burqa-clad women
-
సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఓ మహిళ సీఆర్పీఎఫ్ బంకర్‌పై పెట్రో బాంబుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ముందు మంగళవారం సాయంత్రం ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో బుర్ఖా ధరించిన ఓ మహిళ చేతిలో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగి తన బ్యాగులోంచి బాంబును తీసి దానికి నిప్పటించి సీఆర్పీఫ్ క్యాంప్ మీదకు విసిరింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. కాగా మహిళ విసిరిన బాంబు సెక్యూరిటీ క్యాంపు బయట పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళను గుర్తించినట్లు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం #WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir (Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY — ANI (@ANI) March 30, 2022 -
మద్యం మత్తులో.. తుపాకీతో మహిళ హల్చల్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుర్ఖా ధరించి చేతిలో తుపాకీ పట్టుకుని ఓ షాపు యజమానిని బండ బూతులు తిడుతూ.. గాల్లోకి కాల్పులు జరిపి ఓ మహిళ హల్చల్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఇక సదరు యువతిని జఫ్రబాద్‌కు చెందిన నుస్రత్‌గా గుర్తించారు. ఇక ఈ సంఘటన ఈశాన్య ఢిల్లీలోని చౌహాన్ బంగ్రా ప్రాంతంలో ఈ నెల 18న చోటు చేసుకుంది. నుస్రత్‌కి, ఓ షాపు యజమానికి మధ్య మొబైల్ ఫోన్‌కు సంబంధించి వివాదం తలెత్తింది. అప్పటికే మద్యం సేవించి ఉన్న నుస్రత్ షాపు యజమానిని అసభ్యకరంగా తిడుతూ.. గన్‌తో బెదిరించడమే కాక అతని షాపు బయట కాల్పులు కూడా జరిపింది. (చదవండి: రాత్రి చితక్కొట్టి: పొద్దున అల్లుడ్ని చేసుకున్నారు) అంతేకాక తాను గ్యాంగ్‌స్టర్ నసీర్ సోదరినని తెలిపింది. మహిళ చర్యలతో అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో పోలీసులు ఆమె మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ వీడియో ఇండియాటుడేలో ప్రసారం అయ్యింది. -
‘బురఖా తనిఖీకి మహిళా పోలీసులను పెట్టండి’
లక్నో: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లోనకిలీ ఓట్లను అరికట్టడంలో భాగంగా బురఖా ధరించి వచ్చే ఓటర్లను తనిఖీ చేసేందుకు మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సమస్యాత్మక పోలింగ్ బూత్‌ల వద్ద పారా మిలిటరీ దళాలను కూడా మోహరించాలంది. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి నజీం జైదీకి బీజేపీ ఒక వినతిపత్రం సమర్పించింది. దీనివల్ల నకిలీ ఓట్లు పడవని బీజేపీ తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతుండగా ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న నిరాశ, నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోందని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన ఆక్షేపించింది.