మొత్తంగా ఆ భూమిని కబ్జారాయుళ్ల పరం చేసేశారు. గాజువాక పరిధిలో ఇప్పుడు పనిచేస్తున్న 1991 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి రియల్ దందాలే పెట్టుబడిగా కోట్లకు పడగలెత్తాడు. గతంలో ఏసీబీ అధికారులకు అడ్డంగా చిక్కినా ఆర్నెల్లలోపే తిరిగి పోస్టింగ్ సాధించుకున్న ఘనుడిగా పోలీసువర్గాల్లో పేరు సంపాదించాడు. విజయవనగరం జిల్లా కొత్తవలస, జీడివలస, రాజాం, గరివిడి ప్రాంతాల్లో విలువైన భూములు కొనుగోలు చేశారన్న ప్రచారం ఉంది. ఆరిలోవ ప్రాంతంలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారే ఇప్పుడు ఆ ఏరియాలో పెద్ద రియల్ బ్రోకర్. అక్కడ స్థలాలు అమ్మాలన్నా, కొన్నాలన్న ఆ అధికారిని సంప్రదిస్తే చాలు. అన్నీ సెటిల్ చేసేస్తారు. భూకబ్జారాయుళ్లకు, దందాలు చేసే వాళ్లకు ఈయనే అండ. 1996 ఎస్సై బ్యాచ్‌కు చెందిన ఆ అధికారి గతంలో నర్సీపట్నంలో పనిచేసినప్పుడు రంగురాళ్ల వ్యాపారం చేసి రూ.కోట్లకు పడగలెత్తారు. ఆయనకు వాల్వో బస్సులు కూడా ఉన్నాయంటే మనోడి సంపాదన ఏ రేంజ్లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నగర కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న 1996 ఎస్సై బ్యాచ్‌కే చెందిన మరో అధికారి పూర్తిగా రియల్ వ్యాపారం మీదే దృష్టి పెట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో గతంలో పనిచేసినప్పుడు రైస్ పుల్లింగ్ గ్యాంగులతో మిలాఖత్ అయ్యారు. అప్పుడు అడ్డంగా సంపాదించిన సొమ్మును ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులుగా పెడుతున్నారు. పద్యాలు, కవితలతో పై అధికారులను బుట్టలో వేసుకునే పోలీస్‌గా పేరున్న సదరు ఖాకీ సొంత జిల్లా అయిన శ్రీకాకుళంలో విలువైన భూములు కొన్నాడని అంటున్నారు. ఏసీబీకి దొరికినోడు దొంగ.. దొరక్కపోతే దొర చందంగా నడిచిపోతున్న నేపథ్యంలో ఈ రియల్ పోలీసుల పని పట్టేదెవరో? -
రియల్‌కు గ్రీన్ బెల్ట్ దెబ్బ
ఖాళీగా అపార్ట్మెంట్లు అరకొరగా విక్రయాలు దిగిరాని ధరలు ఉయ్యూరు : గ్రీన్ బెల్ట్ ప్రభావం రియల్ వ్యాపారంపై తీవ్రంగా చూపుతోంది. ఉయ్యూరు మున్సిపాలిటీతో పాటు పరిసర గ్రామాల్లో రియల్ ఎస్టేట్ అమ్మకాలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి. ఎక్కడికక్కడే రియల్ వెంచర్లు ఖాళీగా దర్శనమిస్తూ పొదలను తలపిస్తున్నాయి. వెంచర్లలో సరైన వసతులు కల్పించకపోవడం.. కొన్ని వెంచర్లకు సీఆర్డీఏ అనుమతులు లేకపోవడం కూడా రియల్ ఢమాల్కు కారణం. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అపార్ట్మెంట్లదీ అదే పరిస్థితి. బీడుభూములుగా వెంచర్లు పట్టణంతోపాటు మండలంలోని గండిగుంట, చిన ఓగిరాల, ఆకునూరు, పెద ఓగిరాల, కడవకొల్లు, కాటూరు, గరికపర్రు రోడ్డు, యాకమూరు రోడ్లలో 100 ఎకరాలకుపైగా పొలాల్లో వ్యాపారులు వెంచర్లు వేశారు. శివారు ప్రాంతాల్లో సెంటు రూ.4 నుంచి రూ.5 లక్షలు, పట్టణంలో ప్రధాన రహదారి కిలోమీటరు లోపల సెంటు రూ.10 లక్షలకుపైగా ధరలు నిర్ణయించారు. వెంచర్లు వేసిన ప్రాంతాల్లో అభివృద్ధి లేకపోవడంతో ఇళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఖాళీగా 400 ప్లాట్లు..! పట్టణంలో అపార్ట్మెంట్ల సంస్కృతి విపరీతంగా పెరిగింది. తొలుత ఈ అపార్ట్మెంట్ల నిర్మాణం లాభాలను తెచ్చిపెట్టడంతో ఎక్కువ మంది ఈ నిర్మాణాలపై దృష్టి పెట్టారు. దుర్గా ఎస్టేట్స్, ఫ్లోరా రోడ్డు, శ్రీనివాస రోడ్డు, కాటూరు రోడ్డు, రాజర్షి నగర్, మూర్తిరాజుగూడెం డొంక, తదితర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు నిర్మించారు. పదికిపైగా అపార్ట్మెంట్లు నిర్మాణం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగస్తులు, దూర ప్రాంతాల వ్యక్తులకు ఈ అపార్ట్మెంట్లను భూతద్దంలో చూపి దళారులు ఎలాగొలా కట్టబెడుతున్నారు. త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు రూ.25 నుంచి రూ.30 లక్షలు, డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు రూ.18 నుంచి రూ.24 లక్షలుకు రేట్లు ఫిక్స్ చేశారు. పట్టణంలో ఎక్కడైనా కానీ 400 ప్లాట్లు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. -
రిజిస్ట్రేషన్ శాఖకు కాసుల వర్షం
