
శ్రీనగర్ : కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సీఆర్పీఎప్ పెట్రోలింగ్ వాహనమే లక్ష్యంగా ఉగ్రవాదులు గ్రనైడ్ దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అనంత్‌నాగ్ జిల్లాలోని బిజేహరాలో చోటుచేసుకుంది. కాగా గ్రనైడ్ దాడిలో ఇద్దరు గాయపడగా వారిలో హెడ్ కానిస్టేబుల్ శివలాల్ నీతమ్ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. కాగా మరొకరి పరిస్థితి బాగానే ఉందన్నారు. మంగళవారం సాయంత్రం బిజ్‌బెహరా ఏరియాలో సీఆర్పీఎఫ్ వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుంది.