ఏలూరు సిటీ : డీసెట్–16 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్, మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో మార్పులు చేశారని, కొత్తగా జారీ చేసిన షెడ్యూల్‌ను అభ్యర్థులు గమనించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం విలేకరులకు తెలిపారు.
డీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో మార్పులు
Published Tue, Jul 26 2016 10:00 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
ఏలూరు సిటీ : డీసెట్–16 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులకు వెబ్ ఆప్షన్స్, మొదటి, రెండో విడత కౌన్సెలింగ్‌లో మార్పులు చేశారని, కొత్తగా జారీ చేసిన షెడ్యూల్‌ను అభ్యర్థులు గమనించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం విలేకరులకు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా ప్రభుత్వంచే ఆమోదం పొందిన ప్రై వేటు కాలేజీలు 492, ప్రభుత్వ Mలేజీలు 14 ఉన్నాయన్నారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్స్ వచ్చేనెల 1వ తేదీ వరకు నిర్వహిస్తారని, సీట్ల కేటాయింపు 2వ తేదీ నుంచి 5 వరకు నిర్వహిస్తారన్నారు. సీట్ల కేటాయింపు పత్రాలు 6వ తేదీన డౌన్‌లోడ్ చేసుకోవాలని, 7, 8 తేదీల్లో ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు. కళాశాలల్లో తరగతులు ఆగస్టు 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు.
రెండో విడతకౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆగస్టు 12వ తేదీ నాటికి జిల్లాలో ఖాళీల జాబితాను డైట్ కాలేజీ ప్రిన్సిపల్స్ తెలియజేయాల్సి ఉంటుందని చెప్పారు. 11వ తేదీ నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్స్, 16 నుంచి 18 వరకు సీట్ల కేటాయింపు, 19న సీట్లు కేటాయిస్తూ పత్రాల జారీ, 20వ తేదీ నుంచి 22 వరకు డైట్ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభ్యర్థులు మొదటి విడత కౌన్సిలింగ్‌కు హాజరై ఏదైనా కళాశాలలో సీటు కేటాయింపు జరిగితే కళాశాల మార్పుకు రెండో విడత కౌన్సిలింగ్‌లో అనుమతి ఉండదని డీఈవో స్పష్టం చేశారు.
Advertisement
Advertisement