ied bomb blast
-
బెంగళూరు కేఫ్‌లో బాంబు పేలుడు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడు ఘటనతో బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలో నిత్యం రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ పరిధిలోని బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని రామేశ్వరం కేఫ్‌లో మధ్యాహ్నం వేళ ఈ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో కేఫ్ సిబ్బందిసహా 10 మంది గాయపడ్డారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా పేలుడు సంభవించిందని తొలుత అందరూ భావించారు. 30 ఏళ్లలోపు వయసు వ్యక్తి ఒకరు ఆ కేఫ్‌లోని హ్యాండ్‌వాష్ వద్ద ఉన్న చెత్తబుట్టలో ఒక బ్యాగును పడేసి వెళ్లినట్లు అక్కడి సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అత్యాధునిక పేలుడు పదార్థం(ఐఈడీ) వల్లే ఈ పేలుడు సంభవించిందని బాంబు నిరీ్వర్య బలగాలు, ఫోరెన్సిక్స్ ల్యాబోరేటరీ, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బృందాలు ఒక ప్రాథమిక అంచనాకు వచ్చాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని గుర్తించారు. టోకెన్ కౌంటర్ వద్ద రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసిన ఆ వ్యక్తి తర్వాత తినకుండా వెళ్లిపోయినట్లు సీసీటీవీలో రికార్డయింది. పోయేముందు ఒక బ్యాగును అక్కడి హ్యాండ్‌వాష్ దగ్గరి చెత్తబుట్టలో పడేసినట్లు కనిపిస్తోంది. ఒక గంట తర్వాత బాంబు పేలింది. ఐఈడీ బాంబును టైమర్ సాయంతో పేల్చి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలిని కర్ణాటక డీజీపీ సందర్శించారు. ‘ ఈ బాంబు పేలుడు ఘటనలో ఇప్పటికే లభించిన ఆధారాల సాయంతో దర్యాప్తు ముమ్మరం చేశాం’ అని రాష్ట్ర డీజీపీ అలోక్ మోహన్ చెప్పారు. ‘‘కేఫ్‌లో తినేందుకు అప్పుడే అక్కడికొచ్చాం. 40 మంది దాకా ఉన్నాం. ఒక్కసారిగా భారీ పేలుడు జరగడంతో ప్రాణభయంతో పరుగులు తీశాం’’ అని ప్రత్యక్ష సాక్షులు ఎడిసన్, అమృత్ చెప్పారు. ఎన్ఐఏ బృందం ఘటనాస్థలిని సందర్శించింది. పేలుడు స్థలంలో బ్యాటరీ, వైర్లను గుర్తించారు. కేవలం పది సెకండ్ల వ్యవధిలో రెండు పేలుళ్లు సంభవించాయని కెఫే ఎండీ, సహ వ్యవస్థాపకురాలు దివ్య చెప్పారు. దుండగులను వదలిపెట్టం కేఫ్‌లో పేలుడుకు ఐఈడీ బాంబే కారణమని ఆ రాష్ట్రముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. ‘‘నిందితులను గుర్తించి చట్టం ముందు నిలబెడతాం. ఈ ఘటన వెనుక ఉన్నది ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదు’ అని శుక్రవారం మైసూరులో వ్యాఖ్యానించారు. ‘‘ ఘటనపై పోలీసు శాఖ దర్యాప్తు చేపట్టింది. సీసీకెమెరాల ద్వారా నిందితుల ఆచూకీ గుర్తించేందుకు చర్యలు చేపట్టాం. ఇది ఉగ్రవాదుల పనిలా లేదు. పేలుడు ఘటన వెనుక ఉన్నవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని సీఎం అన్నారు. -
రిపబ్లిక్ డే టార్గెట్‌గా భారీ కుట్ర.. దేశ రాజధానిలో బాంబు కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గుర్తుతెలియని దుండగులు బాంబును అమర్చారు. ప్రస్తుతం ఈ ఘటన కలకలంగా మారింది. స్థానిక ఘాజీపూర్ ఫ్లవర్ మండీలో ఒక బ్యాగ్ ఉండటాన్ని స్థానికులు గమనించారు. చాలాసేపటి నుంచి బ్యాగ్ మార్కెట్లోనే ఉండటంతో అనుమానంతో.. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, నేషనల్‌సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక పరికంతో బ్యాగ్ స్కాన్ చేసి పరిశీలించారు. ఆ బ్యాగ్‌లో పేలుడు పదార్థం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే స్థానికులను అప్రమత్తం చేసి ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. భారీగా భద్రత దళాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా అగ్నిమాపక సిబ్బందిని అప్రమత్తం చేశారు. బ్యాగ్‌లో 3 కిలోల ఐఈడీ పేలుడు పరికరం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత.. ఒక రోబో సహయంతో ఆ బ్యాగ్‌ను మైదాన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ భూమిలో ఎనిమిదడుగుల లోతులో ఆ పరికరంను ఉంచి బాంబ్‌ను నిర్వీర్యం చేశారు. నేషనల్ సెక్యురీటి గార్డు అధికారులు సమయానికి స్పందించడంతో పెద్ద ముప్పుతప్పింది. ఇంకా ఎక్కడైన బాంబులు ఉన్నాయా.. అన్న కోణంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఫ్లవర్ మండీ మార్కెట్ భోగి పండుగ నేపథ్యంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సంవత్సరం పాటు చేపట్టిన దీక్షా స్థలం కూడా ఘాజీపూర్ మండీకి సమీపంలోనే ఉంది. గణతంత్ర దినోత్సవానికి కొద్దిరోజుల ముందే బాంబు ఘటన వెలుగుచూడటంతో నేషనల్ సెక్యూరిటీ గార్డు సిబ్బంది, స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం డీసీపీ ప్రమోద్ కుష్వాహ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలోని సీసీఫుటేజీని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో హై అలెర్ట్ కొనసాగుతుంది. చదవండి: యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు.. ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు -
పుల్వామాలో తప్పిన పెను ముప్పు
-
మందుపాతర పేల్చిన మావోలు
చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బస్తర్ జిల్లాలో శనివారం మందుపాతర పేల్చారు. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా మరో జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. బస్తర్ రేంజ్ ఐజీ పి.సుందర్రాజ్ కథనం ప్రకారం.. జిల్లాలోని బాన్సూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొద్లీ–బాల్వాయి గ్రామాల మధ్య రహదారి నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డు పనుల వద్ద భద్రతగా నిలిచేందుకు బాన్సూర్ పోలీస్ స్టేషన్ నుంచి సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బలగాలు వెళ్తుండగా, మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఉపేందర్ సాహూ, దేవేందర్ సాహూ మృతిచెందారు. సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా ప్రత్యేక హెలికాప్టర్లో రాయ్‌పూర్‌కు తరలించి వైద్య సేవలనందిస్తున్నారు. మందుపాతర పేల్చిన అనంతరం మావోయిస్టులు, పోలీసులకు మధ్య 15 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టారు. -
ఆర్మీ వాహనంపై ఉగ్ర దాడి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అరిహల్‌లో ఆర్మీ అధికారుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ దాడిలో తొమ్మిది మంది భద్రతా సిబ్బంది, ఇద్దరు పౌరులు గాయపడ్డారు. ఈ దాడికి ఉగ్రవాదులు శక్తిమంతమైన ఇంప్రొవైస్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని వినియోగించారు. ఫిబ్రవరి 14న ఓ సూసైడ్ బాంబర్ 40 మంది సీఆర్పీఎఫ్ అధికారులను బలితీసుకున్న ప్రాంతానికి ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే జరగడం గమనార్హం. 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఈ ఆర్మీ వాహనం బుల్లెట్, మైన్ ప్రూఫ్ కావడంతో సైన్యానికి పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. దక్షిణ కశ్మీర్ జిల్లాలోని అరిహల్ లస్సిపురా రోడ్డు మీద ఈ దాడి జరిగింది. అనంతరం పరిస్థితిని అదుపులోకి తేవడానికి మరికొంత మంది సిబ్బందిని రప్పించి, గాల్లోకి కాల్పులు జరిపామని అధికారులు తెలిపారు. చిన్నగాయాలు మినహా ఏ నష్టమూ జరగలేదని, ఉగ్రవాదులు చేసిన దాడి విఫలమైందని కల్నల్ రాజేష్ కలియా అన్నారు. బాంబుదాడి అనంతరం కూడా సోదాలు కొనసాగాయని అన్నారు. అయితే పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేయనున్నారని పాకిస్తాన్ ముందే హెచ్చరించడం గమనార్హం. పాక్ చెప్పడానికి కారణాలేంటి? అల్‌కాయిదాకు అనుబంధ సంస్థకు చెందిన ఉగ్రవాది జకీర్ మూసాను చంపినందుకు ప్రతీకారంగా భారత్‌లో దాడులు చేయాలని ఉగ్రవాదులు నిర్ణయించుకున్నట్లు తమకు సమాచారం అందిందని పాక్ ఇటీవల భారత ప్రభుత్వానికి తెలిపింది. ఈ దాడులు అమర్నాథ్ యాత్రకు ముందుగానీ, తర్వాతగానీ దాడులు చేసేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నారంది. 2016లో కూడా పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ జాంజువా అప్పటి భారత జాతీయ భద్రతా సలహాదారు ధోవల్‌కు గుజరాత్లో 26/11 లాంటి దాడులు నిర్వహించేందుకు ఉగ్రవాదులు పథకం పన్నారని తెలిపారు. పాక్ ఇలాంటి హెచ్చరికలు చేయడంపై పలు అనుమానాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ సమాజంలో తాము ఉగ్రవాదానికి వ్యతిరేకులమన్న సందేశాన్ని వ్యాప్తి చేయడమే పాక్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. -
నిర్లక్ష్యం వల్లే మావోల దాడి
గడ్చిరోలి/న్యూఢిల్లీ: గడ్చిరోలి జిల్లాలో 15 మంది పోలీస్ కమాండోలు, ఓ డ్రైవర్‌ను బలికొన్న ఘటనలో సిబ్బంది ప్రామాణిక నిర్వహణా విధానాన్ని(ఎస్పీవో) పాటించలేదని మహారాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. దాదర్‌పూర్ వద్ద 36 వాహనాలను దహనం చేసిన మావోలు పోలీసులు అక్కడకు వచ్చేలా ఉచ్చు పన్నారన్నారు. ఇలాంటి సందర్భాల్లో భద్రతాబలగాలు చిన్న బృందాలుగా విడిపోయి కాలినడకన ఘటనాస్థలికి చేరుకుంటాయని వెల్లడించారు. కానీ గడ్చిరోలిలో క్విక్ రెస్పాన్స్ టీం(క్యూఆర్టీ) కమాండోలు నిబంధనలు పాటించకుండా ఓ ప్రైవేటు వ్యానులో దాదర్పూర్కు బయలుదేరారనీ, తద్వారా మావోలు పక్కా ప్రణాళికతో చేసిన ఐఈడీ దాడిలో ప్రాణాలు విడిచారని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ సందర్భంగా జవాన్లు కనీసం మైన్ప్రూఫింగ్ వాహనాన్ని వాడకపోవడాన్ని ఆయన గుర్తుచేశారు. సాధారణంగా ఇక్కడి భద్రతను, కూంబింగ్ ఆపరేషన్లను పురాదా కేంద్రంగా ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహిస్తాయనీ, అయితే వీరంతా సార్వత్రిక ఎన్నికల విధుల్లో ఉండిపోవడంతో పోలీస్ కమాండోలకు ఇక్కడి బాధ్యతలు అప్పగించారని చెప్పారు. మావోల దాడి ఘటనను మహారాష్ట్ర డీజీపీ స్వయంగా విచారిస్తారని సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. దాడిని ఖండించిన ఎన్హెచ్ఆర్సీ: గడ్చిరోలిలో మావోయిస్టుల దుశ్చర్యను జాతీయ మానవహక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) ఖండించింది. అమరుల కుటుంబాలు తగిన రీతిలో నష్టపరిహారం చెల్లించాలని వ్యాఖ్యానించింది. -
కశ్మీర్‌కు పెరిగిన ‘ఐఈడీ’ ముప్పు
