ప్రకాశం జిల్లాలో 'గురువుపై రాజకీయ పంజా' అంటూ సాక్షి కథనానికి స్పందన లభించింది. సీఎస్ పురం మండలం అంబవరానికి చెందిన ఉపాధ్యాయుడు ...
ఒంగోలు : ప్రకాశం జిల్లాలో 'గురువుపై రాజకీయ పంజా' అంటూ సాక్షి కథనానికి స్పందన లభించింది. సీఎస్ పురం మండలం అంబవరానికి చెందిన ఉపాధ్యాయుడు కమ్మనేటి వెంకటేశ్వర్లుకు జీతం ఇవ్వకుండా రాజకీయంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ సాక్షి టీవీ వరుస కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ కథనాలపై డీఈవో కార్యాలయం స్పందించింది. ఉపాధ్యాయుడికి తక్షణమే జీతం చెల్లించాల్సిందిగా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. గత అయిదు నెలలుగా బకాయి పడ్డ జీతాన్ని వెంకటేశ్వర్లుకు చెల్లించారు.