
సిరిసిల్లటౌన్: ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని మోసగించారని బీజేపీ దళిత మోర్చా మానకొండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గడ్డం నాగరాజుపై అభియోగాలు వెల్లువెత్తాయి. సిరిసిల్లకు చెందిన ఎనగందులు వెంకటేశం (56) అలియాస్ ‘భారతీయు డు’.. నాగరాజు ఇంటి ఎదుట ఆత్మహత్య చేసుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నుంచి మానకొండూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గడ్డం నాగరాజు స్వస్థలం సిరిసిల్ల. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటేశంకు భూమి అమ్మకానికి ఒప్పుకున్నాడు.
నాగరాజు రూ.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. ఏడాది గడిచినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నాడు. దీనితో శనివారం ఉదయం వెంకటేశం.. నాగరాజు ఇంటికి వెళ్లి గొడవ పడ్డాడు. అతని ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరాజును పోలీసులు అరెస్టు చేయాలంటూ.. శవంతో బంధువులు ధర్నా చేశారు. డీఎస్పీ చంద్రశేఖర్ వచ్చి బలవంతంగా ఆందోళన విరమింపజేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment