
సాక్షి, నెల్లూరు: స్టాఫ్ నర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించిన డాక్టర్ రవీంద్రనాథ్ ఠాగూర్ పోలీస్ స్టేషన్ నుంచి పరారయ్యాడు. గతంలోనూ పలువురిపై వేధింపులకు పాల్పడ్డ ఈ కీచక వైద్యుడిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో అతను రాత్రికి రాత్రే పోలీస్ స్టేషన్ నుంచి అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇప్పటికే వైద్యుని తీరుపై ఆగ్రహంగా ఉన్న ఎస్పీ భాస్కర్ భూషణ్ ఈ ఘటనపై సీఐ సత్యనారాయణను వివరణ కోరారు. మరోవైపు పరారీలో ఉన్న డాక్టర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. కాగా ఉదయగిరి సీహెచ్‌సీ(సామాజిక ఆరోగ్య కేంద్రం)లో వైద్యవృత్తి నిర్వర్తిస్తున్న రవీంద్రనాథ్.. నర్సును లైంగికంగా వేధించిన కేసులో ఆమె బంధువులు సదరు డాక్టర్‌కు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. చదవండి: (ఆమ్లెట్ వేసుకురా.. అంటూ నర్స్‌తో)
Comments
Please login to add a commentAdd a comment