నాయకులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మేకపాటి
సాక్షి, వింజమూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించడం ద్వారా ఉద్యోగాల విప్లవం తెచ్చారని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం ఆయన పార్టీ నాయకులతో పలు విషయాలపై చర్చించారు. ప్రజలకు సంబంధించిన సమస్యలను నాయకులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయ వ్యవస్థ పటిష్టం చేస్తూ 1.27 లక్షల పోస్టులను భర్తీ చేయనున్నారని తెలిపారు. అదే విధంగా గ్రామ వలంటీర్లు రెండున్నర లక్ష వరకు భర్తీ చేయనున్నామన్నారు.
దీంతో నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చి వారి కుటుంబ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాయన్నారు. వింజమూరుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును త్వరితగతిన ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి, నాయకులు మద్దూరి చిన్నికృష్ణారెడ్డి, మద్దూరి లక్ష్మీప్రసాద్‌రెడ్డి, దాట్ల విజయభాస్కర్‌రెడ్డి, చీమల హజరత్‌రెడ్డి, మండాది గోవిందరెడ్డి, అన్నపురెడ్డి బాలిరెడ్డి, నీలం సంజీవరెడ్డి, అన్నపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, సూరం వినోద్‌రెడ్డి, దాట్ల రమేష్‌రెడ్డి, నీచు బాలయ్య, దాట్ల కృష్ణారెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment