బాత్రూమ్స్‌ కట్టిన త్రిష | Actress Trisha Builts Bathrooms | Sakshi
Sakshi News home page

బాత్రూమ్స్‌ కట్టిన త్రిష

Dec 31 2017 10:17 AM | Updated on Dec 31 2017 10:19 AM

Actress Trisha Builts Bathrooms - Sakshi

కాంచీపురం (తమిళనాడు) : నటి త్రిష బాత్రూమ్స్‌ కట్టారు. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమంలో భాగంగా కాంచీపురం జిల్లాలోని నెమలి గ్రామంలో నాలుగు మరుగుదొడ్లను నిర్మించేందుకు తన వంతు సాయం చేశారు త్రిష. సిమెంట్‌ను తన చేతులతో కలిపిన త్రిష.. ఇటుకలను వరుసలో పెట్టి నిర్మాణ పనులను ప్రారంభించడం విశేషం.

త్రిష యునెస్కోకు భారత్‌ తరఫున అంబాసిడర్‌గా ఉన్న విషయం తెలిసిందే. మరుగుదొడ్ల నిర్మాణంపై మాట్లాడిన త్రిష.. స్వచ్ఛ భారత్‌కు తన వంతు సాయం అందించడం ఆనందంగా ఉందని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement