జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు | 2 terrorists killed in baramulla | Sakshi
Sakshi News home page

జమ్ముకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

Published Thu, Jun 1 2017 10:18 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM

2 terrorists killed in baramulla

► ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్ల జిల్లాలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు పాల్పడ్డారు. చివరకు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని సోపూర్‌ నాటిపూరలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది గురువారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి తనిఖీలు ప్రారంభించారు.

ఇది గుర్తించిన ఉగ్రవాదులు భద్రతాబలగాలపైకి కాల్పులు జరపడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయని ఉన్నతాధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement