టీఎన్‌ఐ పరీక్ష కేంద్రాలకు ఆప్షన్లు ఇవ్వండి
Published Thu, Aug 11 2016 10:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
అనంతపురం ఎడ్యుకేషన్ :
ట్రైనింగ్ నీడ్స్ ఐడింటిఫికేషన్ టెస్ట్ (టీఎన్‌ఐటీ)కు హాజరయ్యే ఉపాధ్యాయులు తమకు అందుబాటులో ఉన్న పరీక్ష కేంద్రాల ఎంపిక కోసం ఆప్షన్లు ఇచ్చుకోవాలని డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల 20, 21 తేదీల్లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు.
కేంద్రాల ఎంపిక కోసం శుక్రవారం నుంచి ఈనెల 16 వరకు cse.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు నమోదు చేయాలని సూచించారు. ఈ వెబ్‌సైట్‌కు సంబందించిన లింకు జిల్లా విద్యాశాఖ అధికారి బ్లాగు ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే సబ్జెక్టు టీచర్లు రూ. 300 చలానా చెల్లించాలని సూచించారు.
Advertisement