‘గురువులు లేని సర్కారు బడులు’ | teachers not regulour in sum of the schools | Sakshi
Sakshi News home page

‘గురువులు లేని సర్కారు బడులు’

Published Sat, Mar 25 2017 12:48 PM | Last Updated on Sun, Sep 2 2018 4:52 PM

teachers not regulour in  sum of the schools

శ్రీకాకుళం: జిల్లాలోని సర్కారు బడుల్లో ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులకు ఏ విధంగా విద్యాబోధన జరుగుతుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ప్రశ్నించారు.  జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల స మావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని కలెక్ట ర్‌ లక్ష్మీనరసింహం పిలుపునివ్వడం అభినందనీయమేనన్నా రు. కానీ విద్యావ్యవస్థలో సమూల మార్పులు జరగాలన్నా రు.

కొంతమంది ఉపాధ్యాయులు తప్పు చేసినపుడు ఆ ప్ర భావం విద్యావ్యవస్థపై పడుతుందన్నారు. కోటబొమ్మాళి మండలం సరియాపల్లి యూపీ స్కూల్‌లో పనిచేస్తున్న హెడ్‌మాస్టర్‌ ఆర్‌.రమేష్, ఉపాధ్యాయుడు చల్లా ప్రేమానంద్‌లు తమ విధులను సరిగా నిర్వహించడం లేదని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు.  డీఈఓ ఆ స్కూల్‌కి వెళ్లి ఆకస్మిక తనిఖీ చేసే సమయంలో ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూ శాయన్నారు. ఆ సమయంలో ప్రధానోపాధ్యాయుడు గైర్హాజ రీలో ఉన్నారని, ఎలాంటి సీఎల్‌గానీ, లీవ్‌లెటర్‌గానీ పెట్టలేదన్నారు. అలాగే ఆ పాఠశాలలో పనిచేస్తున్న చల్లా దేవా నం దం అనే ఉపాధ్యాయుడు కూడా విధులకు డుమ్మా కొడుతున్నట్లు 
తెలిసిందన్నారు.

ప్రేమానందం అనే ఉపాధ్యాయుడు నెలకొకసారి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతుంటారని ఆ స్కూల్‌ పిల్లలు, తోటి ఉపాధ్యాయులే డీఈవోకు లిఖిత రూపంలో వాగ్మూలం కూడా ఇచ్చినట్లు పత్రికల్లో కూడా కథనా లు వచ్చాయన్నారు. చల్లా దేవానందం అనే ఉపాధ్యాయుడు కోటబొమ్మాళి మండలం కిష్టప్పాడులో పనిచేసేవాడని, డిప్యుటేషన్ ఈ స్కూల్‌కు వేయించుకున్నారన్నారు. ఫిబ్రవరి 25 వ తేదీ నుంచి ఆయన స్కూల్‌కు రాకుండా ఉండడంతో సంతకాలు కూడా చేయలేదన్నారు. చల్లా ప్రేమానందం మాజీ ఎం పీపీ బంధువు కావడంతోనే ఈ స్కూల్‌లో ఖాళీలు లేకపోయినప్పటికీ రాజకీయ పైరవీలు చేయించి ఎంఈవోతో కుమ్మక్కై పోస్టింగ్‌ కల్పించి డిప్యుటేషన్ పై పనిచేస్తున్నారని ఆరోపించారు.

సరియాపల్లి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు ప్రేమానందంలు కలసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు హాజరుకానప్పటికీ ప్రభుత్వం లక్షలాది రూపాయల జీతాలను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బాధ్యులు హెచ్‌ఎం, ఎంఈవోలేనన్నారు. డీఈవో పరిశీలించి నివేదికను కలెక్టర్‌కు ఇచ్చారని, దీనిపై కలెక్టర్‌ కఠిన చర్యలు తీసుకుని విద్యావ్యవస్థను మెరుగుపరచాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు యజ్జల గురుమూర్తి, కోరాడ రమేష్, ఆర్‌ఆర్‌ మూర్తి, తంగుడు నాగేశ్వరరావు, గుడ్ల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement