కశ్మీర్లో మరోసారి ఉద్రిక్తత
ఆందోళన కారులు నదిహల్ గ్రామం వద్ద భద్రతా బలగాలపై పెద్ద ఎత్తున రాళ్లదాడి చేశారు. దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అహ్మద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కశ్మీర్ అల్లర్ల మృతుల సంఖ్య 72 కు చేరుకుంది. అహ్మద్ మరణంతో మరోసారి ఉధ్రిక్త పరిస్థితులు నెలకొనడంతో బారాముల్లా, సోపోర్ లలో మరోసారి భారీగా భద్రతా బలగాలు మోహరించాయి.