న్యూఢిల్లీ: ఐదేళ్లలో జమ్మూ కశ్మీర్లో ఐఈడీ(ఇంప్రూవైజ్డ్ ఎక్సప్లోజివ్ డివైజ్) విధ్వంసాలు, బాంబు పేలుళ్ల సంఖ్య పెరిగిందని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. ఒక్క 2018లోనే ఇలాంటి ఘటనలు 57 శాతం పెరిగినట్లు పేర్కొంది. మావోయిస్టు ప్రాబల్య ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి తరహా దాడులు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. ఇటీవల ఢిల్లీలో ముగిసిన సదస్సులో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ)కి చెందిన నేషనల్ బాంబ్ డేటా సెంటర్(ఎన్బీడీసీ) ఈ నివేదికను విడుదల చేసింది. అందులోని ముఖ్యాంశాలు.. జమ్మూ కశ్మీర్లో 2014లో ఐఈడీ దాడుల సంఖ్య 37 కాగా..2015లో 46, 2016లో 69, 2017లో 70, 2018లో 117గా నమోదయ్యాయి. కశ్మీర్ మినహా దేశమంతటా బాంబు పేలుళ్ల ఘటనలు తగ్గుముఖం పట్టాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 2017 నుంచి 2018కి ఐఈడీ పేలుళ్లు 98 నుంచి 77కు తగ్గగా, కశ్మీర్లో మాత్రం 57 శాతం పెరిగాయి. అయితే, 2017తో పోలిస్తే గతేడాది కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో ఎదురుదెబ్బలు తిన్న ఉగ్రవాదులు, తిరుగుబాటుదారులు భద్రతా బలగాలను ఎదుర్కోలేక ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారు. 2018లో నక్సల్స్ ప్రాబల్య ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్ల కారణంగా 55 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న మొత్తం ఐఈడీ మృతుల సంఖ్య కన్నా ఈ సంఖ్య సగం కన్నా ఎక్కువ. ఈశాన్య ప్రాంతాలతో పోలిస్తే మరణాలు నమోదుకాని దాడుల సంఖ్య కూడా కశ్మీర్లో పెరిగింది. -
బీఎస్ఎఫ్ వాహనం పై మావోయిస్టుల మెరుపు దాడి
రాయపూర్: బీజాపుర్‌లో మావోయిస్టులు మళ్లీ పంజా విసిరారు. బీఎస్ఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు మందుపాతర (ఐఈడీ)తో పేల్చివేశారు. ఈ దాడిలో ఐదుగు బీఎస్ఎఫ్ జవాన్లుకు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటపలో నలుగురు బీఎస్ఎఫ్ జవాన్లతో పాటు వాహన డ్రైవర్‌కి తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసు ఉన్నతాధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. -
ఉగ్ర పంజా... కశ్మీర్లో భారీ పేలుడు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో భారీ పేలుడు జరపటంతో నలుగురు పోలీస్ సిబ్బంది ప్రాణాలు వదిలారు. ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శనివారం ఉదయం రద్దీగా ఉండే ఓ మార్కెట్ సముదాయం వద్ద ఐఈడీ మందుపాతరతో ఉగ్రవాదులు పేలుడు జరిపారు. పేలుడు ధాటికి ఓ షాపు పూర్తిగా కుప్పకూలిపోయిందని.. తీవ్రత చాలా దూరం ప్రభావం చూపిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించిన సైన్యం.. ఉగ్రవాదుల కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా ఉద్రిక్తంగా మారింది. More #visuals from Baramulla where 4 Policemen have lost their lives after an IED blast by terrorists in Sopore #JammuAndKashmir pic.twitter.com/BLybHzhaFl — ANI (@ANI) January 6, 2018 -
ఐఈడీ పేలుడు: జవానుకు తీవ్ర గాయాలు
ఖమ్మం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా కిష్టారం గ్రామం వద్ద మంగళవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. దీంతో కూంబింగ్‌లో ఉన్న ఘనశ్యాం అనే జవానుకు తీవ్ర గాయాలయ్యాయి. పైడిగూడెం గ్రామం దాటాక చిన్న నాలా వద్ద ఈ సంఘటన జరిగింది. మరో బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని వెంటనే హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా అస్పత్రికి తరలించారు.