200 మంది టీచర్లపై సైబర్ క్రైం కంప్లైంట్ | cyber crime Compliant on 200 teachers | Sakshi
Sakshi News home page

200 మంది టీచర్లపై సైబర్ క్రైం కంప్లైంట్

Published Tue, Sep 29 2015 7:45 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

200 మంది టీచర్లపై సైబర్ క్రైం కంప్లైంట్

200 మంది టీచర్లపై సైబర్ క్రైం కంప్లైంట్

సైబర్ నేరానికి పాల్పడ్డారంటూ.. జిల్లాకు చెందిన 200 మంది ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదనరావు ఫిర్యాదు చేశారు.

సైబర్ నేరానికి పాల్పడ్డారంటూ.. జిల్లాకు చెందిన 200 మంది ఉపాధ్యాయులపై జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదనరావు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బదిలీలకు సంబంధించి ఉపాధ్యాయులు ఇతరుల అకౌంట్ కు లాగిన్ అయ్యి తప్పుడు ఫిర్యాదులు, అభ్యంతరాలు వ్యక్తం చేశారని.. దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని ఆయన వివరించారు.


జిల్లాలో ఇప్పటికి 800 అభ్యంతరాలు అందాయని.. వీటిలో అర్హత గల 500 అభ్యంతరాలను స్వీకరించామని చెప్పారు. పూర్తి విచారణ అనంతరం తప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేసిన ఉపాధ్యాయులను గుర్తించామని.. అన్నారు. బదిలీలకు సంబంధించి జిల్లాలో 4,573 దరఖాస్తులు అందాయని తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement