Tulip festival
-
తెరుచుకోనున్న తులిప్ గార్డెన్.. 17 లక్షల పూలతో కనువిందు!
జమ్మూకశ్మీర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత తులిప్ గార్డెన్ మార్చి 23 నుంచి పర్యాటకుల కోసం తెరుచుకోనుంది. ఈసారి 17 లక్షల తులిప్ పూలు పర్యాటకులకు కనువిందు చేయనున్నాయని గార్డెన్ అధికారులు తెలిపారు. మార్చి 19 నుండి 20 రోజుల పాటు తులిప్ ఫెస్టివల్ జరగనుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దాల్ సరస్సు ఒడ్డున ఉన్న ఈ తులిప్ గార్డెన్ ప్రకృతి ప్రియులను ఎంతగానో ఆకట్టుకోనుంది. ఫ్లోరికల్చర్ అధికారి జావేద్ మసూద్ మాట్లాడుతూ మార్చి 23న ఈ గార్డెన్‌ను ప్రారంభించనున్నారని, ఇక్కడి పూలు అందరినీ తప్పక ఆకట్టుకుంటాయని అన్నారు. తులిప్ గార్డెన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉద్యానవనమని, కశ్మీర్ లోయలో పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తున్నదని అన్నారు. ఈసారి జరిగే తులిప్ ఫెస్టివల్లో ఐదు కొత్త రకాల పూలను పరిచయం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 17 లక్షల తులిప్ పూలను చూడవచ్చన్నారు. కాగా ఈ గార్డెన్‌ను సిద్ధం చేయడానికి దాదాపు ఆరు నెలలు పడుతుందని, ఇందుకోసం విస్తృతమైన ప్రణాళిక ఉంటుందన్నారు. ఈ ఏడాది పర్యాటకుల సంఖ్యపై మరింతగా పెరిగే అవకాశం ఉన్నదని గార్డెన్ అధికారులు తెలిపారు. -
ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా ఆ గార్డెన్!
తులిప్ గార్డెన్ చూడగానే ఎవ్వరైన మంత్రముగ్ధులవ్వాల్సిందే. అంతలా అందంగా ఉంటాయి ఆ పూల మొక్కలు. చూడగానే కట్టిపడేసే అందంతో పాటు ఆహ్లాదాన్నీ పంచే తులిప్ పుష్పాల గురించి వర్ణించడం కష్టతరం. తలలో పెట్టుకునేందుకు ఇవి ఉపయోగపడకపోయినా.. గృహాలంకరణలో మాత్రం రాజసాన్ని ఉట్టిపడేలా చేస్తాయి. అలాంటి తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్ద ఉద్యానవనంగా రికార్డులకెక్కింది. ఇది శ్రీనగర్‌లోని ఇందిరాగాంధీ మొమోరియల్ ఉంది. ఏకంగా 1.5 మిలియన్ల పూలతో ఈ రికార్డును కైవసం చేసుకుంది. ఈ ఉద్యానవనంలో 68 విభిన్న రకాల మొక్కల నుంచి సుమారు 1.5 మిలయన్ల పైగా తులిప్ పుష్పాలు ఉంటాయి. ఈ విషయం గురించి కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గతంలో ట్విట్టర్లో పేర్కొన్నారు కూడా. ఆయన ఈ సుందర వనాన్ని దాదాపు లక్షమంది దాక సందర్శించి ఉండొచ్చన్నారు. అలాంటి అందమైన తులిప్ గార్డెన్ ఆసియాలో అతిపెద్దది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. తులిప్ అంటే లాటిన్ భాషలో తలపాగా అని అర్థం. ఇవి లిల్లీ జాతికి చెందినవి. తులిప్‌లో దాదాపు 150 జాతులకు చెందిన 3వేల వెరైటీలు ఉన్నాయి. ఈ మొక్కలను మనం వెంకటేష్ టబు నటించిన కూలీ నెం.1 సినిమాలో చూశాం. అందులో "కొత్తకొత్తగా ఉన్నది..స్వర్గమిక్కడే అన్నది" అనే పాటలోఒ ఈ గార్గెన్ని కనిపిస్తుంది. చాలాచాలా బాలీవుడ్ సినిమాల్లో కూడా ఉండొచ్చు గానీ. మనీకు తెలిసినంతవరకు ఆ తులిప్ పూలను చూస్తే మనకు మాత్రం నిస్సందేహంగా ఆ పాట గుర్తుకొస్తుంది. నిజంగా ఆ పూలను చూసే అలా పాట రాశారేమో కాబోలు. ఇక ఈ తులిప్ తోట శ్రీనగర్‌లోని దాల్ సరస్సు జబర్వాన్ కొండల మధ్య ఉంది. ఈ ఉద్యానవనం సుమారు 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో దీని సిరాజ్ బాగ్ అనిపిలిచే వారు. శ్రీనగర్ టూరిజం ప్రకారం ఈ ఉద్యానవనం 2007లో పూల పెంపకంతో పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ప్రారంభించబడింది. ఈ కాశ్మీర్ లోయలో ఏడు టెర్రస్లతో కూడిన టెర్రస్ పద్ధతిలో నేలపై ఏటవాలుగా ఈ గార్డెన్‌ని ఏర్పాటు చేశారు. జమ్మూ కాశ్మీర్ అడ్మినిస్ట్రేషన్ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఆ గార్డెన్‌లోని వివిధ రకాల పూలతో తులిప్ పండుగను ఏటా ఘనంగా నిర్వహిస్తోంది. ప్రతి వసంత రుతువులో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించడం విశేషం. (చదవండి: అతిపెద్ద పిల్లి..అచ్చం మనిషిలా..) -
శ్రీనగర్ : తులిప్ గార్డెన్ ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
కశ్మీర్ వెళ్లి తులిప్ అందాలు చూసొద్దామా..
-
కాశ్మీర్లో అతిపెద్ద తులిప్ ఫెస్టివల్
శ్రీనగర్: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్ నిర్వహించేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్రం ఏప్రిల్ ఒకటి నుంచి 15 రోజుల పాటు ఈ ఉత్సవం జరుపనుంది. బహార్ -ఇ- కశ్మీర్ (కశ్మీర్లో వసంతం) కార్యక్రమాల్లో భాగంగా జమ్మూ దాల్ సరస్సు సమీపంలోని ఆసియాలోనే అతి పెద్ద ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ పూల గార్డెన్లో ఈ ఉత్సవానికి రంగం సిద్ధం చేసింది. రకరకాల పూలు, చేతి వృత్తి కళాకారులు రూపొందించిన వస్తువులు, సంప్రదాయ వంటకాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తామని రాష్ట్ర మంత్రి ఫరూక్ అహ్మద్ షా తెలిపారు. అంతేకాకుండా, మొట్టమొదటి సారిగా ఉర్దూ కవి గాయక సమ్మేళనం కూడా ఉంటుందని చెప్పారు. గత జూలైలో అనంతనాగ్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ, అతని ఇద్దరు సహాయకులు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అల్లర్లు నిత్యకృత్యంగా మారటంతో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తాజాగా తన ప్రయత్నాలను ప్రారంభించింది.