రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ | Blow on the real business notes | Sakshi
Sakshi News home page

రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ

Published Mon, Nov 28 2016 1:56 AM | Last Updated on Mon, Sep 4 2017 9:17 PM

రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ

రియల్ బిజినెస్‌పై నోట్ల దెబ్బ

జిల్లా అంతటా నిలిచిన {Mయవిక్రయాలు
వ్యాపారం కుదరక  రద్దవుతున్న  అగ్రిమెంట్లు
స్తంభించిన రూ.200 కోట్ల వ్యాపారం

కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జిల్లాలోని రియల్ బిజినెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రెండు వారాలుగా జిల్లా అంతటా భూ క్రయవిక్రయాలు స్తంభించారుు. ఎక్కడా సెంటు భూమి కొన్న దాఖలాలు లేకుండా పోయారుు. దీంతో కోట్లు కుమ్మరించి రియల్ వ్యాపారం చేస్తున్న వ్యాపారుల పరిస్థితి తారుమారైంది. భూముల కొనుగోళ్లు, డెవలప్‌మెంట్ ఛార్జీలకు పెట్టుబడిగా పెట్టిన వందల కోట్ల వ్యాపారాన్ని నోట్ల రద్దు ప్రకటన శరాఘాతంలా తాకింది.

తిరుపతి: రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు, సత్యవేడు, నగరి, చిత్తూరు, కాణిపాకం, రంగంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో వ్యాపారులు పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా వ్యాపారులు మొత్తం 3వేల ఎకరాల్లో కొత్త వెంచర్లు ప్రారంభించి అమ్మకాలు మొదలు పెట్టారు. తిరుపతి, తొండవాడ, ఏర్పేడు, వికృతమాల, పాడిపేట, చంద్రగిరి, రంగంపేట ప్రాంతాల్లో 60కి పైగా వెం చర్లు వెలిశారుు. జిల్లాలోని సగానికి  పైగా లే అవుట్లకు అనుమతులుండగా, మిగతా వాటికి లేవు. అరుునప్పటికీ వ్యాపారులు క్రయవిక్రయాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ నెల 8న  కేంద్రం పెద్ద నోట్లరుున రూ,500, 1000 లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉన్నపళంగా  రియల్ వ్యాపారం స్తంభించింది. మరుసటిరోజు నుంచే కొనుగోళ్లు ఆగిపోయారుు. గడచిన రెండు వారాలుగా జిల్లాలో ఎక్కడా సెంటుభూమి కొన్నవా రుగానీ, అమ్మినోళ్లుగానీ లేకుండాపోయారు.

 ప్రభావం ఇలా...
సాధారణంగా భూములు గానీ, ఖాళీ ప్లాటుగానీ కొనుగోలు చేసిన వ్యక్తి మొదట్లో ధర కుదుర్చుకుని కొంత అడ్వాన్సు రూపేణా చెల్లింపులు జరుపుతారు. కొనుగోలు చేసే భూ విలువలో నాలుగో వంతు చెల్లించి అగ్రిమెంట్లు రారుుంచుకుంటా రు. ఈ విధంగా జిల్లాలో వందల కొద్దీ భూముల అగ్రిమెంట్లు జరిగారుు. అగ్రిమెంటు రారుుంచుకున్న వ్యక్తి లేదా కొనుగోలుదారుడు ఒప్పందం ప్రకారం 40 రోజులకో, 60 రోజులకో రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాలి. రిజిస్ట్రేషన్ చేరుుంచుకోవాల్సిన గడువు దగ్గరపడ్డా అటు కొనుగోలుదారు గానీ, ఇటు భూమి విక్రరుుంచిన వ్యాపారిగానీ ముందుకు రావడం లేదు. కారణమేమంటే ...భూమికి గల గవర్నమెంట్ వాల్యూ ప్రకారం మాత్రమే అధికారిక నగదు చెల్లింపులు ఉంటారుు. మిగతా చెల్లింపులన్నీ   

నల్లధనం కింద కనిపిస్తుంది. ఉదాహరణకు ..ప్రరుువేటు రూ.1 లక్ష విలువ గల భూమికి గవర్నమెంట్ విలువ రూ.25 వేలే ఉందనుకుంటే, కొనుగోలు చేసే వ్యక్తి రూ.25 వేలనే అధికారికంగా చెల్లిస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఈ మొత్తానికే చెల్లిస్తారు. మిగతా రూ.75 వేలూ నగదు రూపేణా చెల్లిస్తుంటారు. అప్పుడు ఈ నగదు నల్లధనంగా పరిగణించాల్సి వస్తుంది. పైగా నోట్ల రద్దు నిర్ణయానికి ముందు అగ్రిమెంట్లు చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్లు జరిగితే పెద్ద నోట్లు ఇస్తున్నారు. ఈ నోట్లను వ్యాపారులు తీసుకోవడ లేదు. ఒకవేళ తీసుకున్నా బ్యాంకుల్లో మార్చుకోవడం కష్టం. దీంతో భూ క్రయవిక్రయాలు చాలా వర కూ ఆగిపోయారుు. జిల్లా వ్యాప్తంగా సుమారు 20కి పైగా అగ్రిమెంట్లు రద్దరుునట్లు ‘రియల్ వ్యాపారులు’  చెబుతున్నారు. జిల్లాలో సుమారు రూ.200 కోట్ల వ్యాపారం నిలిచిపోరుునట్లు రియల్ వర్గాల అంచనా.

తడిసి మోపెడవుతున్న వడ్డీలు
జిల్లాలో చాలా మంది రియల్ వ్యాపారులు బిజినెస్ ప్రారంభ సమయంలో భూముల కొనుగోలుకు కోట్లాది రూపాయలు అప్పుగా తెచ్చారు. లే అవుట్లు, డిజైన్లు, అనుమతులతో పాటు రోడ్లు వేసి, మొక్కలు నాటడం వంటి అభివద్ధి పనులకు లక్షలు ఖర్చు పెట్టారు. సకాలంలో అమ్మకాలు జరిగి నగదు చేతిలో పడితేనే తీసుకున్న అప్పులు చెల్లించడం జరుగుతుంది. నోట్ల రద్దు కారణంగా రెండు వారాల నుంచి బిజినెస్ ఆగిపోరుుంది. చేతిలో నగదు చెలామణి నిలిచిపోరుు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement