జిల్లాలో 22 నుంచి జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్ డివిజన్‌లో, ఖమ్మం జిల్లాలో ఇన్‌స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులకు మహబూబాబాద్ అనంతారం రోడ్డులోని మోడల్ స్కూల్‌లో ఎగ్జిబిషన్‌లు నిర్వహించబోతున్నామన్నారు.
-
డీఈఓ రాజీవ్
విద్యారణ్యపురి: జిల్లాలో 22 నుంచి జిల్లాస్థాయి ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.రాజీవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 22, 23, 24 తేదీల్లో మహబూబాబాద్ డివిజన్‌లో, ఖమ్మం జిల్లాలో ఇన్‌స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులకు మహబూబాబాద్ అనంతారం రోడ్డులోని మోడల్ స్కూల్‌లో ఎగ్జిబిషన్‌లు నిర్వహించబోతున్నామన్నారు. 25, 26, 27 తేదీల్లో వరంగల్, ములుగు, జనగామ, నల్గొండ జిల్లాలో ఇన్‌స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులకు స్టేషన్ ఘనపూర్ పట్టణం సమీపంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లు నిర్వహిస్తామన్నారు. ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌లో పాల్గొనే విద్యార్థులకు, గైడ్ టీచర్లకు మూడు రోజులపాటు భోజన, వసతి ఏర్పాటు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇన్‌స్పైర్ ఎగ్జిబిషన్‌ల నిర్వహణకు మండల విద్యాశాఖాధికారులు, పీజీహెచ్‌ఎంలను కన్వీనర్‌లుగా, కో కన్వీనర్లుగా నియమించామన్నారు. అలాగే 16 రకాల కమిటీలను కూడా ఏర్పాటు చేశామని డీఈఓ తెలిపారు.