‘బురఖా తనిఖీకి మహిళా పోలీసులను పెట్టండి’ | BJP wants burqa-clad women voters be checked in UP | Sakshi
Sakshi News home page

‘బురఖా తనిఖీకి మహిళా పోలీసులను పెట్టండి’

Published Fri, Mar 3 2017 6:04 PM | Last Updated on Sat, Aug 25 2018 5:02 PM

BJP wants burqa-clad women voters be checked in UP

లక్నో: ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లోనకిలీ ఓట్లను అరికట్టడంలో భాగంగా బురఖా ధరించి వచ్చే ఓటర్లను తనిఖీ చేసేందుకు మహిళా పోలీసులను ఏర్పాటు చేయాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌ల వద్ద పారా మిలిటరీ దళాలను కూడా మోహరించాలంది. ఈ మేరకు ముఖ్య ఎన్నికల అధికారి నజీం జైదీకి బీజేపీ ఒక వినతిపత్రం సమర్పించింది. దీనివల్ల నకిలీ ఓట్లు పడవని బీజేపీ తెలిపింది.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతుండగా ఇప్పటికే ఐదు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కాగా, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న నిరాశ, నిస్పృహతోనే బీజేపీ ఇలాంటి ఫిర్యాదులు చేస్తోందని ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శివసేన ఆక్షేపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement