
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్ర మోదీ సర్కారు తీరుపై శ్రీనగర్ మేయర్, జేకేపీసీ అధికార ప్రతినిధి జునైద్ అజిమ్ మట్టు మండిపడ్డారు. కశ్మీర్ లోయలో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నదని కేంద్రం చెప్తున్న వాదన చాలా అవాస్తవికంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసి.. జమ్మూకశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీనగర్ మేయర్‌కు కేంద్రం కేంద్ర సహాయమంత్రి హోదాను కల్పించింది. అయితే, ఆర్టికల్ 370ను రద్దుచేయడంతో కశ్మీర్ అంతటా అస్తిత్వ సంక్షోభం నెలకొందని మట్టు తాజాగా మీడియాతో పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ తమ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని తెలిపారు. నెలరోజులుగా కశ్మీర్‌లో ఆంక్షలు విధించడంతో కశ్మీరీలు తమ ఆప్తులతో కనీసం మాట్లాడలేకపోతున్నారని, కమ్యూనికేషన్ సేవలు అందుబాటులో లేకపోవడంతో కశ్మీరీ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment