అనంతపురం ఎడ్యుకేషన్ : ఇన్‌స్పైర్–2017పై గురువారం అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 27లోగా ఇన్‌స్పైర్ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నామినేషన్ల ప్రక్రియపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఉదయం 10 గంటలకు గుత్తి డివిజన్, మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం డివిజన్ పరిధిలోని ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం కల్గిన ఒక్కో సైన్స్ ఉపాధ్యాయుడిని పంపాలని డీఈఓ ఆదేశించారు.