Bathrooms
-
TG: మరో ఘటన.. వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్..
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల టాయిలెట్లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఏబీవీపీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి.. అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి తెలిపింది.వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్‌కు సమాచారం ఇచ్చారు పరీక్ష పూర్తయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటన జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలు ఏం రికార్డయిందనే అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లలో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇదీ చదవండి: పోలీస్‌స్టేషన్‌లో మహిళతో నీచ కృత్యం.. డీఎస్పీ అరెస్ట్ -
ఒక్కరోజులో 3డీ ప్రింటింగ్ బాత్రూం
సింగపూర్: ఒకే రోజులో మొత్తం బాత్రూం వ్యవస్థను శాస్త్రవేత్తలు త్రీడీ సాంకేతికతతో రూపొందించారు. అందులో డ్రైనేజీ వ్యవస్థ, పైపులను నిర్మించారు. అందులో సింక్, అద్దం, షవర్, టైల్స్, గోడలు, ఫ్లోరింగ్, టాయిలెట్ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసి ఒక్క రోజులోనే బాత్రూం మొత్తాన్ని వాడుకునేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. కాంక్రీట్ మిశ్రమాన్ని రోబో.. పొరలుపొరలుగా పోస్తూ బాత్రూంను పోతపోస్తుంది. సింగపూర్ లోని నాన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఈ సాంకేతికత ద్వారా సంప్రదాయ బాత్రూంల నిర్మాణం కన్నా 30 శాతం తక్కువ వ్యవధిలో నిర్మించవచ్చని తెలిపారు. కాంక్రీట్‌తో నిర్మించే వాటితో సమానంగా దృఢంగా ఉంటుందని చెప్పారు. -
ఈ వార్త చదివేందుకు కూడా బాగోదేమో..!
న్యూయార్క్ : ఓ ప్రయాణీకుడి చేష్టలకు గాల్లో ఎగురుతున్న విమానాన్ని అనూహ్యంగా దించివేశారు. అనంతరం అందులోని ప్రయాణీకులందరిని దింపేసి వారికి హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేసి విమానాన్ని శుభ్రం చేశారు. అనంతరం ఆలస్యంగా బయలుదేరి ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేర్చారు. వివరాల్లోకి వెళితే అమెరికాకు చెందిన విమానం 895 చికాగో నుంచి హాంకాంగ్ బయలుదేరింది. అయితే, ప్రయాణం మధ్యలో ఉండగా అందులోని ఓ ప్రయాణీకుడి టాయిలెట్‌కు వెళ్లాడు. అనంతరం విచిత్రంగా ప్రవర్తిస్తూ మలాన్ని విమానం మొత్తానికి పూయడమే కాకుండా అందులోని ప్రయాణీకులకు కూడా అంటించాడు. దాంతో విమానంలో ఓ చెప్పవీలుకానీ పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో పాలుపోక ప్రయాణీకులు గందరగోళానికి గురవుతుండగా అప్పటికప్పుడు అలస్కాలో విమానాన్ని దించివేశారు. అందులో వారందరిని ఎయిర్‌పోర్ట్‌లోని హోటల్స్‌కు తరలించి అనంతరం విమానం మొత్తం శుభ్రం చేయించారు. ఈ ఘటనపై పోలీసులు స్పందిస్తూ ఆ ప్రయాణీకుడిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని అయితే అతడు ఎందుకు విమానంలో అలా చేశాడో అని తెలుసుకునేందుకు మానసిక వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారులు కూడా విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. -
బాత్రూమ్స్ కట్టిన త్రిష
కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్ కట్టారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం. త్రిష యునెస్కోకు భారత్ తరఫున అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు. -
90 శాతం మరుగుదొడ్లు పూర్తి
ఖిల్లాఘనపురం : మండలంలో వందశాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువద్దామని జెడ్పీసీఈఓ లక్షీ్మనారాయణ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీడీఓ రెడ్డయ్యలతో కలిసి పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులతో మరుగుదొడ్ల నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖిల్లాఘనపురం మారుమూల మండలమైనప్పటికీ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మరుగుదొడ్ల నిర్మాణం ఇప్పటికే 90 శాతం పూర్తయిందన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు వందశాతం పూర్తి చేయాలన్నారు. బిల్లులకు ఇబ్బంది కలగకుండా గ్రామ కమిటీల ద్వారా నేరుగా చెల్లిస్తామని, హౌసింగ్ పథకంలో కొంత వరకు బిల్లులు వచ్చిన వారికి మిగతా బిల్లులు అందజేస్తామన్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పడుతున్నందున మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని గడువులోపు పూర్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రవీందర్, పీఆర్ఏఈ రమేష్‌నాయుడు, ఈఓపీఆర్డీ వినోద్‌కుమార్‌గౌడ్, ఏపీఓ సురేష్, ఘనపురం సర్పంచ్ సౌమ్యానాయక్, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. -