► గడువుకు ముందే లక్ష్య సాధన ► ఫిబ్రవరి నాటికే రూ.162.12 కోట్ల ఆదాయం ► 1,05,415 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ అనంతపురం టౌన్: రిజిస్ట్రేషన్ శాఖ లక్ష్యానికి మించిన ఆదాయంతో దూసుకెళ్తోంది. అనంతపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 12, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలో 9 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. 2015-16 సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు ఈ రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.153.99 కోట్ల ఆదాయం లక్ష్యం కాగా ఏకంగా 162.12 కోట్ల ఆదాయ లభించింది. అనంతపురం పరిధిలో రూ.93.28 కోట్లకు రూ.103.69 కోట్లు రాగా, హిందూపురం పరిధిలో రూ.60.71 కోట్లకు రూ.58.43 కోట్లు వచ్చింది. సాధారణంగా లక్ష్యాలను మార్చి 31 నాటికి ఇస్తారు. ఈ శాఖ లక్ష్యాలను మందుగానే సాధించింది. రాష్ట్ర విభజన, రియల్ వ్యాపారం పెరగడం, ఎక్కువ మంది స్థిరాస్తి పైన పెట్టుబడులకు ఆకర్షితులు కావడంతో క్రయ విక్రయాలు జోరందుకున్నాయి. ఈ ఆర్థిక ఏడాదిలో రిజిస్ట్రేషన్ శాఖ తొలి నుంచి లక్ష్యాలను మించి ఆదాయం ఆర్జించడం విశేషం. కాగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రెండు రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో రూ.173.46 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నా రూ.137.03 కోట్లు మాత్రమే ఆదాయం లభించింది. అయితే ఈ సారి మాత్రం లక్ష్యాలను మించి ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి నాటికి అనంతపురం పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 58,042 డాక్యుమెంట్లు, హిందూపురం పరిధిలో 47,373 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా ఫిబ్రవరి నాటికి సాధించిన లక్ష్యాలను పరిశీలిస్తే ప్రథమ స్థానంలో అనంతపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నిలిచింది. ద్వితీయ స్థానంలో హిందూపురం, తృతీయ స్థానంలో అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఉన్నాయి. లక్ష్య సాధనలో ముందున్నాం అనంతపురం, హిందూపురం రిజిస్ట్రేషన్ జిల్లాల పరిధిలో ఆదాయం బాగా సమకూరుతోంది. గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ సారి లక్ష్యసాధనలో ముందున్నాం. ఫిబ్రవరి వరకు చూస్తే సుమారు రూ.9 కోట్ల వరకు లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. మార్చి నెలాఖరుకు మరింత ఆదాయం వస్తుంది. - ఎ.గిరికుమార్, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ -
‘రియల్’ మాయ
పేరు మార్చి అగ్రిమెంట్లు రూ.లక్షల్లో వసూళ్లు భూములు చూపించి అమ్మకాలు లబోదిబో మంటున్న బాధితులు శ్రీకాకుళం టౌన్: శ్రీకాకుళం జిల్లాలో రియల్ వ్యాపారం లబ్ధిదారులను నిలువునా ముంచేసింది. రూ.కోట్లు కొల్లగొట్టిన రియల్టర్లు తప్పుడు ఒప్పందాలు చేపట్టి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పదేళ్ల క్రితం కొనుక్కున్న వారు ఇప్పుడు ఇళ్లు కట్టుకుందామని వెళితే అక్కడ స్థలం నాదంటూ ఇంకొకరు ప్రత్యక్షమవుతున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటికీ అగ్రిమెంట్లతోనే రూ.లక్షలు కాజేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్‌కు రమ్మంటే రావడం లేదు. దీంతో ఇప్పుడు పోలీసుస్టేషన్లకు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చి చేరుతున్నాయి. పోలీసులు మాత్రం ఇరువైపులా చేతులు చాపి సివిల్ పంచాయతీలను గాలిలో వదిలేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న ఈ వ్యవహారంపై ఎవరికి చెప్పాలో తెలియక బాధితులు తలలు పట్టుకొంటున్నారు. అలా మోసపోయిన బాధితుల్లో శ్రీగృహ వెంచర్ బాధితులు ఉన్నారు. జిల్లాలోని ఎచ్చెర్ల నియోజక వర్గంలో గతంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాయని సూర్యనారాయణ రెడ్డి శ్రీసాయిలక్ష్మి రియల్ ఎస్టేట్ పేరుతో శ్రీకాకుళం మండలం చింతాడ రెవెన్యూ గ్రూప్ పరిధిలోని సర్వే నెంబరు 179/4, 5, 6, 7, 8, 9, 10, 11, 209/14, 17, 30, 178/2, 2బి, 210/5, 6, 7, 8, 180/1లలో 10.86 ఎకరాల స్థలంలో వెంచర్ ఏర్పాటు చేశారు. ఈ భూములను రైతుల నుంచి వేర్వేరు వ్యక్తుల పేరుతో కొనుగోలు చేసిన యాజమాన్యం డెవలప్మెంట్ బాధ్యతలను తాము చేపట్టినట్టు చూపిస్తూ వెంచర్‌ను ప్రారంభించారు. వందగజాలు రూ.1.50 లక్షలుగా ధర నిర్ణయించి విక్రయాలు ఆరంభించారు. 308 ప్లాట్లుగా విభజించి వెంచర్ అమ్మకాలు ప్రారంభించిన సంస్థ అమ్మకాలు పూర్తికాకుండానే మూతపడింది. ఆ సమయంలో 2009 ఎన్నికలు రావడంతో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి సంస్థ యజమాని సూర్యనారాయణరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సూర్యనారాయణరెడ్డి అరెస్ట్ అయ్యూరు. ఇదే అదునుగా సాయిలక్ష్మి రియల్టరు వద్ద పనిచేసిన ఉద్యోగులు శ్రీగృహ పేరుతో అదే స్థలాన్ని విక్రయించడానికి సిద్ధమయ్యారు. డెవలపర్స్, స్థల యజమానుల మధ్య వివాదం తలెత్తిన సమయంలోనే కొత్తగా ఆరంభమైన శ్రీగృహ హౌసింగ్ ప్రాజెక్ట్స్ సంస్థ 308 పాట్లను తిరిగి విక్రయించడానికి సిద్ధమయ్యారు. సుభద్రాపురం వద్ద మరో వెంచర్ శ్రీగృహ నిర్వాహకులు తాండ్ర వెంకటబాబు, మహేష్‌బాబు స్థానికంగా తనకు, ఉపాధ్యా వృత్తిలో ఉన్న తన తండ్రి పరిచయాలను దృష్టిలో ఉంచుకొని వెంచర్ విక్రయానికి సిద్ధమయ్యారు. స్నేహితులు, బంధువులు, సమీప గ్రామాల్లో ఉన్న వారిని, సీమెన్లు, ఇతర ఉద్యోగులను రంగంలోకి దింపి వారి నుంచి అడ్వాన్సులు తీసుకొని అగ్రిమెంట్లు కట్టారు. పేడాడ పార్వతి, బెండి తులసీరావు, పొన్నాడ రామారావు, వావిలపల్లి అమ్మినాయుడు, పూజారి ఉషాకుమారి, మామిడి శ్రీనివాసరావు ఇలా ఎంతో మందికి స్టాంపు పేపర్లపైనే అగ్రిమెంట్లు ఇచ్చారు. అగ్రిమెంట్ల రూపంలో వెంకటబాబు, మహేష్‌బాబు తీసుకున్న మొత్తాలను లావేరు మండలం సుభద్రాపురం వద్ద మరో వెంచర్ డెవలపింగ్నకు అడ్వాన్సులు ఇచ్చారు. వేరొకరిపేరుతో భూమి చింతాడ వద్ద వేసిన వెంచరులో భూమి వేరొకరిపేరుతో ఉండడం వల్ల డెవలపర్స్‌గా అగ్రిమెంటు చేసిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేయలేక చేతులెత్తేశారు. డబ్బులిచ్చిన అగ్రిమెంటు దారులు ఇప్పుడు స్థలంలేక చేతిలో ఉన్న డబ్బులు పోగొట్టుకొని లబోదిబో మంటున్నారు. గత నెలలో బాధితులంతా శ్రీకాకుళం పట్టణ సీఐ దాడి మోహనరావును ఆశ్రయించారు. బాధితులను, అగ్రిమెంటు చేసిన వ్యక్తులను పిలిపించి సెటిల్ చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఆమదాలవలస ప్రాంతానికి చెందిన అధికార పార్టీ పెద్దల నుంచి ఫోన్ రావడంతో కథకంచికి చేరింది. ఇప్పుడు స్థలం లేక చేతిలో డబ్బులు పోగొట్టుకొని ఆవేదన చెందుతున్నారు. ఇక ఆ డబ్బుల వసూళ్ల సంగతి దేవునికే ఎరుక.. సీఐ ఏమంటున్నారంటే... తాండ్ర వెంకటబాబు, మహేష్ బాబులపై కొందరు బాధితులు ఫిర్యాదు చేశారని సీఐ దాడి మోహనరావు చెప్పారు. ఇందులో భాగంగా బాధితులు, డబ్బులు తీసుకున్న వారిని పిలిపించి మాట్లాడినట్టు తెలిపారు. కేసు విచారణలో ఉందన్నారు. -
బ్రోకర్లదే రాజ్యం
భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకం రాజధాని గ్రామాల్లో ఎకరం రూ.1.50 కోట్లు ఒకే చోట 5 ఎకరాలు దొరకడం కష్టమే మళ్లీ పుంజుకుంటున్న రియల్ వ్యాపారం విజయవాడ బ్యూరో : రాజధాని గ్రామాల్లో రియల్ బ్రోకర్లు మళ్లీ చక్రం తిప్పుతున్నారు. భూముల క్రయవిక్రయాల్లో వీరే కీలకంగా మారారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిశాక కోర్ కేపిటల్ చుట్టుపక్కల గ్రామాల్లో మరోసారి రియల్ వ్యాపారం పుంజుకుంటోన్న దాఖలాలు కనిపిస్తున్న నేపథ్యంలో భూముల కొనుగోలు కోసం గ్రామాలకు వెళ్లిన కొనుగోలుదారులు బ్రోకర్లు లేకుండా భూములను కొనడం గగనమైంది. గ్రామాల్లోని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు సిండికేట్ అవుతూ, భూములకు ధర నిర్ణయించడంలో కీలకపాత్ర వహిస్తున్నారు. క్రయవిక్రయాల ద్వారా లక్షల్లో అందుతోన్న కమీషన్ డబ్బును నలుగురూ పంచుకుంటున్నారు. నిన్నా మొన్నటి వరకూ పనీపాటా లేకుండా వూరి సెంటరులో పేకాటతో కాలం వెళ్లబుచ్చే అప్పారావు రోజూ తుళ్లూరు, తాడికొండ వెళ్లి పీకల దాకా తాగి పొద్దుపోయాక ఎప్పటికో ఇల్లు చేరే పానకాలరావు వంటి సాధారణ వ్యక్తులు ప్రస్తుతం ఊరు కదలకుండా రియల్ బ్రోకర్ల అవతారమెత్తి లక్షలు సంపాదిస్తున్నారు. పడి లేచిన రియల్ వ్యాపారం రాజధానిలో రియల్ వ్యాపారం నెల రోజుల కిందటే సద్దుమణిగింది. నాలుగు నెలల కిందట ఎకరం భూమి ఖరీదు రూ.1.80 కోట్లకు చేరి, ఆ తరువాత సంక్షోభ సమయంలో రూ.80 లక్షలకు పడిపోయింది. భూముల కోసం కోట్లు వ్యయం చేసిన రియల్ వ్యాపారులు ఒక దశలో బాగా నష్టపోగా, కొంతమంది మాత్రం కొన్న భూములను మారు బేరానికి అమ్మి లాభ పడ్డారు. సీఆర్ డీఏ అనుమతులు, ఇతరత్రా నిబంధనలతో బేజారెత్తిన వ్యాపారులు ఆగస్టు నుంచి కొనుగోళ్ల విషయంలో వెనక్కి తగ్గారు. అయితే ప్రభుత్వం రాజధాని శంకుస్థాపన తేదీ ప్రకటించినప్పటి నుంచి రాజధాని గ్రామాల్లో మళ్లీ రియల్ వ్యాపారం కాస్తంత పుంజుకుంది. కోర్ కేపిటల్లో ఊపు కోర్ కేపిటల్‌గా ప్రకటించిన ఉద్దండ్రాయునిపాలెం, తాళ్లాయపాలెం, లింగాయపాలెం గ్రామాలకు చుట్టూ ఉన్న మందడం, వెలగపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, రాయపూడి గ్రామాల పరిధిలో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామికవేత్తలు, రియల్ వ్యాపారులు, పెట్రోలు బంకుల యజమానులు, బడాబడా వ్యాపారవేత్తలు ఎకరం నుంచి ఐదెకరాల వరకూ ఒకేచోట భూములను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ గ్రామాల పరిధిలో ఎక్కడా ఒకే చోట రెండెకరాలకు మించి దొరకడం గగనమైంది. కేవలం అరెకరం, ముప్పాతిక, ఎకరం మేర పొలాలే అమ్మకాలకు దొరుకుతున్నాయి. ఈ వివరాలు కూడా కేవలం గ్రామాల్లో బ్రోకర్ల దగ్గరే దొరుకుతున్నాయి. గ్రామాల్లోని ఏఏ రైతులు తమ పొలాలను అమ్మడానికి సిద్ధంగా ఉన్నారో వారికే తెల్సు. అటు కొన్నవారు, ఇటు అమ్మిన వారు సైతం కమీషన్లు ముట్టజెపుతుండటంతో బ్రోక ర్ల పంట పండుతోంది. రాజధాని గ్రామాల్లో మొత్తం 53,747.46 ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా, ఇందులో ప్రభుత్వ భూములు 15010.03 ఎకరాలు కాగా మిగతాదంతా (38737.49) ప్రైవేటు భూములే. ఇందులో 33,733 ఎకరాల మేర పట్టా భూములున్నాయి. ల్యాండ్ పూలింగ్‌లో రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూములు పోగా మిగతా భూములు రైతుల చేతుల్లోనే ఉన్నాయి. గతంలో కొందరు రియల్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను కూడా ల్యాండ్‌పూలింగ్ కింద ప్రభుత్వానికి ఇచ్చారు. ఇదే మాదిరిగా కొనుగోలు చేసిన భూములను ల్యాండ్ పూలింగ్ కింద సర్కారుకు ఇచ్చి ఆపైన చేతికందే అభివృద్ధి చేసిన భూములతో లాభం పొందవచ్చనే ఆలోచన ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సరికొత్త ఊపునిస్తోంది. ఈ తరహాలో యోచిస్తున్న వ్యాపారులే ప్రస్తుతం భూముల కొనుగోలు కోసం తిరుగుతున్నారు. బడా బాబుల పేరు చెప్పి..: భూముల కొనుగోలు కోసం గ్రామాల్లో తిరిగే కొనుగోలుదారులతో బ్రోకర్లు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన శాసనసభ్యులు, ఎంపీలు, మంత్రుల పేర్లతో పాటు ఇప్పటికే భూములు కొన్న ప్రముఖుల పేర్లు చెప్పి వారి పక్కనే ఉన్న భూముల విక్రయాలకు సిద్ధమవతున్నారు. మొదటి దశలో నిర్మాణం జరిగే రాజధాని ప్రాంతమిదేనంటూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. గ్రామానికో ఐదారుగురు బ్రోకర్లు తయారై రెవెన్యూ రికార్డులు, అందులోని భూములు, వాటి యజమానుల వివరాలను దగ్గరుంచుకుని తమదైన రీతిలో చక్రం తిప్పుతున్నారు. -
పార్టీ కార్యాలయానికి ప్రభుత్వ స్థలం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యాలయ భవన నిర్మాణంలోనూ రియల్ వ్యాపార దృక్పథం వీడలేదు. గతంలో కారుచౌకగా కొనుగోలు చేసిన స్థలాన్ని పెద్ద మొత్తానికి విక్రయించి... తద్వారా వచ్చిన సొమ్ముతో సర్కారు స్థలాన్ని తక్కువ మొత్తానికి సేకరించి అక్కడ నిర్మించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకోసం అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్‌పై ఒత్తిడి తేవాలని యోచిస్తున్నారు. సర్కారు స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణానికి జిల్లాలోని తమ్ముళ్లు తెగ హడావుడి చేస్తున్నారు. గతంలో పార్టీకోసం కొనుగోలు చేసిన స్థలా న్ని లాభానికి అమ్మి ఆ మొత్తంతో ఇక్కడ నిర్మాణం చేపట్టేందుకు సమాయత్తం అవుతున్నారు. అయితే ఇందుకు ఒక వర్గం అభ్యంతరం చెబుతోంది. అంతేగాకుండా తక్కువ ధరకు గతంలో అమ్మిన కార్యకర్త తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో టీడీపీ కార్యాలయ నిర్మించే నిమిత్తం పదిహేనేళ్ల క్రితం బలగ సమీపంలో ఓ ప్రైవేట్ వ్యక్తి నుంచి సుమారు 40సెంట్ల స్థలాన్ని చంద్రబాబు పేరిట జిల్లా నేతలు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో అప్పటి సీఎం చంద్రబాబే పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్న ఎన్టీఆర్‌పై ఉన్న అభిమానంతో ప్రైవేట్ వ్యక్తి చాలా తక్కువ ధరకే స్థలాన్ని విక్రయించారు. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ నేతృత్వంలో స్థలం కొనుగోలు జరిగింది. ఇప్పుడు ఆ స్థలం కోట్ల విలువ చేస్తుంది. దీంతో జిల్లా నాయకులు ఆ స్థలాన్ని మార్కెట్ ధరకు విక్రయించాలని భావించింది. ఊరు మధ్యలో పార్టీ కార్యాలయం ఉంటే కార్యక్రమాలకు ఇబ్బంది అవుతుందన్న సాకుతో దానిని భారీ ధరకు విక్రయించాలని భావిస్తున్నారు. పార్టీపై ఉన్న అభిమానంతో తాను టీడీపీకి స్థలం తక్కువ ధరకు విక్రయించానని, ఇప్పుడు ధర పెరగడంతో విక్రయించి పార్టీనేతలు సొమ్ము చేసుకోవడం ఎంతవరకు సబబని ఆయన వాదిస్తున్నారు. ప్రభుత్వ స్థలంపై కన్ను అయితే కొత్తభవనాన్ని నిర్మించేందుకు సర్కారు స్థలాన్ని ఇప్పుడు ఎంచుకున్నారు. 80ఫీట్ రోడ్డుకు సమీపంలో వాంబే కాలనీకి ఆనుకుని ఉన్న ఓ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ధరకే కొనుగోలు చేసి అక్కడ పార్టీ కార్యాలయం నిర్మించాలని నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మహానాడులో సీఎం చంద్రబాబు దృష్టికి ఇక్కడి నేతలు ఇదే విషయాన్ని తీసుకువెళ్లారు. పాత స్థలాన్ని ఇప్పటికిప్పుడు విక్రయిస్తే భారీ లాభం వస్తుందని, కొత్త కార్యాలయానికి ప్రభుత్వం గతంలో సాం ఘిక సంక్షేమ విభాగం కోసం భద్రపరిచిన సుమారు ఒక ఎకరా 10సెంట్ల స్థలాన్ని కేటాయించేందుకు అవసరమైన జీవో జారీ చేయాలని సూచించినట్టు తెలిసింది. ఇందుకు సాంఘిక సంక్షేమశాఖ అంగీకరించకపోతే జిల్లా కలెక్టర్ ద్వారా ఒత్తిళ్లు తీసుకువచ్చి పార్టీ కార్యాలయం కోసం త్వరిత గతిన నిర్మాణ పనులు చేపట్టాలని స్థానిక మంత్రి సహా జిల్లా నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. పార్టీ పేరిట ప్రభుత్వం నుంచి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా స్థలం కొనుగోలు చేయించి అదే స్థలాన్ని మళ్లీ పార్టీకి విక్రయించేలా టీడీపీ నేతలు స్కెచ్ వేసినట్టు తెలిసింది. వాస్తవాని కి ఇలా జరగాలంటే చాలా తతంగమే కా దు... న్యాయపరమై న చిక్కులూ తలెత్తే అవకాశం ఉంది. ఓ ప్రభుత్వ విభాగం కోసం గతంలో ప్రభుత్వమే కొనుగోలు చేసిన స్థలాన్ని మళ్లీ ప్రభుత్వమే వెనక్కు తీసుకుని అదే స్థలా న్ని పార్టీకోసం విక్రయిస్తే ఎవరైనా పబ్లిక్ పిల్ వేసే అవకాశమూ లేకపోలేదు. కానీ టీడీపీ నాయకులు జిల్లా కలెక్టర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి అదే స్థలాన్ని మార్కెట్ ధర కాకుండా ప్రభుత్వ ధరకే విక్రయించేలా ఎత్తుగడ వేశారు. ఏడాదిలోగా నిర్మాణం కొత్త స్థలంలో ఏడాది వ్యవధిలో కాన్ఫరెన్స్‌హాలు, విలేకరుల సమావేశం నిర్వహించేందుకు మరో గది, పార్కింగ్, వైఫై, లైటింగ్, పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో, అధునాతన వ్యవస్థలతో భవిష్యత్ అవసరాలకు అనువుగా నిర్మించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం
రాజమండ్రి/ భీమవరం: రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో ఉన్న రెండు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు సరిపోతాయని, మూడు పంటలు పండే రైతుల భూములు లాగేసుకోనక్కరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. రాజధాని పేరిట రైతుల పంట పొలాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం చాలా దారుణమన్నారు. ‘బుద్ధున్న వారెవరైనా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం రైతుల నుంచి లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమని జగన్ తెలిపారు. వైఎస్ ఆశయ సాధన కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మిల జ్యేష్ట పుత్రుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన రాజా వివాహం సందర్భంగా.. జగన్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఆయన 10 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రాజమండ్రి ప్రకాష్‌నగర్‌లోని జక్కంపూడి నివాసానికి వచ్చారు. రాజాను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. జక్కంపూడి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బయలుదేరి వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, రెడ్డి గ్రూపు సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రారెడ్డి, భారతి దంపతులు, గొలుగూరి శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులతో ముచ్చటించారు. వైఎస్ తప్ప ఏ సీఎం పోలవరాన్ని పట్టించుకోలేదు రాజమండ్రిలో రాజా నివాసం వద్ద, తర్వాత భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత గానీ, అంతకుముందుగానీ ముఖ్యమంత్రులెవరూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పట్టించుకోలేదని జగన్ చెప్పా రు. ముఖ్యమంత్రిగా వైఎస్ మాత్రమే రూ.4 వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అడ్డు తగిలినా ప్రజలు క్షమించరన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాను స్వయంగా 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజధాని నిర్మాణంపై తమ వైఖరి ఏమిటో చెప్పామని, ఇప్పటికీ అదే మాటై పె నిలబడి ఉన్నామన్నారు. అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రంలో బోలెడు ప్రజా సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ వాటిపై చర్చించి, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడుతుందని చెప్పారు. -
రాజధాని భూములతో రియల్ వ్యాపారమా: అంబటి
హైదరాబాద్: రాజధాని భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ పరిణామం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టుకోలేక ప్రభుత్వం రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూసమీకరణ కేవలం టీడీపీ అనుయాయుల రియల్ వ్యాపారం కోసమేనని అంబటి వ్యాఖ్యానించారు. రైతుల ప్రస్తుత దారుణ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని కోసం భూములిచ్చేందుకు కూడా ఇదేవిధంగా కోట్లు చెల్లిస్తారా అని అంబటి ప్రభుత్వాన్ని ప్రశ్చించారు. -
రియల్ రాజ్యం!
