
వివరాలు సేకరిస్తున్న పోలీసులు
సాక్షి, అయిజ (మహబూబ్‌నగర్) : అజాగ్రత్తగా కారు నడపడంతో ఓ చిన్నారి కారు కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన అయిజలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. అయిజలోని బ్రాహ్మణవీధిలో రాజగోపాల్ అనే వ్యక్తి కారు వేగంగా నడుపుకొంటూ రాగా.. అకస్మాత్తుగా అడ్డువచ్చిన చిన్నారి ఇర్ఫాన్ (20 నెలలు)ను ఢీకొట్టాడు. దీంతో కారు ముందుభాగంలో టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఖాజాబీ, కబీర్‌లకు ఒక కూతురు ఒక కుమారుడు ఉండగా కుమారుడు మృతిచెందాడు. దీంతో వారు దుఃఖసాగరంలో మునిగిపోయారు.చిన్నారి మృతదేహానికి గద్వాల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కారు డ్రైవర్ రాజగోపాల్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment