Published
Thu, Dec 1 2016 11:43 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:38 PM
వివాహిత ఆత్మహత్య
కొండాపురం : పొదుపు నగదు విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న పాటి వివాదం నేపథ్యంలో మనస్థాపానికి గురై భార్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానిక బీసీ కాలనీలో బుధవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ రమేష్‌బాబు కథనం మేరకు.. గ్రామానికి చెందిన షేక్ నజీర్‌కు జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెంకు చెందిన జరీనా (25)తో 9 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే ఏడాది కాలంగా భార్యాభర్తల మధ్య కలతలు రేగాయి. తరుచూ గొడవ పడుతున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం జరీనాకు పొదుపు గ్రూపులో రుణం వచ్చింది. ఆ డబ్బుల విషయమై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి ఈ గొడవ ఇద్దరి మధ్య తీవ్రస్థాయికి చేరింది. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహన్ని పోస్ట్‌మాస్టరం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జరీనా తల్లి మస్తానమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఆరేళ్ల కుమారై సామీర, మూడేళ్ల కుమారుడు బషీర్ ఉన్నారు.