కాశ్మీర్‌లో అతిపెద్ద తులిప్ ఫెస్టివల్
కాశ్మీర్‌లో అతిపెద్ద తులిప్ ఫెస్టివల్
Published Wed, Mar 8 2017 5:10 PM | Last Updated on Tue, Sep 5 2017 5:33 AM
శ్రీనగర్: ఆసియాలోనే అతిపెద్ద తులిప్ ఫెస్టివల్ నిర్వహించేందుకు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్న ఆ రాష్ట్రం ఏప్రిల్ ఒకటి నుంచి 15 రోజుల పాటు ఈ ఉత్సవం జరుపనుంది. బహార్ -ఇ- కశ్మీర్ (కశ్మీర్‌లో వసంతం) కార్యక్రమాల్లో భాగంగా జమ్మూ దాల్ సరస్సు సమీపంలోని ఆసియాలోనే అతి పెద్ద ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ పూల గార్డెన్‌లో ఈ ఉత్సవానికి రంగం సిద్ధం చేసింది. రకరకాల పూలు, చేతి వృత్తి కళాకారులు రూపొందించిన వస్తువులు, సంప్రదాయ వంటకాలు ఈ ఉత్సవాల్లో ప్రదర్శిస్తామని రాష్ట్ర మంత్రి ఫరూక్ అహ్మద్ షా తెలిపారు. అంతేకాకుండా, మొట్టమొదటి సారిగా ఉర్దూ కవి గాయక సమ్మేళనం కూడా ఉంటుందని చెప్పారు.
గత జూలైలో అనంతనాగ్ జిల్లాలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ, అతని ఇద్దరు సహాయకులు మృతి చెందారు. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో అల్లర్లు నిత్యకృత్యంగా మారటంతో పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తాజాగా తన ప్రయత్నాలను ప్రారంభించింది.
Advertisement
Advertisement