శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి పోలింగ్ ప్రారంభమయ్యింది. శ్రీనగర్, పుల్వామా, బుద్గాం, గందర్‌బల్, షోపియాన్ జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 17.47 లక్షల మంది ఓటర్లు నేడు (సోమవారం) తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 24 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మహిళా ఓటర్ల కోసం 20 పింక్ బూత్‌లను ఏర్పాటు చేసి, అక్కడ మహిళా సిబ్బందిని నియమించారు.
శ్రీనగర్‌లోని 18 బూత్‌లను వికలాంగుల పర్యవేక్షణలో, 17 బూత్‌లను యువకుల పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించేందుకు 21 గ్రీన్ బూత్‌లను కూడా ఏర్పాటు చేశారు. శ్రీనగర్ పార్లమెంటరీ సీటు పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను అమర్చారు. అన్ని కేంద్రాల నుండి లైవ్ వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. జిల్లా కంట్రోల్ రూంతోపాటు సీఈఓ కార్యాలయం నుంచి దీనిని వీక్షించనున్నారు. కొన్ని కేంద్రాల్లో శాటిలైట్ ఫోన్లు, వైర్‌లెస్ సెట్లు ఏర్పాటు చేశారు.
VIDEO | Jammu and Kashmir: Security heightened at Srinagar’s Lal Chowk ahead of polling.
Voting for the fourth phase will be held today in 96 Lok Sabha Constituencies across 10 states and UTs. #LSPolls2024WithPTI #LokSabhaElections2024
(Full video available on PTI Videos -… pic.twitter.com/tEjEU7AVlG— Press Trust of India (@PTI_News) May 13, 2024
సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలుచున్న చివరి ఓటరు ఓటు వేసే వరకు పోలింగ్ జరగనుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. సంబంధిత బీఎల్‌ఓ ఆధ్వర్యంలో కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఎన్నికలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాలతోపాటు ప్రధాన ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment