శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాకాధికారి దేవానందరెడ్డి సోమవారం సాయంత్రం తెలిపారు. 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన రాజాం ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు వి. రామ్మూర్తి నాయుడు ని సస్పెండ్ చేశారు.
కాగా.. విధులకు సరిగా హాజరుకాని మరో టీచర్ పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. రాజాం మండలం గోపాలపురం ప్రాధమిక పాఠశాలలో పనిచేస్తున్న సీహెచ్ మురళి స్కూలుకు హాజరుకాకుండా డుమ్మా కొడుతుండటంతో.. ఆతనిని సస్పెండ్ చేసిన ట్లు డీఈవో తెలిపారు.
ఇద్దరు టీచర్ల సస్పెన్షన్
Published Mon, Dec 7 2015 6:07 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM
Advertisement
Advertisement