'పోలీసులే వాయిదా పడేందుకు సహకరించారు' | ysrcp mp's takes on tdp | Sakshi
Sakshi News home page

'పోలీసులే వాయిదా పడేందుకు సహకరించారు'

Published Sun, Jul 13 2014 6:24 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

'పోలీసులే వాయిదా పడేందుకు సహకరించారు' - Sakshi

'పోలీసులే వాయిదా పడేందుకు సహకరించారు'

నెల్లూరు: అధికారులంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థ తలదించుకునే విధంగా అధికారులందరూ మూకుమ్ముడిగా సహకరించారని విమర్శించారు. నెల్లూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక వాయిదా పడిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన..  టీడీపీ వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.  పోలీసులే ఈ ఎన్నిక వాయిదా పడేందుకు సహకరించారని తప్పుబట్టారు.

 

ఎవరెన్ని అరాచకాలు పాల్పడిన ప్రజలే న్యాయదేవుళ్లన్న సంగతి టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ అరాచకాలకు ఇదే నిదర్శనమని మరో ఎంపీ వరప్రసాద్ తెలిపారు. సభలో ఉన్న జడ్పీటీసీ సభ్యురాలిని పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లి భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement