డీఈఓ కార్యాలయ ఉద్యోగుల విభజనకు ప్రతిపాదన
Published Thu, Sep 1 2016 12:11 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోని వివిధ కేటగిరీల ఉద్యోగులను నాలుగు జిల్లాలకు విభజిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు డీఈఓ పి.రాజీవ్ ప్రతిపాదనలు పంపించారు. వరంగల్ జిల్లా డీఈఓ కార్యాలయంలో కేడర్ స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగిరీల్లో 60 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 54 మంది పనిచేస్తున్నారు.అందులో సూపరింటెండెంట్‌లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్‌లు, అటెండర్లు ఉన్నారు. వీరితో సమావేశం నిర్వహించి ఆయా కేటగిరీలో సీనియారిటీప్రకారం వారినుంచి జిల్లాల ఆప్షన్ తీసుకున్నారు. సీనియర్లు వరంగల్, హన్మకొండ జిల్లాలు కోరుకోగా మిగిలిన వారు మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాలు ఎంచుకున్నారు. జూనియర్లు తమకు ఇష్టం లేకు న్నా భూపాలపల్లి ఆప్షన్ ఇవ్వక తప్పలేదని డీఈవో కార్యాలయంలో బుధవారం చర్చ జరిగింది. అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరే ఉండటంతో వారు రెండు జిల్లాలకు ఆప్షన్ ఇచ్చుకోగా మిగితా రెండు జిల్లాలకు కొరత ఉం డనుంది. సూపరింటెండెంట్‌లకే తాత్కాలిక ఏడీలుగా ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగిస్తారని సమాచారం. ఇక ప్రస్తుతం డీఈఓ కార్యాలయం హన్మకొండలో ఉన్నందున వరంగల్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్ని వరంగల్ ఎంఆర్‌సీ భవన్‌లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అయితే ఆ భవనం సరిపోదని తెలుస్తోంది. దీంతో అక్కడే ఏదైనా ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయాలనే యోచన కూడా ఉంది. లేదంటే కొంతకాలం పాటు ప్రస్తుత కార్యాలయంలోనే కొనసాగించి హన్మకొండ జిల్లా కార్యాలయానికి ఎస్‌ఎస్‌ఏ భవనాన్ని కేటాయిస్తారే చర్చ కూడా సాగుతోంది. మహబూబాబాద్, భూపాలపల్లి డీఈఓ కార్యాలయాలను అక్కడి ఎమ్మార్సీ భవనాల్లో కొనసాగించాలని డీఈఓ రాజీవ్ ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు సమాచారం.
Advertisement
Advertisement