పోలీసుల సమక్షంలో ప్రేమజంటకు వివాహం
సీతారామపురం : మండలంలోని చిన్నాగంపల్లి చెందిన అగ్నిగుండాల ఖాజమ్మ, సీఎస్‌పురం మండలం ఆనికేపల్లికి చెందిన హనుమంతు రమేష్‌కు శుక్రవారం ఇరువర్గాల పెద్దల సమక్షంలో స్థానిక కన్యకాపరమేశ్వరి ఆలయంలో పోలీసులు వివాహం జరిపించారు. ఖాజమ్మ, రమేష్ ఇద్దరు చెన్నైలోని పెయింగ్ గెస్ట్‌హౌస్‌లో పని చేస్తుండగా ఇద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు విషయం వివరించారు. ఖాజమ్మ కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించగా, రమేష్ తన కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు మేజర్లు అయినందున ఇరువర్గాల పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించి హిందూ సంప్రదాయం ప్రకారం వారికి వివాహం జరిపించినట్లు పోలీసులు అన్నారు.