ఎన్ఎంఎంఎస్కు దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్ష రాసేం దుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ పి.రాజీవ్ బుధవారం తెలి పారు.
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లాపరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ పాఠశాలల్లో, వసతి సౌకర్యం లేని మోడల్ పాఠశాలల్లోని 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎన్ఎంఎంఎస్ పరీక్ష రాసేందుకు అర్హులన్నా రు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు ఫారాలు తగిన వివరాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్ఈ తెలంగాణ. ఓఆర్జీలో పొందాలన్నారు. పరీక్ష రసుం జనరల్, బీసీ విద్యార్థులకు రూ.100 చొప్పున, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ విద్యార్థులు రూ.50 చెల్లించాలన్నారు. ఎస్బీహెచ్ లేదా ఎస్బీఐ బ్యాంక్‌లో డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ తెలంగాణ స్టేట్, హైదరాబాద్ పేరున డిమాండ్ డ్రాఫ్ట్ తీసుకోవాలని తెలిపారు. వికలాంగుల అభ్యర్థులు జిల్లా మెడికల్ బోర్డు వారు జారీ చేసిన సర్టిఫికెట్‌ను జతపర్చాలన్నారు. అభ్యర్థులు ఆదాయ, కులధ్రువీకరణ పత్రం జిరాక్స్‌ను జతపర్చాలన్నారు. ఆధార్ నంబర్ యూఐడీ లేదా ఈఐడీ గల అభ్యర్థులు మాత్రమే ఫీజు చెల్లించేందుకు అర్హులన్నారు. పూర్తి వివరాలకు హన్మకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పరీక్ష రుసుము, దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ చివరి గడువుగా ఉందన్నారు. నవంబర్ 6వ తేదీన పరీక్ష నిర్వహిస్తారని డీఈఓ తెలిపారు.