ఉదయగిరి సమన్వయకర్తగా రాజగోపాల్‌రెడ్డి | Sakshi
Sakshi News home page

ఉదయగిరి సమన్వయకర్తగా రాజగోపాల్‌రెడ్డి

Published Wed, Jun 28 2023 11:52 AM

- - Sakshi

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు: వైఎస్సార్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా మేకపాటి రాజగోపాల్‌రెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ఆయన మేకపాటి రాజమోహన్‌రెడ్డి రెండో సోదరు డు. ఇతను విద్యాపరంగా డిగ్రీ పూర్తి చేశారు. నలభై ఏళ్లుగా కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌లో కాంట్రాక్టర్‌గా ఉంటూ బెంగళూరులో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులిద్దరికీ కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించారు. 1983లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి రాజకీయ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి కీలకపాత్ర పోషించారు.

మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీ చేసిన సమయాల్లో కూడా ఈయన కీలకపాత్ర పోషించారు. ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని ఇటీవల వైఎస్సార్‌సీపీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మేకపాటి కుటుంబం నుంచి ఆదాల రచనారెడ్డి (మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూతురు)ని బరిలోకి దించాలని భావించారు.

అయితే ఆమె రాజకీయా లపై ఆసక్తి చూపకపోవడంతో ఆయన చిన్న తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి అవకాశం కల్పించాలని ఇటీవల ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డితో కలిసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ క్రమంలో రాజగోపాల్‌రెడ్డిని ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. దీంతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. సమన్వయకర్త నియామకంతో పార్టీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement