సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ
ఉదయగిరి: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా ఆడిట్ రిజిస్ట్రార్ పి.ఉషారాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగా కార్యాలయాన్ని సందర్శించి, వార్షిక తనిఖీ చేపట్టానన్నారు. ఏడాది కాలంగా జరిగిన రిజిస్ట్రేసన్ల డాక్యుమెంట్లు, రికార్డులు పరిశీలించినట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో జిల్లాలో రిజిస్ట్రేషన్లు తగ్గాయన్నారు. ఆమె వెంట సబ్ రిజిస్ట్రార్ శ్రీరామమూర్తి ఉన్నారు.