శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఓ మహిళ సీఆర్‌పీఎఫ్ బంకర్‌పై పెట్రో బాంబుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్‌పీఎఫ్ క్యాంప్ ముందు మంగళవారం సాయంత్రం ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో బుర్ఖా ధరించిన ఓ మహిళ చేతిలో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగి తన బ్యాగులోంచి బాంబును తీసి దానికి నిప్పటించి సీఆర్‌పీఫ్ క్యాంప్ మీదకు విసిరింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది.
కాగా మహిళ విసిరిన బాంబు సెక్యూరిటీ క్యాంపు బయట పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి జరిగిన వెంటనే సీఆర్‌పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళను గుర్తించినట్లు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చదవండి: లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం
#WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir
— ANI (@ANI) March 30, 2022
(Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY
Comments
Please login to add a commentAdd a comment