ఎన్‌ఎంఎంఎస్ విద్యార్థుల ఆధార్ నంబర్‌ను బ్యాంకులో సమర్పించాలి
Published Wed, Jul 27 2016 12:15 AM | Last Updated on Wed, Apr 3 2019 9:21 PM
విద్యారణ్యపురి : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష 2014, 2015 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల ఆధార్ నంబర్లను బ్యాంక్ అకౌంట్ నంబర్‌కు లింకు చేసేందుకు సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సం ప్రదించాలని డీఈఓ పి.రాజీవ్ కోరారు.
ఈ నెల 28వ తేదీ వరకు బ్యాంక్ అకౌంట్ నంబర్ తో విద్యార్థి ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాలన్నారు. మెరిట్ స్కాలర్‌షిప్స్ ప్రభుత్వం ద్వారా ఆయా విద్యార్థుల బ్యాంకు ఖాతా లో జమ చేస్తారని అన్నారు.
Advertisement
Advertisement