అటవీ ప్రాంతంలో తనిఖీలు
సీతారామపురం : మండలంలోని దేవమ్మ చెరువు బీట్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గుంటూరు స్పెషల్ బ్రాంచి స్కా ్వడ్ ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎఫ్‌ఆర్‌ఓ నాగేంద్రం అడవుల నుంచి అక్రమంగా ఎర్రచందనం తరలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అటవీ సంపద తరలకుండా నిరంతరం అడవుల్లో సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు అటవీ సిబ్బందికి సహకరించి అడవులను కాపాడుకోవాలని ఆ ప్రాంత ప్రజలకు సూచించారు. అటవీ సంపద అక్రమంగా తరలుతుంటే వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌ఓలు వంశీకృష్ణ, రాంబాబు, బాలశంకర్, రామ్మోహన్, ఎఫ్‌బీఓలు నసింహారెడ్డి, రాజు, సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.