రాజాం: రాజాం పట్టణం ఆర్థికంగా ఎదుగుతోంది.. అంతకుమించిన స్థాయిలో రియల్ వ్యాపారం రెక్కలు విచ్చుకుంటోంది.. రెచ్చిపోతోంది. అడ్డూఅదుపూ లేకుండా అక్రమ లేఅవుట్లు వెలుస్తున్నాయి. వీటి వల్ల అధికారులు, రియల్టర్లు లక్షలు కళ్లజూస్తుండగా.. కొనుగోలుదారులు మాత్రం కళ్లు తేలేయాల్సి వస్తోంది. పారిశ్రామికంగా ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన రాజాం పట్టణంలో వాణిజ్య, విద్యా రంగాల అభివృద్ధీ జోరందుకుంది. ఫలితంగా జనాభా, దానికి అనుగుణంగా ఇళ్ల స్థలాలకు డిమాండ్ పెరుగుతున్నాయి.దీన్నే రియల్టర్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా, పన్నులు చెల్లించకుండా వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఈ విధంగా రాజాం నగర పంచాయతీ పరిధిలో 17 చోట్ల సుమారు 60 ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు వెలసినట్లు తెలిసింది. నిబంధనలకు సమాధి రియల్టర్ల ధన దాహానికి వ్యవసాయ భూములు కరిగిపోతున్నాయి. నిబంధనలకు సమాధి కట్టి వాటి పునాదులపై అక్రమ లేఅవుట్లు వేస్తున్నారు. వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చాలన్నా, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించాలన్నా నాలా పన్ను చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండానే వ్యవసాయ భూములను ఇళ్ల స్థలాలుగా మార్చేస్తున్నారు. కాగా లేఅవుట్లు వేసిన ప్పుడు వాటిలో రహదారులు, కాలువలు, విద్యుత్ లైన్లు వేయడంతోపాటు కమ్యూనిటీ హాలు వంటి వాటిని స్థలం కేటాయించి, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టరేట్ నుంచి అనుమతి పొందిన తర్వాతే విక్రయాలు జరపాలి. కానీ రియల్టర్లు వీటిని పట్టించుకోకుండా హద్దులుగా రాళ్లు పాతి, స్థలాలు చూపించి అమ్మేస్తున్నారు. నిబంధనలపై అవగాహన లేని ప్రజలు వీటిని కొనుగోలు చేసి, ఆ తర్వాత ఇబ్బందులపాలవుతున్నారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకోవాల్సిన నగర పంచాయతీ అధికారులు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారు. ఇవే అక్రమ లేఅవుట్లు విశ్వసనీయ సమాచారం ప్రకారం అనుమతుల్లేని లేఅవుట్ల వివరాలు ఇలా ఉన్నాయి.. వాసవీనగర్ సర్వే నెం. 31, 40లలో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు. ఆర్టీసీ కాంప్లెక్స్ వెనుక పాపయ్యపేట వద్ద సర్వే నెం. 107లో రెండు ఎకరాల్లో 40 ప్లాట్లు. పొనుగుటివలసలో సర్వే నెం.33లో 4 ఎకరాల్లో 90 ప్లాట్లు. పొనుగుటివలస గౌరీపరమేశ్వర ఆలయం వద్ద సర్వే నెం. 20, 21, 13, 14లలో 102 ప్లాట్లు. ఇదే గ్రామంలో జీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా సర్వే నెం. 76, 78లలో 8 ఎకరాల్లో 170 ప్లాట్లు. జీఎంఆర్ కేర్ ఆస్పత్రి ఎదురుగా బుచ్చింపేట రహదారిలో సర్వే నెం. 84, 86,88లలో 10 ఎకరాల్లో 230 ప్లాట్లు. పొనుగుటివలస రోడ్డులో ఒక ఎకరాలో 18 ప్లాట్లు. ఇదే ప్రాంతంలో సర్వే నెం. 170, 173, 176లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు. సారధి గ్రామంలో చీపురుపల్లి రోడ్డులో సర్వే నెం.119లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో నర్సింగ్ పాఠశాల ఎదురుగా సర్వే నెం. 181లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. బొబ్బిలి రోడ్డులో అగ్నిమాపక కేంద్రం పక్కన సర్వే నెం. 70లో 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. ఇదే రోడ్డులో ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా సర్వే నెం.84లో ఎకరా విస్తీర్ణంలో 18 ప్లాట్లు. కొత్తవలస సర్వే నెం. 37లో 5 ఎకరాల్లో 60 ప్లాట్లు. ఇదే గ్రామంలో సర్వే నెం. 66లో హెచ్‌పీ పెట్రోల్ బంకు వెనుక 2 ఎకరాల్లో 30 ప్లాట్లు. కొండంపేట సర్వే నెం. 113, 117లలో ఇటుకల ఫ్యాక్టరీ ఎదురుగా 4 ఎకరాల్లో 124 ప్లాట్లు. బొబ్బిలి రోడ్డులో సర్వే నెం. 70, 73లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు. ఇదే రోడ్డులో సర్వే నెం.132, 138, 140, 145లలో 3 ఎకరాల్లో 40 ప్లాట్లు చర్యలు తీసుకుంటాం అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి స్థలాలు విక్రయిస్తున్న విషయాన్ని నగర పంచాయతీ కమిషనర్ వి.అచ్చెన్నాయుడు వద్ద ప్రస్తావించగా వాస్తవమేనన్నారు. వీటిని గుర్తించామని, ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నిర్మాణాలు చేపట్టేటప్పుడు నిబంధనలు పాటించి, అవసరమైన అనుమతులు పొందితే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. -
రెండు పద్ధతుల్లో రైతులకు భూ పంపిణీ!
