విద్యార్థుల వివరాలను పక్కాగా
Published Fri, Sep 30 2016 10:25 PM | Last Updated on Mon, Sep 4 2017 3:39 PM
నిజామాబాద్‌అర్బన్ :
పాఠశాలల్లోని విద్యార్థుల వివరాలను పక్కాగా నమోదు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి లింగయ్య సూచించారు. జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో శుక్రవారం యూ డైస్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థుల వివరాలను పాఠశాలలు, తరగతుల వారీగా నమోదు చేయాలన్నారు. విద్యార్థులకు సంబంధించి 38 అంశాలను పకడ్బందీగా నమోదు చేసి కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. యూ డైస్‌ను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సీఆర్పీలకు వివరించారు. ప్రతి విద్యార్థి వివరాలు, ఆధార్‌కార్డు నంబర్ ద్వారా ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధానం ఉంటుందన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన సీఆర్పీలు, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్లకు డీఈవో ప్రశంసపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఆర్‌వీఎం పీవో శ్రీనివాస్ సీఆర్పీలు ఎం.ఎస్. కో–ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement