ఉదయగిరి: తప్పించుకు తిరుగుతున్న సిరిగోల్డ్ ఎండీ వేల సుందరాన్ని బుధవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఆ సంస్థ ఏజెంట్లు, లబ్ధిదారులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తిరుపతికి చెందిన వేల సుందరం, సత్యవేడు వాసి సుధాకర్, ఒంగోలు నివాసి వెంకయ్య 2007లో సిరిగోల్డ్‌ను స్థాపించారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కృష్ణా జిల్లాలతోపాటు, చెన్నై, గుల్బర్గాల్లో 20కి పైగా బ్రాంచీలు, పది వేలమందికి పైగా ఏజెంట్లను పెట్టుకుని రెండు లక్షల మంది ఖాతాదారుల నుంచి రూ.120 కోట్లుపైగా వసూలు చేశారు. ఈ డబ్బుతో బినామీ పేర్లపై ఆస్తులు కూడబెట్టాడు. 2013 నవంబర్‌లో ఈ సంస్థ బోర్డు తిప్పేసింది. కాగా, బుధవారం ఉదయగిరి వచ్చిన సుందరాన్ని బాధితులు పోలీసులకు అప్పగించారు. సిరిగోల్డ్ వ్యవహారంపై ఇప్పటికే సీబీసీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.
పోలీసుల అదుపులో సిరిగోల్డ్ ఎండీ
Published Thu, Jul 10 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:03 AM
Advertisement