- భవనాన్ని పరిశీలించిన ఇంజనీర్లు, అధికారులు
- రెండు డిప్యూటీ ఈఓ ఆఫీస్‌లు ఏర్పడే అవకాశం
ఎంఈఓ భవనంలోనే డీఈఓ కార్యాలయం
Published Sun, Sep 4 2016 12:22 AM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM
మహబూబాబాద్ : జిల్లాల పునర్విభజనతో మానుకోట జిల్లాకు డీఈఓ కార్యాలయాన్ని మండలకేంద్రంలో ఎంఈఓ కార్యాలయంలోనే ఏర్పాటు చేయనున్నారు. ఇక డిప్యూటీ ఈఓ కార్యాలయం పరిధిలోని కొన్ని మండలాలు ఇతర జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. మరో డిప్యూ టీ ఈఓ కార్యాలయం ఏర్పాటయ్యే అవకాశం ఉన్నాయి. మానుకోట ఎంఈఓ కార్యాలయంలో 8 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి ఎంఈఓకు కేటాయించగా రెండు గదులు డిప్యూటీ ఈఓ కార్యాలయానికి వినియోగిస్తున్నారు. ఒక గది స్టోర్ రూమ్‌గా, మరో గది హాల్ కోసం ఉంది. ఇంకా మూడు గదులే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ భవనం పైఅంతస్తు నిర్మిం చాలా.. లేక ఖాళీ స్థలంలో మరికొన్ని గదులు నిర్మించాలా.. అనే విషయంపై శుక్రవారం విద్యాశాఖ ఇంజనీర్లు పరిశీలించారు.
డిప్యూటీ ఈఓ పరిధిలోకి 19 మండలాలు
డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి 19 మండలాలు వెళ్లాయి. చెన్నారావుపేట, డోర్నకల్, దుగ్గొండి, గీసుకొండ, గూడూరు, ఖానాపూర్, కొత్తగూడ, కేసముద్రం, కురవి, మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, నర్సంపేట, నర్సింహులపేట, నెక్కొండ, నెల్లికుదురు, పర్వతగిరి, సంగెం, రాయపర్తి మండలాలు ఉన్నాయి. కాగా చెన్నారావుపేట మండలం, దుగ్గొండి, గీసుకొండ, ఖానాపూర్, నర్సంపేట, నెక్కొండ, పర్వతగిరి, సంగెం మండలాలు వరంగల్ జిల్లా పరిధిలోకి వెళ్లాయి. రాయపర్తి మండలం హన్మకొండ జిల్లాలో చేరింది.
కొత్తగా రెండు మండలాల చేరిక
డిప్యూటీ ఈఓ కార్యాలయ పరిధిలోకి కొత్తగా బయ్యారం, గార్ల మండలాలు చేరాయి. డీఇఓ కార్యాలయం పరిధిలోనూ రెండు మండలాలు ఉంటాయి. కాగా గూడూరు, కొత్తగూడ, బయ్యారం, గార్ల ఏజెన్సీ మండలాలు ఉండటంతో మరో డిప్యూటీ ఈఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు అంటున్నారు.
Advertisement
Advertisement