మరుగుదొడ్లను పరిశీలించిన సింగపూర్ బృందం
గుంటూరు: గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగం గ్రామంలో సింగపూర్ బృందం సోమవారం మరుగుదొడ్ల నిర్వహణను పరిశీలించింది. సింగపూర్ బృందంతో పాటు స్థానిక అధికారులు అందులో పాల్గొన్నారు. వచ్చే 100 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 13 లక్షల మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడతామని పంచాయతీ రాజ్ కమిషనర్ వి.ఆంజనేయులు అన్నారు. (సత్తెనపల్లి) -
బాత్రూమ్లోనే నివాసం
ఇంత దారుణమా ఒంగోలు అర్బన్: స్నానాల గదులు, మరుగుదొడ్లు లేవు, బహిర్భూమి కోసం పొలాల్లోకి వెళ్లాల్సిందే. వర్షం వచ్చిందా వారి తిప్పలు అన్నీ ఇన్నీ కావు. పదిహేడు గదుల్లో 350 మంది. ఒక్క గదిలో 25 మంది. ఆఖరికి పాడుబడిన బాత్రూమ్ల్లో కూడా ఇద్దరేసి విద్యార్ధులు సర్దుకుపోతున్నారు. వర్షం పడితే ఆ రోజు జాగారమే. ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ప్రభుత్వ కళాశాల విద్యార్థుల వసతిగృహంలో ఉన్న పరిస్థితి. గత మూడేళ్లుగా వారు ఉంటున్న అద్దె భవనాన్ని ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి అందరినీ కలిసినా స్పందన లేదు. గత వారంలో ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి విద్యార్థులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో ఆయన గురువారం సాయంత్రం స్థానిక మామిడిపాలెం ఎస్సీ విద్యార్థుల వసతి గృహాన్ని అకస్మికంగా పరిశీలించారు. అక్కడ విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల్ని చూసి చలించిపోయారు. తొలుత హాస్టల్లోకి ప్రవేశించగానే స్నానపు గదులు లేక ఆరుబయటే స్నానాలు చేస్తున్న విద్యార్థులు కంటపడ్డారు. అక్కడి నుంచి భోజనాల గదిలోకి వెళ్లగానే పరిశుభ్రత, పాడుపడిన గదులుస్వాగతం పలికాయి. వసతి గృహంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులను ఎంపీ ప్రశ్నించగా పదిహేడు గదులు మాత్రమే ఉన్నాయని, వాటిలో మొత్తం 350 మంది ఉండాల్సి వస్తుందని తెలిపారు. ఆ గదులు కూడా చాలా చిన్నవని, చివరికి మరుగుదొడ్లు కూడా వసతి రూములుగా ఉపయోగించుకుంటున్నామని ఎంపీని తీసుకుపోయి చూపించారు. స్నానపు గదులు, మరుగు దొడ్లు లేవని, గదుల కిటీకీలకి కనీసం తలుపులు కూడా లేకపోవడంతో చలికి, వర్షానికి ఇక్కట్లకు గురవుతున్నామని వాపోయారు. పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించిన ఎంపీ నగరంలో నడిబొడ్డున ఉన్న వసతి గృహం ఇంత అధ్వానంగా ఉంటే పట్టించుకునే అధికారే లేకుండా పోవడం సిగ్గుచేటని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్లను కూడా వసతి గదులుగా ఉపయోగించుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తుందని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి కనీస వసతులు ఏర్పాటుకు కృషి చేస్తానని, బాడుగ భవనం కాకుండా సొంత భవనం నిర్మాణానికి చర్యలు చేపడతానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు. కళాశాలలో యాజమాన్యం కూడా తమని చిన్నచూపు చూస్తోందని ఎంపీ దృష్టికి విద్యార్థులు తీసుకురావడంతో స్పందించిన ఎంపీ కళాశాలల యాజమాన్యం తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. ఆర్జేడీతో మాట్లాడి కళాశాలల్లో యాజమాన్యం, సిబ్బందితో వచ్చే ఇబ్బందులను తొలగిస్తానని హామీ ఇచ్చారు. ధర్నాలు చేసినా ఫలితం లేదు గతంలో ఒకసారి కలెక్టర్ కూడా వచ్చి పరిశీలించి వెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.గతంలో కనీస వసతులు కల్పించాలంటూ ధర్నా కూడా చేశామని, అయినా మా గోడు ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఈ నెల 11, 12 తేదీల్లో కలెక్టర్‌ని కలిసి పరిస్థితి వివరించి న్యాయం చేస్తానని విద్యార్థులకు ఎంపీ భరోసా ఇచ్చారు.