petro bombs
-
TN: రాజ్‌భవన్‌పై పెట్రో బాంబుల దాడి
చెన్నై: తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులతో రాజ్‌భవన్‌పై దాడికి పాల్పడడమే అందుకు కారణం. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు పెట్రోల్ బాంబుల్ని రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్దకు విసిరేశాడు ఆగంతకుడు. ఆ ధాటికి బారికేడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు కొంత భాగం దెబ్బ తింది. వెంటనే అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కారుకా వినోద్‌గా గుర్తించారు. ఘటన సమయంలో గవర్నర్ రాజ్‌భవన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపేట కోర్టు బయట పార్క్ చేసిన ఉన్న బైకుల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన వినోద్.. రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా ఆ రెండు బాటిళ్లకు నిప్పటించి మెయిన్ గేట్ వైపు విసిరాడు. నీట్ బిల్లు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అయితే ఈలోపు అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. అతన్ని నిలువరించారు. అతని నుంచి మరో రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లే వినోద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. వినోద్ 2022లో చెన్నై బీజేపీ కార్యాలయంపైకి పెట్రోల్ బాంబులు విసిరిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. ఈ ఘటనపై బీజేపీ, డీఎంకే సర్కార్‌పై మండిపడుతోంది. శాంతి భద్రతలను ఈ ప్రభుత్వం ఏస్థాయిలో పరిరక్షిస్తుందో.. రాజ్‌భవన్‌పై జరిగిన దాడి ప్రతిబింబిస్తోందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. Petrol bombs were hurled at Raj Bhavan today, reflects the true law and order situation in Tamil Nadu. While DMK is busy diverting the attention of people to insignificant matters of interest, criminals have taken the streets. Incidentally, it is the same person who attacked… — K.Annamalai (@annamalai_k) October 25, 2023 -
సీఆర్పీఎఫ్ బంకర్‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో ఓ మహిళ సీఆర్పీఎఫ్ బంకర్‌పై పెట్రో బాంబుతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బారాముల్లా జిల్లా సోపోర్‌లోని సీఆర్పీఎఫ్ క్యాంప్ ముందు మంగళవారం సాయంత్రం ఈ బాంబు దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఇందులో బుర్ఖా ధరించిన ఓ మహిళ చేతిలో బ్యాగ్ పట్టుకొని రోడ్డు మీద వెళ్తూ కనిపిస్తోంది. ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఆగి తన బ్యాగులోంచి బాంబును తీసి దానికి నిప్పటించి సీఆర్పీఫ్ క్యాంప్ మీదకు విసిరింది. అనంతరం అక్కడి నుంచి పరారయ్యింది. కాగా మహిళ విసిరిన బాంబు సెక్యూరిటీ క్యాంపు బయట పడటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. అలాగే దాడి జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ జవాన్లు అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పేసినట్లు తెలిపారు. ఇప్పటికే మహిళను గుర్తించినట్లు, ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. నిందితురాలిని త్వరలోనే అరెస్టు చేస్తామని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: లఖింపూర్ ఖేరీ కేసులో కీలక పరిణామం #WATCH Bomb hurled at CRPF bunker by a burqa-clad woman in Sopore yesterday#Jammu&Kashmir (Video source: CRPF) pic.twitter.com/Pbqtpcu2HY — ANI (@ANI) March 30, 2022 -
దినకరన్ ఇంటిపై దాడి
సాక్షి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత, ఎమ్మెల్యే దినకరన్ ఇంటిపై ఆదివారం మధ్యాహ్నం పెట్రో బాంబు దాడికి యత్నం జరిగింది. ఈ ఘటనలో బాంబు విసిరిన వ్యక్తి సహా నలుగురు గాయపడ్డారు. చెన్నై బీసెంట్‌నగర్‌లో దినకరన్ నివాసం ఉంది. ఇటీవల పార్టీ పదవి నుంచి ఉద్వాసనకు గురైన కాంచీపురంనకు చెందిన పరిమళన్ తన కారులో పెట్రో బాంబులతో దినకరన్ ఇంటికి వచ్చాడు. కారును ఆపి, అందులో ఉన్న పెట్రో బాంబును దినకరన్ ఇంట్లోకి విసిరే యత్నం చేశాడు. అయితే, అది చేజారి కారులోనే పడింది. దీంతో అందులోని మిగతా పెట్రో బాంబులు అంటుకుని పేలడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న దినకరన్ వాహన డ్రైవర్, ఫొటోగ్రాఫర్, ఆటోడ్రైవర్ గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బీజేపీ నాయకుడి ఇంటిపై పెట్రోబాంబు దాడి!
-
బైక్‌లపై వచ్చి ఠాణాపై బాంబులు విసిరి..
చెన్నై: చెన్నై కలకలం రేగింది. తేనాంపేట పోలీసు స్టేషన్‌పై గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు శక్తిమంతమైన పెట్రోలు బాంబును విసిరేశారు. దీంతో ఆ ప్రాంతంతో తీవ్ర సంచలనం కలిగించింది. సంఘటనా ప్రాంతాన్ని సందర్శించిన పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ నిందితులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బందాలను ఏర్పాటుచేశారు. చెన్నై నగర అతి ముఖ్యమైన పోలీసు స్టేషన్లలో ఇది కూడా ఒకటి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివశిస్తున్న పోయెస్ గార్డెన్ నివాసం, అమెరికా రాయబార కార్యాలయం, ముఖ్య ప్రముఖుల నివాసాలు, నక్షత్ర హోటళ్లు ఈ స్టేషన్ పరిధిలోనే ఉన్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో మౌంట్‌రోడ్ నిర్మానుష్యంగా కనిపించింది. ఆ సమయంలో నందనం సిగ్నల్ నుంచి మౌంట్‌రోడ్ వైపుగా రెండు బైక్‌లలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు తేనాంపేట పోలీసు స్టేషన్ రాగానే తమ చేతిలో ఉన్న రెండు పెట్రోలు బాంబులను పోలీసు స్టేషన్ వైపు విసిరారు. దీంతో పెద్ద శబ్దంతో ఓ బాంబు పేలడంతో అక్కడ మంటలు చెలరేగాయి. తెల్లవారుజాము కావడంతో పోలీసులు గస్తీ తిరిగేందుకు వెళ్లారు. పోలీసు స్టేషన్లో ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఈ పేలుడు శబ్దానికి మౌంట్‌రోడ్‌లో పోస్టర్లు అతికిస్తున్న ఓ వ్యక్తితోపాటు స్టేషన్‌లోపల ఉన్న ముగ్గురు పోలీసులు బయటికి వచ్చి చూశారు. నలుగురు వ్యక్తులు బైక్‌లలో వచ్చి పెట్రోలు బాంబులు విసిరినట్లు ఆ పోస్టర్ల వ్యక్తి తెలిపాడు. అక్కడి మంటలను పోలీసులు నీళ్లు చల్లి ఆర్పివేశారు. ప్రవేశ ద్వారం వద్ద మరో బాంబు పేలకుండా పడివుంది. ప్రత్యేక బందం పోలీసులు తేనాంపేట పోలీసు స్టేషన్లో ఉన్న సీసీ టీవి కెమెరాలను పరిశీలించారు. ఈ పోలీసు స్టేషన్ సమీపాన అమెరికన్ దౌత్యకార్యాలయం ఉన్నందున ఇందులో అంతర్జాతీయ కుట్ర ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గురువారం రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ 50 ఏళ్ల ప్రజాజీవిత స్వర్ణోత్సవం జరుగనుంది. ఇందులో కూటమి పార్టీల నేతలు పలువురు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసే దృష్టితో ఇలా చేశారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.