ఉగ్ర పంజా... కశ్మీర్‌లో భారీ పేలుడు | Terrorist Attack in Baramulla Kills Police Men | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 6 2018 11:24 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM

Terrorist Attack in Baramulla Kills Police Men - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారీ పేలుడు జరపటంతో నలుగురు పోలీస్‌ సిబ్బంది ప్రాణాలు వదిలారు. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. 

శనివారం ఉదయం రద్దీగా ఉండే ఓ మార్కెట్‌ సముదాయం వద్ద ఐఈడీ మందుపాతరతో ఉగ్రవాదులు పేలుడు జరిపారు. పేలుడు ధాటికి ఓ షాపు పూర్తిగా కుప్పకూలిపోయిందని.. తీవ్రత చాలా దూరం ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించిన సైన్యం.. ఉగ్రవాదుల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.  గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement