శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సోమవారం ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్ జవాన్లు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ వాహనం నుంచి బయటికి దిగుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రదాడిలో గాయపడిన వారిని ఇప్పటికే ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఉగ్రవాద కదలికలపై నిఘా పెట్టామని తెలిపారు. జమ్ము కశ్మీర్‌లో గత వారంలోనే భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన మూడవ దాడి ఇది. ఆగస్టు 14న శ్రీనగర్ నగర శివార్లలోని నౌగాం వద్ద ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులైన సంగతి తెలిసిందే. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. అంతకుముందు శ్రీనగర్- బారాముల్లా హైవేలోని హైగాం వద్ద సైనికుల బృందంపై ఉద్రవాదులు కాల్పులు జరపగా, ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు.
బారాముల్లా ఉగ్రదాడిలో ఇద్దరు జవాన్లు మృతి
Published Mon, Aug 17 2020 11:30 AM | Last Updated on Mon, Aug 17 2020 11:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment