
ఆత్మకూర్ : దీక్షిత్ మృతదేహం
ఆత్మకూర్ (కొత్తకోట): కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. పనిచే స్తున్న ప్రాంతం నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో చోటుచేసుకున్న ప్రమాదం లో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకోగా.. యువకుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. అమరచింత మండల కేంద్రానికి చెందిన దీక్షిత్(26) అయిజలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన అమరచింతకు ద్విచక్రవాహనంపై కొత్తకోట మీదుగా బయలుదేరాడు.
మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ త్మకూర్ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో దీక్షిత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ శంకర్, ఎస్ ఐ ముత్తయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచార ణ చేపట్టారు. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకు డు జగన్నాథరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
స్వగ్రామంలో విషాదఛాయలు
అమరచింత (కొత్తకోట): నాన్నమ్మతో కలిసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామనుకుని వస్తున్న అమరచింతకు చెందిన దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అమరచింతలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫ్రాంక్లిన్ కుమారుడు దీక్షిత్ అయిజ ఎస్‌బీఐ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్రిస్మస్ పండగను అమరచింతలోని నాన్నమ్మ కృపమ్మతో కలిసి జరుపుకోవాలని ద్విచక్రవాహనంపై బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే కృపమ్మ ఇంటి వద్ద జనం గుమిగూడారు. గత రెండు నెలల క్రితం కృపమ్మ టీచర్ భర్త దీనదయాల్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ ఘటన నుంచి కోలుకోలేని ఆ కుటుంబ సభ్యులకు దీక్షిత్ మృతి మరింత కుంగదీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెలే చిట్టెం రాంమోహన్‌రెడ్డితోపాటు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు నరేష్‌రెడ్డి, వీరేశలింగం, భూషణంగౌడ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

అమరచింత : దీక్షిత్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే చిట్టెం
Comments
Please login to add a commentAdd a comment