ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్‌! | Sakshi
Sakshi News home page

ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనం! చూస్తే ఆ పాట పాడకుండా ఆగలేరు!

Published Mon, Aug 21 2023 1:04 PM

Srinagars Tulip Garden Enters Record Books As Asias Largest - Sakshi

తులిప్‌ గార్డెన్‌ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్‌ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్‌ గార్డెన్‌ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మొమోరియల్‌ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది.

ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్‌ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి గతంలో ట్విట్టర్‌లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్‌ గార్డెన్‌ ఆసియాలో అతిపెద్దది వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్‌ అంటే లాటిన్‌ భాషలో తలపాగా అని  అర్థం.  ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్‌ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం.

అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్‌ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్‌ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్‌ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్‌ తోట శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు జబర్వాన్‌ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది.

గతంలో దీని సిరాజ్‌ బాగ్‌ అనిపిలిచే వారు. శ్రీనగర్‌ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్‌ లోయలో ఏడు టెర్రస్‌లతో కూడిన టెర్రస్‌ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్‌ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ అడ్మినిస్ట్రేషన్‌ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్‌లోని వివిధ రకాల పూలతో తులిప్‌ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడం విశేషం. 

(చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..)

Advertisement
 
Advertisement
 
Advertisement