రాజధానిపై సర్కారు కసరత్తు ప్రభుత్వం, రైతులకు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయడం మొదటి పద్ధతి అభివృద్ధి చేసిన భూమిలో 20 శాతం రైతులకివ్వాలన్నది రెండో పద్ధతి 6వ తేదీన విధివిధానాల ఖరారు.. విజయవాడ బ్యూరో: రాజధాని కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రెండు పద్ధతులను అనుసరించాలని భావిస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భూమిని సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే, రైతులకు ఎంతమేరకు భూమి ఇవ్వాలన్న విషయంపై కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం, రైతుల మధ్య పరస్పర ప్రయోజనం కలిగేలా రెండు ప్రతిపాదనలు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ల్యాండ్ పూలింగ్‌లో సేకరించించే భూముల్లో ప్రభుత్వం, రైతులు 60 ః 40 నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది ఒక ప్రతిపాదన. అభివృద్ధి చేసిన భూముల్లో 20 శాతం రైతులకు ఇవ్వడం రెండో పద్ధతి. ఈ రెండింటిలో దేనిని అనుసరించాలన్న విషయంపై కసరత్తు జరుగుతోంది. అలాగే భూములిచ్చే రైతులు దాదాపు మూడేళ్లపాటు ఎటువంటి ఆదాయం లేకుండా పంటను నష్టపోయే అవకాశం ఉన్నందున అర్హత కలిగిన రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున చెల్లించే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. ఈ విషయాలన్నింటిపైనా 6న జరిగే సమావేశంలో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆరోజునే విధివిధానాలను కూడా ఖరారు చేయనున్నట్లు సమాచారం. మొదటి దశ మంగళగిరి నుంచే.. రాజధానికి అవసరమైన భూమిని 4 దశల్లో సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాండ్ ఫూలింగ్ విధివిధానాలు ఖరారై, రైతులు ఇందుకు ఆమోదం తెలిపితే తొలి దశలో మంగళగిరి నుంచే భూములు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళగిరి అయితే అన్నింటికీ మంగళకరమన్న పార్టీ నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. మంగళగిరి, ఉండవల్లి, తాడేపల్లి, తుళ్లూరు, అమరావతి మండలాల్లోని కొన్ని ప్రాంతాల భూములను తొలి దశలో సేకరించే అవకాశముందని సమాచారం. మళ్లీ భూముల ధరలకు రెక్కలు. వీజీటీఎం పరిధిలోనే నూతన రాజధాని నగరం ఉంటుందని సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన గుంటూరు, తెనాలి ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఉపయుక్తంగా మారింది. నిన్న మొన్నటి వరకు కృష్ణా జిల్లా నూజివీడు, ఇబ్రహీంపట్నం, మంగళగిరి, తాడేపల్లి, ఉండవల్లి, గన్నవరం వైపు పరుగులు తీసిన జనం ఆదివారం నుంచి తెనాలి, గుంటూరు వైపు చూస్తుండటంతో మళ్లీ రియల్ వ్యాపారానికి ఊపొచ్చినట్లయ్యింది. -
రియల్ ఢమాల్
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గింది. స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు తిరోగమనంలో ఉన్నాయి. దస్తావేజుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి రాబడి కూడా తగ్గింది. ఐదేళ్లలో ఎప్పుడు లేనంతగా 2013-14 ఆర్థిక సంవత్సరంలో పురోగతి ఏడు శాతం లోపే ఉండటంతో రిజిస్ట్రేషన్ శాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్ష్యం సాధింపులో ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడు క్షీణత ఉందని రిజిస్ట్రేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. మంచిర్యాల మినహా జిల్లా అంతటా రియల్ వ్యాపారంలో నిస్తేజం కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటు నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అవుతుందని అక్కడ కొనుగోళ్లు పెరిగినట్లు సమాచారం. లక్ష్యంలో వెనుకంజ జిల్లాలో స్థిరాస్తి, భూ క్రయవిక్రయాలు మందకొడిగా సాగుతున్నాయనడానికి గణాంకాలే నిదర్శనం. జిల్లాకు 2013- 14 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.78.50 కోట్ల లక్ష్యం విధించగా కేవలం రూ.66.97 కోట్లు సాధించి 85 శాతమే లక్ష్యాన్ని చేరుకుంది. పురోగతి రేటు కేవలం 6.63 శాతం నమోదైంది. ఐదేళ్ల పురోగతిని పరిశీలిస్తే ఇదే అతి తక్కువ. జిల్లాలో ఆదిలాబాద్, భైంసా, బోథ్ పరిధిలో క్రయ విక్రయాలు పూర్తిగా పడిపోయాయి. ఆసిఫాబాద్, నిర్మల్, ఖానాపూర్, లక్సెట్టిపేటల్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఒక్క మంచిర్యాలలో అమ్మకాలు, కొనుగోళ్లు ఊపు మీద ఉన్నాయి. ఎందుకీ దుస్థితి.. జిల్లాలో రియల్ వ్యాపారం పడిపోవడానికి వివిధ కారణాలు ఉన్నాయని రిజిస్ట్రేషన్ వర్గాలు, రియల్టర్లు పేర్కొంటున్నారు. రెండేళ్ల కిందటి వరకు ఊపు మీద ఉన్న రియల్ వ్యాపారం ఇప్పుడు తిరోగమనంలో ఉండటానికి ఆదిలాబాద్‌లో మనీ సర్క్యులేషన్ జరగకపోవటం ఒక కారణంగా పేర్కొంటున్నారు. ఓ బడా పారిశ్రామికవేత్త వ్యాపారంలో దివాళా తీయడంతో కోర్టు ద్వారా ఇన్సాల్వెంట్ పిటిషన్(ఐపీ) పొంది వ్యాపారం బంద్ చేశారు. అదేవిధంగా బహిరంగ మార్కెట్లో బ్రోకర్లు భూముల ధరలు ఇష్టారీతిన పెంచి అమ్మడం, కేవలం అవే భూములు ఒకరి చేతుల నుంచి మరొకరి చేతులకు మారుతూ వచ్చి ప్రసుత్తం అమ్మకాలు నిలిచాయి. ఆదిలాబాద్ చుట్టూ పక్కల ప్రభుత్వ నోటిఫైడ్ భూములు ఉండటంతో రియల్ వ్యాపారానికి కొత్త భూములు దొరకని పరిస్థితి ఉంది. గతంలో రియల్టర్లు అధికారులను నయానో బయానో దారికి తెచ్చుకొని ప్రభుత్వ భూములు అమ్మేందుకు ఎన్వోసీని పొంది భూ క్రయవిక్రయాలు జరిపారు. రెండేళ్లుగా ఎన్వోసీ జారీని ప్రభుత్వం నిలిపివేసింది. అదేవిధంగా వెంచర్లు కొన్న తర్వాత వివాదాలు తలెత్తుతున్న సంఘటనల కారణంగా భూములు కొనాలనుకునే వారు ఆచి తూచి వ్యవహరించడం కూడా అమ్మకాలు తగ్గటానికి కారణం. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? రాకముందు కొందామా? లేకపోతే వచ్చిన తర్వాత కొంటే బాగుంటుందా? అనే సంశయ ధోరణి కారణంగా చేతిలో డబ్బులున్నా పలువురు కొనుగోలుకు ముందుకు రాకపోవటం లేదు. రెండు నెలలుగా ఎన్నికల వేడి ఉండటంతో భూ కొనుగోలుదారులు వా యిదా వేస్తుండటం క్షీణతకు కారణంగా పలువురు అభిప్రాయ పడుతున్నారు. -
విజయవాడలో 30%, తిరుపతిలో 20%
సాక్షి, హైదరాబాద్: రాజకీయ అస్థిరత కారణంగా కొన్నేళ్లుగా జోరు తగ్గిన హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని ముసుగు కప్పేసింది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. ప్రాంతాన్ని బట్టి ఆయా నగరాల్లో స్థిరాస్తి ధరలు 10-40 శాతం మేర పెరిగాయి. విశాఖపట్నంలో రియల్ వ్యాపారం, అభివృద్ధి అవకాశాలపై గతవారం చర్చించాం. ఇక.. విజయవాడ, తిరుపతి నగరాల్లో స్థిరాస్తి వ్యాపారం తీరుతెన్నులపై ఈ వారం ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథన ం.. ఆర్థిక రాజధాని.. ‘విజయవాడ’ వర్తక, వాణిజ్య కూడలికి, విద్యా కేంద్రాలకు, కృష్ణా నది పరవళ్లకు చిరునామా.. విజయవాడ!! గుంటూరు, మంగళగిరి, తెనాలి, గుడివాడ, నూజివీడు, పొన్నూరు, సత్తెనపల్లి వంటి పట్టణాలన్నీ విజయవాడ నుంచి 35 కి.మీ.లోపే ఉండటంతో ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. హైదరాబాద్‌లో నెలకొన్న రాజకీయ అస్థిరత కారణంగా ఆరునెలలుగా విజయవాడలో స్థిరాస్థి ధరలు 30 శాతం పెరిగాయని క్రెడాయ్ విజయవాడ సెక్రటరీ కె. రాజేంద్ర ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ప్రసాదంపాడు, గన్నవరం వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2,200, అదే సిటీలో అయితే చ.అ. ధర సుమారుగా రూ.4,500గా ఉందన్నారు. ఇక్కడ పెద్దగా ఐటీ కంపెనీలు లేకపోయినా ఆర్థిక రాజధానిగా పేరుగాంచడానికి కారణం వర్తక, వాణిజ్య వ్యాపారాలే. తొలి ఫార్మా కంపెనీ ‘సిరీస్’ ఇక్కడే ప్రారంభమైంది. వ్యవసాయాధార పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకూ విజయవాడ పెట్టింది పేరు. ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ జవహర్ ఆటోనగర్ ఇక్కడే ఉంది. కొత్తగా కానూరు కూడా ఆటోనగర్‌గా అభివృద్ధి చెందింది. కొండపల్లిలో ఏపీఐఐసీ పారిశ్రామికవాడ, సూరంపల్లిలో మహిళా పారిశ్రామిక వాడలు వ్యాపారస్తులను ఆకర్షిస్తున్నాయి. వన్‌టౌన్, గొల్లపూడి మార్కెట్లలో నిత్యం వందల కోట్ల రూపాయల టర్నోవర్ జరుగుతుంది. రిలయన్స్, మెట్రో, భారతీ వాల్‌మార్ట్, స్పెన్సర్స్ తదితర హోల్‌సేల్ మాల్స్ వెలిసినా స్థానిక వ్యాపారం మాత్రం చెక్కుచెదరలేదు. అభివృద్ధికి ఢోకాలేదు: సుమారు 1,800 మెగావాట్లు విద్యుత్‌ను ఉత్పత్తి చేసే వీటీపీఎస్, దేశంలోనే రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్, అతిపెద్ద రైల్వే యార్డ్ విజయవాడలోనే ఉన్నాయి. నాగాయలంకలో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇటీవలే మిసైల్ టెస్ట్‌రేంజ్ సెంటర్‌ను నెలకొల్పేందుకు ఆమోదం తెలిపింది. విజయవాడ నుంచి 22 కి.మీ. దూరంలో గన్నవరం విమానాశ్రయం ఉంది. విస్తీర్ణం: 261.88 కి.మీ. జనాభా: 10.48 లక్షలు ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ జవహర్ ఆటోనగర్ 30 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు ప్రాంతాన్ని బట్టి చ.అ. ధర రూ. 2,200 - 4,500 వరకు ఉంది. ఆధ్యాత్మిక రాజధాని.. ‘తిరుపతి’ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ తర్వాత స్థిరాస్తి రంగంలో 4వ స్థానంలో నిలుస్తుంది.. తిరుపతి!! చరిత్రకు, ఆధ్యాత్మిక పుణ్య క్షేత్రానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచింది చిత్తూరు నుంచి 65 కి.మీ. దూరంలో ఉన్న తిరుపతి నగరం. విస్తీర్ణంలో 30 కి.మీ. లోపు ఉన్న తిరుపతి నగరం స్థిరాస్తి రంగంలో ఇతర నగరాలతో పోటీపడుతోంది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు తిరుపతికీ విస్తరించాయని క్రెడాయ్ తిరుపతి సెక్రటరీ డి. గోపీనాథ్ చెప్పారు. ఆరేడు నెలలుగా ఇక్కడ స్థిరాస్తి ధరలు 20 శాతం పెరిగాయన్నారు. మంగళ్‌రోడ్, తిరుచానూర్ వంటి ప్రాంతాల్లో చ.అ. ధర రూ.2 వేలు, సిటీలో అయితే రూ.4 వేలుగా ఉందని వివరించారు. నగరం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌తో ఈ 15 కి.మీ. పొడవునా రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇది మరో 3 నెలల్లో అంతర్జాతీయ విమానాశ్రయంగా మారనుంది. దక్షిణాదిలోనే ఒకే ప్రాంతంలో ఆరు విశ్వవిద్యాలయాలున్నదీ తిరుపతిలోనే. ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ వ్యవసాయ, ఎస్వీ వెటర్నరీ, ఎస్వీ మహిళా, ఎస్వీ వేద, ఎస్వీ మెడికల్ సైన్స్ విశ్వ విద్యాలయాలతో పాటు పాతికకు పైగానే ఇంజనీరింగ్ కళాశాలలతో తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్‌గా ప్రసిద్ధికెక్కింది. జనాభా: 3.80 లక్షలు విస్తీర్ణం: 27 కి.మీ. 15 కి.మీ. దూరంలో ఉన్న రేణిగుంట విమానాశ్రయం 20 శాతం పెరిగిన స్థిరాస్తి ధరలు ప్రాంతాన్ని బట్టి చ.అ. ధర రూ.2 వేల నుంచి రూ.4,500 వరకు ఉంది.