నెల్లూరులోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం | Mekapati Goutham Reddy Body To Shifted To Nellore | Sakshi
Sakshi News home page

నెల్లూరులోని నివాసంలో గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

Published Tue, Feb 22 2022 8:10 AM | Last Updated on Tue, Feb 22 2022 8:00 PM

Mekapati Goutham Reddy Body To Shifted To Nellore - Sakshi

Updates:

Time: 7.05
నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి మంత్రి పేర్ని నాని నివాళులు అర్పించారు.

Time: 6:49PM
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంతిమ యాత్ర రూట్ మ్యాప్
నెల్లూరు: బుధవారం ఉదయం 6.00 గంటలకు నెల్లూరులోని డైకాస్ రోడ్‌లోని మంత్రి గౌతమ్‌రెడ్డి నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలై జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాలెం, మర్రిపాడు, సరిహద్దు, బ్రాహ్మణపల్లి, నందిపాడు మీదుగా ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల వరకు జరుగుతుంది. అనంతరం ఉదయం 11.00 గంటలకు గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులు అర్పించిన అనంతరం అంత్యక్రియలు జరుగుతాయి.
గమనిక: మంత్రి గౌతమ్‌రెడ్డి పార్థివదేహం ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం నెల్లూరు పాలెం సెంటర్‌లో ఐదు నిమిషాలు ఉంచబడును.

Time: 4:53PM
నెల్లూరు: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పార్థివదేహానికి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాళులు అర్పించారు.

Time: 3:28PM
నెల్లూరు: అమెరికా నుంచి మంగళవారం రాత్రి వరకు గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి నెల్లూరు చేరుకోనున్నారు. రాత్రి 7 గంటలకు చెన్నై విమానాశ్రయానికి రానున్న అర్జున్ రెడ్డి.. చెన్నై నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు చేరుకుంటారు. 

Time: 3:15PM
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికి కాయానికి ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్ సవాంగ్‌, స్పెషల్ సీఎస్‌ పూనమ్ మాలకొండయ్య నివాళులు అర్పించారు.

Time: 3:02PM
రేపు (బుధవారం) దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప వెళ్లి అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉదయగిరికి సీఎం జగన్‌కు చేరుకోనున్నారు. ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్సెస్‌(మెరిట్స్‌) వద్ద జరిగే అంత్యక్రియల్లో పాల్గొంటారు. అనంతరం సీఎం జగన్‌ మధ్యాహ్నం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Time: 1:26 PM
నెల్లూరు: మంత్రి మేకాపాటి గౌతమ్‌రెడ్డి భౌతికి కాయానికి మంత్రులు మేకతోటి సుచరిత, గుమ్మనూరి జయరాం, శంకర్ నారాయణ, చెరుకువడ శ్రీ రంగనాథ రాజు, నారాయణ స్వామి నివాళులు అర్పించారు. 

Time: 1:10 PM
ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారు..
నెల్లూరు: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం పరిశ్రమల శాఖకు తీరని లోటని ఐటీ స్పెషల్‌ సెక్రటరీ వరవన్‌ అన్నారు. దుబాయ్‌ ఎక్స్‌పోలో గౌతమ్‌రెడ్డి ప్రజెంటేషన్‌ అక్కడి పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని.. రూ.5 వేల కోట్ల ఒప్పందాలు చేసుకున్నామన్నారు. దుబాయ్‌ పారిశ్రామిక వేత్తలు సైతం ఆయన లేరన్న నిజాన్ని నమ్మలేకపోతున్నారని వరవన్‌ అన్నారు.

Time: 12:03 PM
నెల్లూరులోని నివాసానికి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం..
నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయం తరలించారు. ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. రేపు(బుధవారం) ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Time: 11:52 AM
నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్‌..
నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు ప్రత్యేక హెలికాఫ్టర్‌ చేరుకుంది. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతిక కాయాన్ని తరలించనున్నారు.

Time: 11:37 AM
జీర్ణించుకోలేకపోతున్నాం: మంత్రి అనిల్‌
గౌతమ్‌రెడ్డి లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఏపీ ఇరిగేషన్‌ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చాల విషయాల్లోనూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించేవారన్నారు. పెద్దన్నను కోల్పోయినట్లు ఉందన్నారు. అధికారదర్పం ఉండేది కాదని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారన్నారు.

Time: 11:31 AM
గౌతమ్‌రెడ్డి లాంటి మంచినేత మళ్లీ తిరిగిరారు.. శోకసంద్రంలో  కార్యకర్తలు
గౌతమ్‌రెడ్డి మరణవార్త విని షాక్‌కు గురయ్యామని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తల పట్ల ఆయన ఎంతో ఆప్యాయత, ప్రేమతో ఉండేవారన్నారు. గౌతమ్‌రెడ్డి లాంటి మంచి నేత మళ్లీ తిరిగిరారని కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.

Time: 11:22 AM
కాసేపట్లో నెల్లూరుకి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
కాసేపట్లో నెల్లూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌కు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకోనుంది. పరేడ్‌ గ్రౌండ్‌ నుంచి గౌతమ్‌రెడ్డి నివాసానికి ఆయన భౌతికకాయాన్ని తరలించనున్నారు. గౌతమ్‌రెడ్డి నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. గౌతమ్‌రెడ్డి నివాసానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. ఆయన మరణంతో అభిమానులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

Time: 9:43 AM
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుండి నెల్లూరుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇంటి వద్దకు ప్రజలు,అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. మరికాసేపట్లో పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌కి హెలికాఫ్టర్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం చేరుకోనుంది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్  వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ నుండి మంత్రి గౌతమ్‌రెడ్డి ఇంటికి ఆయన పార్థివదేహాన్ని అధికారులు తరలించనున్నారు.

Time: 9:25 AM

కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం
కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. ఉదయం 11.25కి డైకాస్‌ రోడ్‌లోని క్యాంప్‌ కార్యాలయానికి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయం చేరుకోనుంది. ఉదయం 11.30 నుంచి ప్రజలు, అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. 

ఇప్పటికే అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు కృష్ణార్జునరెడ్డి బయలుదేరారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో కృష్ణార్జునరెడ్డి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది. రేపు ఉదయగిరిలో మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ ఆవరణలో గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. అంత్యక్రియల ఏర్పాట్లను మంత్రి అనిల్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు.

Time: 8:37 AM
హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని తరలించారు. 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో నెల్లూరుకు భౌతికకాయం తరలించనున్నారు.

Time: 8:10 AM
సాక్షి, హైదరాబాద్‌: నేడు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరుకు తరలించనున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి కాసేపట్లో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం తరలించనున్నారు. ఉదయం 10 గంటలకు అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఆయన భౌతికకాయం తరలిస్తారు. ఉదయం 11 గంటలకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకోనుంది.

చదవండి: శోకసంద్రంలో సింహపురి.. అజాతశత్రువు అకాల మృతితో తీవ్ర విషాదం

నేడు(మంగళవారం) నెల్లూరు అభిమానుల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఈరోజు రాత్రి అమెరికా నుంచి గౌతమ్‌రెడ్డి కుమారుడు అర్జున్‌రెడ్డి రానున్నారు. రేపు(బుధవారం) ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్‌ కాలేజీ ఆవరణలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు అధికారిక లాంఛనాలతో గౌతమ్‌రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరుకానున్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement