నేడు ‘పది’ పరీక్షల ఏర్పాట్లపై సమావేశం
Published Tue, Mar 7 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
అనంతపురం ఎడ్యుకేషన్ : ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై చర్చించేందుకు మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక ఆర్ట్స్ కళాశాలలోని డ్రామా హాలులో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు డీఈఓ లక్ష్మీనారాయణ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. నియమించబడిన సీఎస్‌లు, డీఓలు అందరూ హాజరుకావాలన్నారు.
Advertisement
Advertisement