జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద డిప్యూటేషన్‌పై పీఏ, పీఎస్‌లుగా పనిచేస్తున్న ఐదుగురు టీచర్లను ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి రాజీవ్ తెలిపారు.
ప్రజాప్రతినిధుల నుంచి ఉపాధ్యాయుల రిలీవ్
Sep 15 2016 12:37 AM | Updated on Sep 17 2018 5:10 PM
విద్యారణ్యపురి: జిల్లాలో ప్రజాప్రతినిధుల వద్ద డిప్యూటేషన్‌పై పీఏ, పీఎస్‌లుగా పనిచేస్తున్న ఐదుగురు టీచర్లను ఆ పోస్టుల నుంచి రిలీవ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి రాజీవ్ తెలిపారు.
ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఎంఎల్‌సీ వెంకటేశ్వర్లు వద్ద ఉన్న మరిపెడ మండలం విసంపెల్లి ఎంపీయూపీఎస్ ఉపాధ్యాయుడు ఎం. రవీందర్‌ను, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వద్ద ఉన్న పి నరేంద్రస్వామిని (రంగశాయిపేట పీఎస్) రాజ్యసభ మాజీ సభ్యురాలు గుండు సుధారాణి వద్ద ఉన్న ఆర్.రాంరెడ్డి (అలంకానిపేటపీఎస్), పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వద్ద ఉన్న తవటం శ్రీనివాస్‌ను(బద్రిగూడెం తండా పాఠశాల), ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌వద్ద ఉన్న పి వెంకటేశ్వర్‌రావు (మామునూర్ జెడ్పీఎస్‌ఎస్)ను, జిల్లా సైన్స్‌సెంటర్‌లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న రావుల శ్రీధర్ (గవిచర్ల హైస్కూల్) డిప్యూటేషన్‌ను రద్దుచేసినట్లు వివరించారు. ఆయా ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విధుల్లో చేరాలని కోరారు.
Advertisement
Advertisement